ఆర్.సి. కృష్ణ స్వామి రాజు రాసిన 50 పొట్టి కథల సమాహారమే ‘గరం గరం చాయ్’ సంపుటి. రచయిత ప్రతి కథలోనూ మనకు గరం గరం చాయ్ రుచి సూచించారు. ఆ రుచిలో కథలను చదివి ఆస్వాదిస్తే కొత్త రుచి కథలో మనకు కనిపిస్తుంది. హాస్య కథలు రాయటంలో, కథలలో ఆ ప్రాంత మాండలికాలను ఉపయోగించి, కథలను రాసి మెప్పించటంలో ఆర్.సి. కృష్ణస్వామి రాజు విజయం సాధించారు. ఈ కథలన్నీ ఏదో ఒక పత్రికలలో ప్రచురించబడినవే కావున రచయిత అందరికీ సుపరిచితులే.
కథల్లోకి వస్తే భార్యాభర్తలు ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకోక కాపురం చేస్తే, అది విడాకులకు దారితీస్తుంది. ఇష్టాలు తెలుసుకొని కాపురం చేస్తే, సంసారం సుఖంగా ఉంటుంది అని చెప్పే కదా ఇష్టాఇష్టాలు. మాన్ హోల్ తెరిచి ఆ మ్యాన్ హోల్ వద్దనే వర్షంలో తడుస్తూ ఎవరిని ఆ ప్రాంతానికి రానీయక, తన బాధ్యతను నిర్వర్తించిన ఒక మహిళ కథ. బాధ్యతతో వ్యవహరిస్తే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అని చెప్పే సామాజిక సృహను కలిగించే కదా మాన్ హోల్. ఒక కంపెనీలో గైడ్ ఉద్యోగానికి వచ్చిన అభ్యర్థులలో చివరకు ముగ్గురిని సెలెక్ట్ చేసి వారిని ఏ ప్రశ్నలు వేశారు? దానికి వారు ఏం సమాధానం చెప్పారు ? చివరికి ఉద్యోగం ఎవరికి వచ్చింది? అని తెలుసుకోవాలంటే వంశవృక్షం కదా చదవాలి. మరో కదా స్విస్ బ్యాంక్ డబ్బు ఇందులో సంభాషణలు అన్ని మనం నిత్యం వినే పదాలే. అందులో కొన్ని సిస్టర్ సిస్ ఆని బ్రదర్ ను బ్రో అని అమ్మను మామ్ అని అంటుంటారు. ఆ పదాలకు ఎదుటివారు మరో అర్థం తీసుకొని ఏదో ఊహించుకుంటారు. అలాంటిదే సిస్ డబ్బు అంటే స్విస్ బ్యాంక్ లో డబ్బు అనుకొని తరువాత కాదు సిస్టర్ డబ్బు అని తెలుసుకుని ఇలాంటి పదాలే ఉపయోగిస్తే తెలుగు పదాలు చరిత్రలో లేకుండా పోతాయని రాఘవాచారి బాధపడటం మనం ఈ కథలో చూడవచ్చు. తెలుగు భాష నేటి దుస్థితికి అర్థం పడుతుంది. అందరూ గురువారము, శుక్రవారం లేక శనివారము ఏదో ఒక దేవుడి పేరుతో మౌనవృతం చేస్తారు. కానీ మరియమ్మ కూతురు మాన్య ప్రతినెల మూడవ తేదీన చేసే మౌనవ్రతం గురించి తెలుసుకోవాలంటే మనం మౌనం వ్రతం కథను చదవాల్సిందే. అమ్మ ప్రేమ గొప్పదని కొడుకు విదేశాలకు వెళ్తే చదువు కోని తల్లి అయిన చదువు కొని కలెక్టర్ అయిన కొడుకు గురించి బెంగ పడుతుందని తెలియ చేసే కథ అమ్మ అమ్మే.
ఇటు వంటి సందేశాత్మక హాస్య కథలతో నిండిన ఈ పుస్తకంలో, కాకుల కొండ, ఫోటో ప్లీజ్, టూత్ బ్రెష్, రైతు హృదం, గ్రూప్ ఫోటో, మనిషి మారలేదు, వంటి కథలు ఆకట్టుకున్నాయి.
–విష్ణుభొట్ల రామకృష్ణ
పుస్తకం: గరం గరం చాయ్
వెల: రూ. 100/-
ప్రతులకు: ఆర్.సి. కృష్ణ స్వామి రాజు -(9393662821)
