ఎంకి పాటలు స్వచ్చమైన స్పటిక సదృశ్యమైన గ్రామీణ యువతీ యువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. నండూరి సుబ్బారావు గారు పల్లె జీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయ సౌరభాలని ఎంకి – నాయుడు బావ పాత్రలతో పాటల ద్వారా మనకందించారు. 1926 లో రాసిన కూని పాటలకు కొత్త పాటలు చేర్చి 1952 పుస్తకంగా ప్రచురించారు.
పల్లీయుల ప్రాకృతిక ప్రణయ భావణలను సుమనోహరంగా వర్ణించిన నండురి వారి తెలుగు పాటకులకు కానుకగా అందించాలన్న సదుద్దేశ్యంతో ఎమెస్కొ విజయకుమార్ గారు సుప్రసిద్ద చిత్రకారుడు కీ.శే. కళాభాస్కర్ రెండు దశాబ్దాల క్రితం ఆంధ్రభూమిలో తన కుంచెతో రంగు లద్దిన ఎంకి బొమ్మలతో ఈ పుస్తకాన్ని ముద్రించారు. అప్పట్లో ఆంధ్రభూమి వీక్లీ లో పాటకులను అలరించిన ఈ బొమ్మలు – నండూరి వారి పాటకులకు మరెంతో వన్నె చేకుర్చాయి.
సుమారు 68 పేజీల ఈ పుస్తకంలో పేజీకో బొమ్మ – పాట చొప్పున ఆర్ట్ పేపర్ పై ముచ్చటగా ముద్రించారు.
గుండె గొంతుకలోన కొట్లాడుతాదని తన కవితాయాత్రను ప్రారంభించాడు కవి.
‘ఒక్క నేనే నీకు”
పెక్కు నీవు నాకు ‘
యెనక జన్మములోన
యెవరమో నంటి ‘
‘కలయె తెలుపు మన మనుసులు
కలయిక నిజానిజాలు ‘
కళ్ళెత్తితే సాలు అందాలు తెలప ‘
వంటి అద్భుత భావ ప్రకటనల సమాహారం ఈ ఎంకి పాటలు ఎంకి నాయుడు బావని సజీవ చిత్రాలుగా నండురి వారు ఎంకిని సృష్టిత్తే , కళాభాస్కర్ కుంచె ఆ అక్షరాలను పట్టుకొని బొమ్మలుగా మార్చింది. వెరసి అద్భుతలోకంలో విహరింప జేసే ఈ రంగుల బొమ్మల పుస్తకం సాహిత్త్యాభిమానులకు, చిత్రకళాభిమానులకు ఎమెస్కో వారు అందిచిన గొప్పవరం.
మంచి పుస్తకాన్ని ప్రచురించిన ఎమెస్కో విజయకుమార్ గారికి, వారికి సహకరించిన మిత్ర బృందానికి అభినందనలు.
-కళాసాగర్
Where can i get this book and its price pl.
అమెజాన్ లో లేక ఎమెస్కో లో దొరుకుతుంది.
Thanks Kannaji rao garu
Good book.