మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

సమాజానికి ఒక వ్యక్తి చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఆవ్యక్తికి విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి సన్మానాలతో గౌరవిస్తుంటాయి. దీనివలన ఆవ్యక్తిని బట్టి ఆవిశ్వ విద్యాలయాలకు గౌరవం పెరుగుతుంది. ఆవ్యక్తికి కూడా సమాజంలో మంచి గౌరవం ఉంటుంది. గతంలో రాజగోపాలాచారి (రాజాజీ)గారికి ఒక యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ యిచ్చింది. తరువాత రాజాజీ గారు బయటికొచ్చినపుడు ఙనం డాక్టరుగారు, డాక్టరు గారు అనటం మొదలుపెట్టారు. ఇలా పిలిపించుకోవటం అయనకు ఇష్టం లేక అలా పిలవద్దు, వాళ్ళేదో నామీద గౌరవం కొద్దీ గౌరవ డాక్టరేట్ ఇచ్చారు, నేను డాక్టరు కాదు అనిచెప్పేవాడు.
నాలుగురోజులక్రితం పద్మావతి మహిళా యూనివర్సిటీవారు ఓల్గా గారికి గౌరవ డాక్టరెట్ ఇచింది. నలభై సంవత్సరాలుగా అమెరచయితగాను, ఒక స్త్రీవాద మహిళగాను ఎంతోసేవలుచేసింది. అందుకు గౌరవంగా ఆమె ఆగౌరవంపొందింది.
డాక్టరేట్లు అంటే అలాంటి వారికి ఇవ్వాలి.

ఆలాగే 50 ఏళ్ళక్రితం మద్రాసు రాష్ట్రంలో ఈవిధమైన గౌరవ డాక్టరేట్లను చాలామందికి ఇచ్చినకారణంగా, వాళ్ళు సన్మానాలు చేయించుకోవటం, పందిళ్లు, ఉపసన్యాసాలు చేస్తుండేవారు. ఈ తంతు కొంచెం ఎబ్బెట్టుగా ఉండేవి. ఇది నచ్చని తుగ్లక్ పత్రిక ఎడిటర్ “ఛో ” రామస్వామి ఈ పద్ధతిని ఎగతాళి చెయ్యాలనుకొని, మద్రాసులోని మెరీనా బీచ్ లో ఒకసాయంకాలంపూట వందమందిని రిక్షావాళ్ళని, హమాలీలను పిలిచి వారికి తుగ్లక్ పత్రిక తరపున గౌరవ డాక్టరేట్లను ఇచ్చాడు. ఆరోజుల్లో ఇది పెద్ద సంచలనం కలిగించింది. అంటే డాక్టరేట్లు అనేది అంతచులకన ఐపోయిందన్నమాట.

మరి ఈరోజు కూడా అదేతంతు జరుగుతుంది.
డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినతరువాత గౌరవ డాక్టరేట్లు అంగడి సరుకుగా మారిపోయాయి. జనాలని మోసంచేసి బతికేవారికి కూడా ఈ డీమెడ్ యూనివర్సిటీలు గౌరవ డాక్టరేట్లు ఇస్తున్నాయి.
చిన్నపుడు సినిమా హాల్స్ లో బ్లాక్ టికెట్లు అమ్ముకునే శేషసాయిశర్మ, బాలసాయిబాబా అయ్యాడు. అయన చెక్ బౌన్స్ కేసులోనూ, కర్నూలు తుంగభద్ర ఒడ్డున ప్రభుత్వభూమి ఆక్రమించిన కారణంగా చాలాసార్లు అరెస్టు కాబడ్డాడు. ఈ డీమ్డ్ యూనివర్శిటీలు అయనకు కూడా డాక్టరేట్లు ఇచ్చాయి.
పెనుగొండలో గుప్తనిధులకోసం కృష్ణదేవరాయ కోటను సైతం తవ్విపారేసిన కాళీప్రసాద్ బాబాకి కూడా డాక్టరేట్లు ఇచ్చాయి ఈ డీమ్డ్ యూనివర్శిటీలు.

అంతెందుకు ప్రస్తుతం అరునెలల నుండి చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటున్న విజయవాడ దొంగ బాబా కాణాల అచ్చిరెడ్డికి కూడా గుంటూరులో ఒక డీమ్డ్ యూనివర్శిటీ” క్రిస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్శిటీ “వారు గౌరవ డాక్టరెట్ ప్రదానం చేసారు.
ఇంకొకడు జనాలను నిత్యం టీవిలలో కనిపిస్తూ మోసం చేస్తున్న హైద్రాబాద్ జ్యోతిష్కుడు లక్ష్మి కాంతశర్మ కూడా ఇదే డీమ్డ్ యూనివర్శిటీ నుండి గౌరవ డాక్టరెట్ పొందాడు.
మొన్న గుంటూరు విజ్ఞాన యూనివర్శిటీ వారు ఒక రామకృష్ణ అనే వ్యక్తికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది . ఈయన సమాజానికి ఏమిసేవలు చేసాడని ఇచ్చిందో విజ్ఞాన యూనివర్శిటీ వాళ్ళు చెప్పాలి.
నిజంగా ఈరోజు డీమ్డ్ యూనివర్శిటీ వాళ్ళు పనికిమాలిన వారికి , మోసగాళ్లకు గౌరవ డాక్టరేట్లు ఇచ్చి డాక్టరేట్లకున్న గౌరవాన్ని పోగొడుతున్నాయి. అందుకే మసక బారుతున్న గౌరవ డాక్ట “రేట్లు “ అని సమాజం అనుకుంటుంది. ఈరకంగా ఇచ్చే గౌరవ డాక్టరేట్లను ఇచ్ఛే డీమ్డ్ యూనివర్శిటీల గుర్తింపును రద్దు చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాము.

జేవీ. కృష్ణయ్య,
ప్రధానకార్యదర్శి
A.P.హేతువాదసంఘం

1 thought on “మసకబారుతున్న గౌరవ డాక్ట ” రేట్లు “..

  1. డాక్ట’rate’ బాగుంది….
    ఇంక మరెన్నో బాద కల్గించే డాక్టరేట్లున్నారు.
    బి ఎ రాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap