ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కళాసేవ
నేడు విశాఖలో కవులు, కళాకారులు, రచయితల ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
ప్రముఖ చిత్రకారుడు, రచయిత బాలి గీసిన చిత్రాలు 64 కళలకు ప్రతిబింబాలుగా నిలుస్తాయని
నాగార్జున విశ్వవిద్యాలయం పూర్వపు ఉపకులపతి ఆచార్య బాలమోహన్ దాస్ కొనియాడారు. చిత్రకారుడిగా ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న బాలిని ఆదివారం ఇక్కడ పౌర గ్రంథాలయంలో కవులు, కళాకారులు, రచయితలు ఘనంగా సన్మానించి సత్కరించారు.
విశాఖపట్టణం పౌర గ్రథాలయంలో 27-11-22 న, ఆదివారం ఉదయం విశాఖ సంస్కృతి సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బాల మోహన్ దాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. బాలి రాసిన కథలన్నీ జీవిత సత్యాలని, కార్టూన్లు హాస్యగుళికలని మోహన్ దాస్ పేర్కొన్నారు. సమాజానికి అవసరమైన రీతిలో మంచి సందేశం ఇచ్చే విధంగా కార్టూన్లు గీసిన బాలి దేశవ్యాప్తంగా ఎంతో మంది గుండెల్లో అభిమానం సంపాదించుకున్నారన్నారు… విశిష్ట అతిథిగా హాజరైన సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ నేటి తరం వారికి బాలి ఆదర్శప్రాయుడు అన్నారు.
బాపు లాంటి చిత్రకారునికి సమకాలీనుడిగా రాణించి, ఆరు దశాబ్దాలుగా ఎన్నో ప్రముఖ పత్రికలు, వార, మాస పత్రికలకి తన వేలాది చిత్రాల ద్వారా సేవలు అందించడం గర్వ కారణము అన్నారు. దేశములో ఎంతోమంది ప్రశంసలు పొందడలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. దేశములో ఎంతోమంది ప్రశంసలు పొందడలో ఆయనకు ఆయనే సాటి అన్నారు. బాలి వంటి చిత్రకారుడు మరింతగా సేవలు అందిస్తే అది సమాజానికి ఉపయోగకరమైన రీతిలో దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో విశాఖ సంస్కృతి వ్యవస్థాపకులు సిరాల సన్యాసిరావు మాట్లాడుతూ బాలి అందించిన లక్షలాది బొమ్మలు, రచనలు తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిపోయాయి అన్నారు. తమ సంస్థ ద్వారా బాలిని సత్కరించుకోవడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. విశాఖ రచయతలు సంఘము ప్రతినిధులు మేడ మస్తాన్ రెడ్డి, వి. రామకృష్ణ, అడపా రామకృష్ణలు. ద్విభాష్యం రాజేశ్వరరావు, దామెర వెంకట సూర్యారావు, జోగారావు తదితరులు బాలి అందించిన సేవలు కొనియాడారు. పి. నాగలక్ష్మి ప్రార్ధనా శ్లోకంతో ప్రారంభించారు. నార్త్ కోస్టలాంధ్రా కార్టూనిస్ట్స్ ఫోరమ్ కార్టూనిస్ట్ సభ్యులు శర్మ, వర్మ, టి ఆర్ బాబు, జగన్నాధ్, లాల్, మల్లారెడ్డి మురళీమోహన్, వందన శ్రీనివాస్, కార్టూన్ ఇష్టుడు నరసింహమూర్తి, రచయిత కో.నే. తదితరులు హాజరయ్యారు.
ఆరు దశాబ్దాలుగా కళామతల్లి సేవలో తరిస్తున్న… భాగ్యశాలి బాలి గారికి… అభినందనలు తెలియజేస్తుంది 64కళలు.కాం పత్రిక.
-కళాసాగర్
శ్రీ బాలి గారు వర్ధమాన చిత్రకారులకు, కార్టూనిస్టులకు, రచయితలకు ఒక స్ఫూర్తి దాయకంగా నిలిచిన గొప్ప కళాకారుడు. ఆయన్ని సత్కరించడం అంటే కళలను సత్కరించడమే.శ్రీ బాలి గార్కి అభినందనలు!-💐Bomman