కళ తోనే సామాజిక చైతన్యం సాధ్యం…!

ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ & జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను అనే అంశంపై చిత్రకారులకు నిర్వహించిన ఆర్ట్ కాంటెస్ట్ కు వచ్చిన చిత్రాలతో ప్రదర్శన మరియు గెలుపొందిన గెలుపొందిన విజేతలకు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం (18-02-23) ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ, బాలోత్సవ్ భవన్ మొదటి అంతస్తు లో ఘనంగా జరిగింది.

చిత్రకళా ప్రదర్శనను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వాతావరణ శాస్త్ర నిపుణులు డా.ఎస్.బి.ఎస్. నరసింహారావు లాంఛనంగా ప్రారంభించారు..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పకృతి విపత్తుల వలన రైతు తీవ్రంగా నష్టపోతున్నారని…ఆ రైతుల యొక్క ఆక్రందనను తెలియ పరిచేందుకు ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ & జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ఆక్రందన @ మిచౌంగ్ తుపాను రాష్ట్రం నలుమూలల నుంచి విశేష స్పందన లభించటం చాలా హర్షించదగ్గ విషయమని, కళలు సామాజిక చైతన్యానికి ఉపయోగపడేలా ఉంటే ఎన్నో విషయాలను సామాన్య ప్రజలకు చేరేలా చూడొచ్చని అన్నారు. ఈ కార్యక్రమానికి జాషువా సాంస్కృతిక వేదిక అధ్యక్షులు ఎ.సునీల్ కుమార్ అధ్యక్షత వహించగా అతిథులు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నుంచి ఎం.సూర్యనారాయణ, ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ జనరల్ సెక్రటరీ స్ఫూర్తి శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నుంచి ఎం.హరిబాబు, జాషువా సాంస్కృతిక వేదిక ప్రధాన కార్యదర్శి గుండు నారాయణరావు, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం బాధ్యులు పిన్నమనేని మురళీ కృష్ణ లు రైతు సమస్యలు వాటికై కళల ఆవష్యకత అనే అంశంపై మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పిచ్చుక ను చేసుకుందామా మచ్చిక అనే నినాదంతో స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్ & ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సంయుక్తంగా నిర్వహించబోతున్న సేవ్ స్పారో జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల పోస్టర్ ను అతిథుల చేతుల మీదుగా విడుదల చేసారు

అనంతరం విజేతలకు క్యాష్ అవార్డు లతోపాటు, ప్రశంసా పత్రాలు, జ్జాపికలు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ ఉపాధ్యక్షుడు గిరిధర్ అరసవల్లి, ఉప కార్యదర్శి ఎస్.పి. మల్లిక్, మహిళా విభాగం ఇన్చార్జి సంధ్యారాణి, వర్కింగ్ కమిటీ మెంబెర్స్ శ్రావణ్ కుమార్, మేడా రజని, నారాయణ రావు, సౌజన్య, లక్ష్మీ ప్రియాంక, సింధూశ్రీ లతో పాటు నగరానికి చెందిన పలువురు కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. 64కళలు.కామ్ ఎడిటర్ కళాసాగర్ పోటీల్లో పాల్గొన్న చిత్రకారులందరికీ 64కళలు.కామ్ పత్రిక తరపున ‘ఆర్టిస్ట్ వాటర్ కలర్ సెట్’ లను మరియు స్కెచ్ బుక్ లను అందజేశారు.

 -శ్రావణ్ కుమార్

SA:

View Comments (1)

  • ైతుల బాదలను చిత్రాలతో చిత్రించడం *అభినందనీయం*