శ్రీ ద్వారావతి ఫౌండేషన్ శ్రీ చలవాది మల్లికార్జున రావు గారి సౌజన్యంతో 13 -6- 20 21 ఆదివారం ఉదయం 9 గంటల 15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 317 మంది విజయవాడ పరిసర కళాకారులకు (పది కేజీల బియ్యం కేజీ కందిపప్పు లీటర్ నూనె తో పాటు రెండు వందల రూపాయలు నగదు) ప్యాకేజీలు వితరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ మాత్యులు శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు గారు విచ్చేసి ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు ప్యాకేజీని అందజేశారు. ద్వారావతి ఫౌండేషన్ కార్యకర్తలకు, కార్యక్రమ నిర్వహణలో సహకరించిన డాక్టర్ రామన్ ఫౌండేషన్ కార్యకర్తలకు, సంస్కార భారతి మాతృశ్రీ ఫౌండేషన్ కార్యకర్తలకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేశారు డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ (డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ తరపున). ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని రెండవ సంవత్సరం కూడా నిర్వహించి ఇబ్బందుల్లో ఉన్న కళాకారులకు సహాయం అందించిన మహాదాత శ్రీ చలవాది మల్లికార్జున రావు గారికి కళాకారుల అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారు ఆయురారోగ్య భాగ్యాలతో సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆశాభావాన్ని వ్యక్తంచేసారు.
ప్యాకేజీని అందుకున్న వారిలో క్రింది రంగాలకు చెందిన వారున్నారు:
నాటక కళాకారులు
మేకప్ ఆర్టిస్టులు
వాద్య కళాకారులు
భజన కళాకారులు
గాయకులు
జానపద కళాకారులు
హరికథ కళాకారులు
డాన్స్ కళాకారులు
బేనర్ ఆర్టిస్టులు
డ్రాయింగ్ టీచర్లు
సైన్ బోర్డ్ ఆర్టిస్టులు
కవులు
ఇంకా మరి కొన్ని రంగాలకు చెందిన వారున్నారు.
-కళాసాగర్