“జయహో భారత్” లో వెల్లివిరిసిన దేశభక్తి

పిల్లల్లో కళలయందు ఆశక్తిని కలిగించేందుకు … చిన్నారుల్లో దేశభక్తిని పెంపొందించాలనే‌‌ ముఖ్య ఉద్దేశ్యంతో ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ మరియు మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో… విజయవాడ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో…ఆగస్ట్ 15 న టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో 77వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జయహో భారత్… Proud to be an INDIA ఆర్ట్ కాంటెస్ట్ కి విశేష స్పందన లభించింది. దాదాపు 36 విద్యాసంస్థల నుంచి 545 మంది చిన్నారులు ఈ కాంటెస్ట్ లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు తమ్మా శ్రీనివాసరెడ్డి, టాట్మోర్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో పద్మలత, మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం ప్రతినిధి తులసీరావు, ప్రముఖ కవి అనిల్ డ్యానీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ జయహో భారత్ ఆర్ట్ ఈవెంట్ లో బాగంగా ప్రముఖు చిత్రకారులు యడవల్లి రామకృష్ణ, కూనపరెడ్డి నారాయణ రావు, పంతంగి శ్రీనివాస్ లను ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ సభ్యులు ఘనంగా సత్కరించారు.

సాయంత్రం జరిగిన కుచిపూడి, జానపద నృత్యాలు, మేజిక్ ప్రోగ్రాంలు పిల్లలను అలరించాయి. ప్రముఖ చిత్రకారులు అరసవల్లి గిరిధర్, ఎస్.పి.మల్లిక్ లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో విజేతలకు అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, పతకాలు, బహుమతులు అందజేశారు.

ఈ కార్యక్రమానికి సునీల్ కుమార్ అనుమకొండ కన్వీనర్ గా వ్యవహరించగా.. స్ఫూర్తి శ్రీనివాస్ ఈవెంట్ మేనేజర్ గా వ్యవహరించారు. ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్ టీం సభ్యులు కళాసాగర్ యల్లపు, సుబ్బు ఆర్వీ, స్వాతి పూర్ణిమ, సుధారాణి, సంధ్యలు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా భారీ సంఖ్యలో తల్లిదండ్రులు, కళాకారులు, కళాభిమానులు, యువ చిత్రకారులు పాల్గొన్నారు.

SA:

View Comments (2)

  • చాలా చక్కటి కార్యక్రమం నిర్వహించారు. అభినందనలు...