గుమ్మడి నటవారసుడు జీవన్ కుమార్

పౌరాణిక నాటక రంగంలో ధ్రువతారగా వెలుగొంది పండిత,పామరులచే ప్రశంసలు పొంది,గానకోకిల,గానగంధర్వ, గజరోహణుడు, గండపెండేరధారి, ఆంధ్ర క్రైస్తవ నటసామ్రాట్, అనేక బిరుదులు, సత్కారాలు పొంది షుమారు 12 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి, నెలకు 30, 31 రోజులుంటే 35, 40 నాటక ప్రదర్శనలు ప్రదర్శించిన అరుదైన రంగస్థల నటులు శ్రీ గుమ్మడి జైరాజ్ గారు. ముఖ్యంగా ఇప్పటి వరకు భవానీ పాత్రకు తనకు తానే సాటి అని నిరూపించుకున్న కళామతల్లి ముద్దుబిడ్డ గుమ్మడి జైరాజ్ గారు.

గుమ్మడి జీవన్ కుమార్: నాటకరంగంలో తండ్రిగారి వారసత్వాన్ని కొనసాగిస్తూ, ఉభయ తెలుగు రాష్ట్రాలలో అనేక ప్రదర్శనలు ప్రదర్శిస్తూ, ముఖ్యం గా క్రైస్తవ నాటక రంగంలో ప్రేక్షకులచే ప్రశంసలు పొందుతూ మకుటం లేని మహారాజుగా వెలుగొందుతూ, విజయవాడ పౌరాణిక రంగస్థల కళాకారుల సమాఖ్య విజయవాడ అధ్యక్షులుగా, కళాకారులకు అనేక సేవలు చేస్తూ, కరోనా సమయంలో రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు, పేద కళాకారులకు గుమ్మడి జైరాజ్ కళాపీఠం విజయవాడ మరియు రంగస్థల కళాకారుల సమాఖ్య పక్షాన తనవంతుగా లక్షలాది రూపాయలు ఆర్థిక సహాయం చేసిన మానవతామూర్తి, సహృదయులు, సౌమ్యుడు, నిరాడంబరుడు, రాజేశ్వరి నాట్యమండలి విజయవాడ, సోదర సమానులు, గుమ్మడి జీవన్ కుమార్ గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

-యమ్. ఆంటోని

SA: