ఆయనో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు!
ప్రవృత్తి పరంగా జానపద కళాకారులు!
పేరు కె.లక్ష్మణరావు, శ్రీకాకుళం జిల్లా, పాలకొండ దగ్గర తుమరాడ గ్రామం.
అనారోగ్యం, వయోభారం, వెరసి మంచం నుండి కదలలేని పరిస్థితి. ఒక్క అవయవం కూడా కదల్చలేని అచేతన స్థితి. విముక్తి కోసం భగవంతుడు వైపు ఎదురుచూపులు. సరిగా అప్పుడే జరిగిందో అద్భుతం. చిన్ననాటి స్నేహితుడు, సాటి కళాకారుడు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, రచయిత,నటులు, దర్శకులు, పరిషత్ గుణ నిర్ణేత, ప్రయోక్త, ప్రస్తుతం ‘APKSS’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ “రౌతు వాసుదేవరావు” పరామర్శగా వచ్చి పలకరించారు.. అతన్ని చూసిన మాష్టారి కళ్ళల్లో కన్నీటి పొర. మనసు గతంలోకి ప్రయాణించింది. వారిద్దరూ కలిసి ప్రదర్శించిన కళారూపాల ప్రస్థానం ఒక్కసారి రీలులా స్మృతి పథంలో ఆవిష్కృతమైంది. ఆనాడు వేసిన పాటలు అడుగులు అన్ని… అన్నీ … గుర్తుకొచ్చాయి. శరీరంలో చిన్న కదలిక.. కళ్ళతో బాటుగా మెడ త్రిప్పి.. ఆ కదలిక చైతన్యమై… మంచం మీద నుంచి కాస్త పైకి లేచి… మిత్రుడితో దృష్టి కలిపి…. శరీరంలో నిద్రాణమై ఉన్న కణ జాలమంతా ఉత్తేజమై… కణం కణం కలిసి ప్రవహించినట్టు.. అలనాడు వారు ప్రదర్శించిన పాటల సాహిత్యాన్ని మననం చేసుకొని.. నోరు తెరిచి ఆలపిస్తూంటే…జరుగుతున్న అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోవడం కుటుంబ సభ్యుల వంతుఅయింది. వైద్యానికి మందులకి చేతకాని పని. సినిమా టిక్ గా డ్రామాటిక్ గా తెరపైన రంగస్థలం పైనచూసిన దృశ్యం.. తమ ఇంట్లో తమ కళ్ళ ముందు జరుగుతున్న అద్భుతాన్ని చూసి నివ్వెర పోయారు. మాస్టారి మనుగడ క్షణమో గడియో అనుకున్న వారి ఆశలు చిగురించాయి. ఇంతకు ఏ శక్తి మాస్టారులో ఆ చైతన్యాన్ని రగిలించింది? భౌతికంగా పూర్తిగా శక్తిహీనుడు అయిపోయిన అతన్ని ఏ శక్తి చైతన్య పరచింది? అదే మానసిక శక్తి. Yes! Undoubtedly!This is a miracle happens with psychlogical strength triggered by the art memories retrival in the form of his art colleague. అవును ఇది కళకి ఉన్న అతీతమైన శక్తి! తన సహచర కళాకారుడ్ని చూసి ట్రిగ్గర్ అయినటువంటి సైక్లాజికల్ శక్తి! అది కళకి కళాకారుడికి ఉన్న అపురూపమైన మానవతీత సంబంధం! ఇది ఇటీవల శ్రీకాకుళం జిల్లా జరిగిన ఓ అద్భుతదృష్టాంతం!