ఒకప్పుడు పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా తో పోటీపడి, తమ ఉనికిని కాపాడుకున్నా, నేడు ఇంటర్నెట్- సోషల్ మీడియాతో పోటీ పడలేక ఇబ్బందిపడుతున్న సందర్భంలో ఈ ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రస్తుతం పత్రికల మనుగడకే ముప్పు వచ్చింది. గతంలో పొద్దున్నే లేచి టీ తాగుతూపేపరు చదివి వార్తలు తెలుసుకునే వారు. ప్రస్తుతం అర్థ రాత్రి వరకూ వార్తలు తెలుసుకొని పడుకుంటున్నారు. అయినా వార్తలు చదవడం కంటే వినడానికే ఆసక్తి చూపుతున్నారు నేటి యువత. ప్రస్తుతం ఏ.బి.సి. ఇచ్చిన నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి సర్కులేషన్ ఇలా ఉంది. దీని ప్రకారం లాక్ డౌన్ కు ముందు కంటే సర్కులేషన్ లో తగ్గుదల కనిపిస్తుంది. దీనికి కొంత మంది పేపర్ ద్వారా వైరస్ వస్తుందని వార్తా పత్రికలకు దూరంగా వుండడం కూడా ఒక కారణం కావచ్చు. ఇప్పటికే కొన్ని పత్రికలు వెబ్ మీడియా మీద దృష్టిపెట్టాయి. ఈనాడు ప్రచురణలయిన తెలుగు వెలుగు, బాలభారతం,చతుర, విపుల పత్రికలను ఆన్లైన్ లో అందుబాటులోకి తెచ్చాయి. ఈనాడు ఇప్పటికే న్యూస్ కోసం ఒక యాప్ ని అందుబాటులోకి తెచ్చింది.
సాక్షి పత్రిక కే అత్యధిక ప్రకటనలు…
ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మే 23, 2019 నుండి మే 2020 వరకు ప్రకటనల రూపంలో వివిధ పత్రికలకు ఖర్చు పెట్టిన విలువ ఇలా ఉంది. ఇందులో అత్యధిక శాతం అంటే 52 శాతం సాక్షి కి, 39 శాతం ఈనాడు కి, ఆంధ్రజ్యోతికి పత్రికకు కేవలం 0.25% ఇచ్చారు. సంవత్సరకాలంలో 100 కోట్లు ప్రకటనల కోసం ఖర్చు చేసిన ఏ.పి. ప్రభుత్వం ఏ పత్రికకు ఎంత మొత్తంలో ఇచ్చినది క్రింది పట్టికలో చూడవచ్చు.