రేపే ‘క్రియేటివ్ హార్ట్స్’ 6 వ వార్షికోత్సవం

నవంబర్ 14 న కాకినాడలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విజేతలకు బంగారు పతకాలు

తూర్పు గోదావరి జిల్లా, కాట్రేనికోనకు చెందిన క్రియేటివ్ హార్ట్స్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 6 వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జరిగిన క్రాఫ్ట్ కాంపిటీషన్ లో విజేతల వివరాలు సంస్థ అధ్యక్షులు అంజి ఆకొండి ప్రకటించారు.

ఆ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 75 మంది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ మరియు 130 విద్యార్థులు పాల్గొన్నారని.. వారిలో అత్యంత ప్రతిభ ప్రదర్శించిన 80 మందికి బంగారు పతకాలు.. మెమెంటోలు అందజేయడం జరుగుతుందని అంతే కాకుండా చిత్రకళారంగంలో అత్యంత ప్రతిభ కలిగిన 9 మంది (మజ్జి కాంతారావు, బీరా శ్రీనివాస్, చంద్రశేఖర్ కొప్పు, రాజేటి కరుణాకర్, గంటా మధు, పెండ్యాల వీరబాబు, కందిపల్లి రాజు, మల్లాడి బాలకృష్ణ, పి.శ్రీనివాస్) చిత్రకారులకి కూడా క్రియేటివ్ హార్ట్స్ సంస్థ తరుపున ఈ నెల నవంబర్ 14 న మధ్యాన్నం 2 గంటలకు కాకినాడ UTF హాల్ నందు జరుగు అభినందన సత్కార సభలో రాష్ట్ర దృశ్యకళల అకాడమీ చైర్మన్ శ్రీమతి కుడుపూడి సత్య శైలజ భరత్ మరియు ప్రముఖ చిత్రకారులు ఎస్. దేవీప్రసాద్ (బెంగుళూర్) వారి చేతులు మీదుగా విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సభలో ముఖ్య అతిధులుగా పి. గిరిధరరావు, కళాసాగర్, జి. శ్రీనివాస్, కె. కేశవ వర్మ, వై. శివప్రసాద్ పాల్గొంటారు.

Creative hearts Invitation
Craft works
Craft works

SA:

View Comments (1)