‘సీమా ‘ విశ్వరుచుల చిరునామా ..!

► తినడం తిరగడం ఆమె అభిరుచులు
► ప్రపంచాన్ని చుట్టేస్తున్న విజయవాడ యువతి
కూర్చోని తింటే కొండలైనా కరిగిపోతాయనేది పాత సామెత…. కాని అలా కూర్చోని తింటునే లక్షలు సంపాదించవచ్చన్నదే కొత్త ట్రెండ్. విజయవాడకు చెందిన అమ్మాయి సీమా గుర్నని ఇది నిజమని తేల్చింది. గూగుల్లో ఉద్యోగాన్ని కాదనుకొని మరీ తన మనసుకు నచ్చిన పని చేస్తూ లక్షలు సంపాదిస్తోంది ఈ అమ్మాయి….పాండా రివ్యూజ్ అనే పేరుతో ఒక ఫుడ్ బ్లాగ్ ను ప్రారంభించి కొత్త ప్రదేశాల్లో ఉన్న రెస్టారెంట్లు వాటిలో లభించే ఫుడ్ గురించి సోషల్ మీడియా ద్వారా పరిచయం చేస్తోంది.
గూగుల్లో ఉద్యోగాన్ని ఎందుకు వదిలేశారు? అని అడిగితే …
‘చాలామందికి గూగుల్లో ఉద్యోగం ఓ డ్రీమ్. కానీ నాకు చిన్నప్పటి నుంచి కొత్త ప్రదేశాలు చూడడం అన్నా అక్కడ విషయాలు ఎక్స్ ప్లోర్ చేయడమన్నది చాలా ఇష్టం . అందుకే ఉద్యోగం చేస్తూ కూడా ట్రావెలింగ్ చేసేదాన్ని. కాకపోతే టైం సరిపోయేది కాదు అదీకాక నాకు నచ్చేది కూడా కాదు సెలవు సమస్యలు ఉండేవి. దాంతో ఉద్యోగం మానేసి ఫుల్ టైం బ్లాగింగ్ చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే రెండేళ్ల క్రితమే ఉద్యోగం వదిలేశాను. ఇప్పుడు ఇదే నా ఫుల్ టైం వ్యాపకం.

చిన్నప్పుడు నుంచి మా అమ్మ నాకు ఇంట్లో చాలా కొత్త కొత్త వంటకాలు చేసి పెట్టేది వాటిని తిని రివ్యూ చెప్పడం నాకు అలవాటు దాంతో పాటు కొత్త ప్రదేశాలు తిరగడం అక్కడ ఫుడ్ అండ్ ట్రావిలింగ్ కు సంబంధించిన వివరాలు అందరికి చెప్పడం నాకు చాలా ఇష్టం….దాన్నే ప్రస్తుతం అందుబాటులో ఉన్న మాధ్యమాల ఉపయోగించుకొని ఒక హాబీగా చేస్తూ వచ్చాను.
ఇప్పటి వరకు నేను మన దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎక్కడ ఏ పుడ్ టేస్ట్ చేస్తే బాగుంటుందో అన్ని వివరాలు నా బ్లాగ్ లో పెట్టాను. మనకు తెలియదు కాని మన చూట్టూనే చాలా మంచి మంచి ప్రదేశాలు ఉంటాయి వాటిని పది మందికి చెప్పినప్పుడు వాళ్లు కూడా అక్కడి వెళ్లీ అది రుచి చూసి మనకు మళ్లీ ధ్యాక్స్ చెప్పినప్పుడు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేను.
నా ఫుడ్ రివ్యూస్ కి మంచి స్పందన ఉంది.
ప్రస్తుతం నేనిచ్చే రివ్యూస్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎక్కడైన కొత్త రెస్టారెంట్ ప్రారంభమైన ముందుగా నాకు మెయిల్స్ వస్తాయి. మా రెస్టారెంట్ కు వచ్చి ఫుడ్ తిని మీ రివ్యూస్ ఇవ్వండి అని అలా నేను ఆ రెస్టారెంట్ గురించి లేదా ఆ ప్రదేశం గురించి వివరాలు తెలుకున్న తరువాత అక్కడకు వెళ్లి ఫుడ్ టేస్ట్ చూసి ఉన్నది ఉన్నట్లు నా బ్లాగ్ లో రాస్తాను అలా రాసినందుకు రెస్టారెంట్ వాళ్లు కాస్త మొత్తంలో ఇస్తారు. డబ్బులు ఇస్తున్నారు కదా అని పాజిటివ్గా రాయను. వాస్తవంగా ఫుడ్ బాగుంటేనే రాస్తాను. అలా నాకు కాస్త ఇన్ కమ్ వస్తుంది. దాంతో పాటు నా బ్లాగ్ ట్రాఫిక్ వలన కూడా నాకు కొంత ఆదాయం వస్తుంది. వాటితో విమానాయ సంస్థలు, హోటల్స్ , టూర్స్ అండ్ ట్రావిల్స్ వాళ్లు చాలా మంది నా వెబ్ సైట్ లో యాడ్స్ పోస్ట్ చేస్తారు. దీంతో పాటు ఎదైన కొత్త ప్రదేశానికి వెళ్లడానికి సహకారం కూడా చేస్తానంటోంది. ‘ ఈ ఇంటర్నేషనల్ ఫుడ్ బ్లాగర్ సీమ.

క్రింది లింక్ లోకి ఒకసారి ప్రవేశించి, సీమా రుచులను ఆస్వాదించండి…

https://pandareviewz.com/

-కళాసాగర్

1 thought on “‘సీమా ‘ విశ్వరుచుల చిరునామా ..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap