సుదీర్గ నాటకానుభవం వున్న ప్రముఖ పౌరాణిక రంగస్థల మెగాస్టార్, ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ తన పేరిట ఫౌండేషన్ ప్రారంభించి ఇవాళ్టి నుంచి మరింతగా సేవలు విస్తరించారు! నిరుపేద కళాకారులు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కళాకారులను గుర్తించి ఆర్ధిక సహకారంతో భరోసా ఇవ్వాలనే లక్ష్యం తో గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు ఒక ప్రకటనలో తెలియజేసారు. ప్రారంభ సేవగా ఇవేళ నుంచి వంద మంది కళాకారుల ఖాతా లో ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా నాటక కళాకారులకు ఆర్ధిక సేవలు అందిస్తున్నామని, ఇంకా సేవలు విస్తరించాలనే ఉద్దేశ్యం తో దేశ విదేశ సౌజన్య మూర్తులు, ప్రముఖుల ఆశీస్సులతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రాచూరు గ్రూప్ ఆఫ్ చైర్మన్ శ్రీ ఎం.వి.సిద్ధార్ధ మార్కండేయరావు బహదూర్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి, పూర్వ డి.జి.పి. శ్రీ హెచ్.జె.దొర, విఖ్యాత అర్ధో వైద్య నిపుణులు డాక్టర్ కె.కృష్ణయ్య ఈ ఫౌండేషన్ కు గౌరవ ముఖ్య సలహాదారులుగా అమూల్యమైన సలహాలు అందించనున్నారు. కళారత్న గుమ్మడి గోపాలకృష్ణ ఈ ట్రస్ట్ కు చైర్మన్ గా వ్యవహరిస్తారు. గౌరవ సభ్యులుగా హైకోర్టు సీనియర్ న్యాయవాది శ్రీ జె.వి.రావు, స్వర్ణ ఆగ్రో టెక్ శ్రీ ఎస్.ఉమామహేశ్వర శర్మ, కళ పత్రిక చీఫ్ ఎడిటర్ డాక్టర్ మహ్మద్ రఫీ, శ్రీ వి.సతీష్ బాబు నియమితులయ్యారు. ట్రస్టీలుగా శ్రీ పి.శ్రీనివాసరావు, శ్రీమతి డి.నాగలక్ష్మి వ్యవహరిస్తారని గుమ్మడి గోపాలకృష్ణ వివరించారు. తెలుగు నాటకాం కీర్తిని దశ దిశల వ్యాప్తిచేసిన గుమ్మడి గారు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం ఎందరో కళాకారులకు ఉపయోగపడాలని ఆశిస్తూ… వారికి 64 కళలు.కాం పత్రిక అభినందనలు తెలియజేస్తుంది.
____________________________________________________________________________
జిజికె ఫౌండేషన్ పిలుపు
నాటక కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద నాటక కళాకారులను ఆదుకునేందుకు గుమ్మడి గోపాలకృష్ణ ఫౌండేషన్ (హైదరాబాద్) ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ పూర్వ అధ్యక్షులు గుమ్మడి గోపాలకృష్ణ తెలిపారు. ప్రభుత్వం నుంచి పెన్షన్ కు నోచుకోని పేద కళాకారులకు ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు అయన వివరించారు. ఇబ్బందులు పడుతున్న నాటక కళాకారులు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతరులు కూడా పేద కళాకారులను సూచిస్తూ దరఖాస్తు చేయించవచ్చు!
దరఖాస్తు:—
పేరు :
వయసు:
తండ్రి/భర్త పేరు:
వృత్తి వివరాలు:
కళారంగం అనుభవాలు క్లుప్తంగా:
ఆధార్ కార్డు నంబర్ :
చిరునామా:
ఫోన్ నంబర్:
ఇ-మెయిల్:
సంతకం:
తెల్ల కాగితం పై పైన పేర్కొన్న వివరాలు పూర్తి చేసి, పాస్ పోర్ట్ సైజు ఫోటో అంటించి, ఆధార్ కార్డు కాపీ జత చేసి జూన్ 20 లోపు ఈ క్రింది చిరునామా కు పంపించండి.
ఇతర వివరాలకు 9848043079 /9111100022 ఫోన్, వాట్స్ యాప్ నంబర్స్ లో సంప్రదించవచ్చు.
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
Sri Gummadi Gopalakrishna Foundation
8-3-231/A/167,
Srikrishna Nagar,
Yousuf guda
HYDERABAD-500 045
దరఖాస్తులు ggkrao1@gmail కు కూడా పంపవచ్చు .