నిరంతర చైతన్య శీలి ఓల్గా

(అక్టోబర్ 27న యానాంలో శిఖామణి సాహితీ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా)

ఓల్గాను గురించి మాట్లాడ్డమంటే తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం సమగ్ర స్వరూపాన్ని రెండక్షరాల్లో ఇమడ్చడమే. సాహిత్యంలో అన్ని ప్రక్రియలను స్త్రీ వాద సంభరితం చేయడంకాక, ఉపన్యాసంతో సహా ఇతర కళారంగాలన్నిటిలోనూ కూడ స్త్రీవాద చైతన్యాన్ని నిక్షేపించి, స్త్రీవాదానికి చిరునామాగా మారిన ప్రతిభావంతురాలు ఓల్గా కవిత్వం, కథ, నవల, విమర్శ, కాలమ్, అనువాదం, నాట కాలతో పాటు, చలనచిత్రం, టీవీ సీరియల్, నాట్యం, పాట లతో సహా రచించి, ఏది రాసినా స్త్రీవాద భావజాలాన్ని ప్రక టించి, అన్ని రకాల పాఠకు లనూ, ప్రేక్షకులనూ ఈ భావజాలానికి సన్నిహితంగా తెచ్చిన ఘనత ఆమెకు దక్కు తుంది. స్త్రీవాదం ఆమెతో పుట్ట లేదు. నిజమే. కానీ, ఈ సిద్దాంతాన్ని గురించి, దాని అవసరాన్ని గురించి, తన సమకాలీనులందరికంటే స్పష్టత ఆమెలో ఉంది. తను మాట్లాడు తున్నది ఎవరికోసమో, ఎందు కోసమో, దాని వల్ల సమాజం లోనూ, అన్ని మానవ సమాజ వ్యవస్థల్లోనూ మాన వీయతను ఎలా పెంపొం దించ వచ్చే ఆమెకు తెలుసు. ఓల్గా చెప్పే స్త్రీవాదం స్త్రీల అభ్యున్నతికి సంబంధించింది మాత్రమే కాదు. మొత్తంగా మానవీయ మైన ప్రజాస్వామికమైన సంబంధాలతో కూడిన వ్యవస్థను నెలకొల్పడానికి ఉద్దేశించింది. తన సృజనశీలతను అసాధారణ నిబద్ధతతో ఈ దిశగా ఆమె ఉపయోగించుకుంది. ఇంకా ఉపయోగించుకుంటున్నది. ఈ ప్రవాహశీలతే ఆమె బలం, స్త్రీవాద సాహిత్యాన్ని సృజిం చిన ఎన్నో కలాలు నెమ్మదిం చినా, కొన్ని నిలిచిపోయినా, ఆమెలో మాత్రం అలుపన్నది లేదు. నిరంతర చైతన్య శీలియై, స్త్రీవాద సిద్ధాంతాల వ్యాప్తి ఎన్ని రకాలుగా చేయవచ్చో, అన్ని విధాలా చేస్తూ, కేవలం రచయితగానే కాక, కార్యకర్తగా కూడ తెలుగు సమాజంలో ప్రయోజనకరమైన పాత్రను నిర్వహిస్తున్న వ్యక్తి ఓల్గా.
-డా. సి. మృణాళిని

SA: