ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

ఇంటర్నెట్ రాజ్యమేలుతున్న నేటిసైబర్ ప్రపంచంలో అరచేతిలోనే సమస్త వార్తా విశేషాలు, సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి. ప్రపంచంలో ఏమి జరిగినా క్షణంలో తెలుసుకోగలుగుతున్నాం ఇంటర్నెట్ సాయంతో. ప్రస్తుతం పుస్తకాలు, పత్రికలు చదివేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది. నేడు యువత ఎక్కువగా ఇంటర్నెట్ ను వుపయోగిస్తున్నారు. సాంకేతికతను అందిపుచుకోవడానికి ‘ఈ-పేపర్లు ‘ప్రారంభించాయి, ఇక్కడ కూడా యాడ్స్ ద్వారా ఆదాయం ఉంది కాబట్టి వార్తలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు.
ఆన్లైన్ న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతి 36,92000 చదువరులతో మొదటి స్థానంలో ఉండగా, సాక్షి 34,33000 చదువరులతో రెండో స్థానంలో ఉంది. ఇక ఈనాడు 3400000 చదువరులతో మూడో స్థానంలో నిలబడింది. రెండు లక్షల అధిక చదువరులతో ఆంధ్రజ్యోతి మొదటి స్థానంలో ఉన్నట్లు ‘అలెక్షా అనాలసిస్ ‘ ప్రకారం నిర్ధారించబడింది. దీనికి ఆంధ్రజ్యోతి హోమ్ పేజీ లోనే ఏ.బీఎ.న్. టీవీని అందుబాటులో ఉంచడం ఒక కారణం కావచ్చు. ప్రింట్ మీడియాలో అయితే ఏ.బి.సి. లెక్కల ప్రకారం ఈనాడు మొదటి స్థానంలో ఉండగా సాక్షి, ఆంధ్రజ్యోతి లు వరుసగా రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి. అలాగే యాడ్ రెవెన్వూ లో కూడా మొదటి స్థానం లో వుండి ఆంధ్రజ్యోతి.

5 thoughts on “ఈనాడు, సాక్షి లను క్రాస్ చేసిన ‘ఆంధ్రజ్యోతి ‘

  1. పనికిమాలిన న్యూస్ పేపర్ ఆంధ్రజ్యోతి. ఒక్కటీ నిజం ఉండదు. టిడిపి కి బాకా ఊదటానికి, టీడీపీ కరపత్రం గా, దుకాణాలలో పొట్లాలు కట్టుకోవటానికి తప్ప దేనికీ పనిచేయదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap