పర్యావరణ ప్రేమికులకు అనేక నమస్సులు. ప్లాస్టిక్ కాలుష్యం గురించి గత నాలుగు సంవత్సరాలుగా నేను చేసిన అధ్యయనం 38 వ్యాసాల సంకలనం పుస్తకంగా వెలువడింది. నిజానికి ప్లాస్టిక్ కాలుష్యం గురించి తెలుగులో వచ్చిన మొట్టమొదటి సైంటిఫిక్ పుస్తకం ఇది.
“ప్లాస్టిక్”.. ఇది లేని ఆధునిక మానవ జీవితాన్ని మనం ఊహించలేం. ప్లాస్టిక్ అందించే సౌలభ్యమే మన జీవితాలని ప్లాస్టిక్ మయం చేసేసింది. మన జీవితాలను, మన జీవన సరళినే మార్చేసింది. అయితే “మెరిసేదంతా బంగారం కాదు” అన్నట్లు ఎంతో సౌకర్యంగా, అందంగా కనిపించే ఈ ప్లాస్టిక్ జీవితం వెనుక ఓ చీకటి ఉంది. ఆ చీకటి ఎంతో దట్టమైనది, అసహ్యకరమైనది, ప్రాణాంతకమైనదీనూ. ఆ చీకటే ప్లాస్టిక్ కాలుష్యం!
భూగోళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న, ప్రాణికోటి ఆరోగ్యకర మనుగడకు ప్రశ్నార్థకంగా పరిణమించిన ప్లాస్టిక్ కాలుష్యం గురించి పుస్తకరూపంలో అందిస్తున్న ఈ వ్యాస సంకలనం కేవలం రచయిత-పాఠకులకే పరిమితమైన కార్యకలాపంగా ఉండిపోరాదన్నది నా భావన. కాలుష్యాన్ని నియంత్రించి, లేదా నివారించి తద్వారా పర్యావరణాన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనందరిదీనూ. ఎందుకంటే పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న ఏకైక ప్రాణి మనుషులమమైన మనమే. అందుకే మనందరిపైన కాలుష్య నివారణ బాధ్యత ఉంది.
“ప్లాస్టిక్ గుప్పిట్లో భూగోళం” అన్న ఈ పుస్తకంలోని ఎన్నో విషయాలను అధ్యయనం చేసి కాలుష్య సమస్య గురించి సమాజంలో అవగాహన కలిగించవలసిన బాధ్యతా మనందరిదీనూ. ప్రతి ఒక్కరూ ఈ కార్యంలో చేతులు కలపండి.
ప్లాస్టిక్ కాలుష్యానికి సంబంధించిన ఈ పుస్తకంలోని వ్యాసాలు క్రింది అంశాలలో విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఆ అంశాలు:
- ప్లాస్టిక్ ప్రమాదం
- మైక్రోప్లాస్టిక్
- సముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యం
- మన శరీరాలలో పేరుకుపోతున్న ప్లాస్టిక్
- బయోప్లాస్టిక్, బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్
- ప్లాస్టిక్ ని తినే జీవజాలం (Plastic Eaters)
- ప్లాస్టిక్ రీసైక్లింగ్
- ప్లాస్టిక్ ఇంధనం
- పరిష్కారాలు
పుస్తకము యొక్క నిడివి 292 పేజీలు ఉంటుంది. ధర రూ. ౩౦౦/-. ఈ పుస్తకంలో విస్తృతంగా చర్చించిన పలు అంశాలను చదవడం, తదనుగుణంగా పర్యావరణ పరిరక్షణకు పూనుకోవడం అందరి బాధ్యత. పుస్తకము కావలసినవారు 8008264690 నంబరుకి PhonePe/Google Pay ద్వారా గాని రుసుము చెల్లించగలరు.
పైకము పంపినవారు వారి పేరు, చిరునామా (Pin Codeతో సహా), పైకము వివరాలు నా మొబైల్ నంబరు 8008264690కి WhatsApp మెసేజ్ పంపగలరు.
ఇట్లు
ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిశోర్
(పుస్తక రచయిత)