మేటి నటుడు గుమ్మడి వెంకటేశ్వరావు

ఏం బ్రదర్….ఆ చేతికున్న ఉంగరం ఏమైంది?… నిన్న ఉంది. నేను చూచాను…..

నందమూరి సున్నితంగానే అడిగినా… ఆ గంభీరమైన వాయిస్ వింటే… కొంచెం కంగారు పడూ… అదీ… ఎక్కడో పోయినట్లుంది బ్రదర్…. అంటూ సర్దుకుంటున్న ఆయన భుజాన చేయి వేసి…

ఈ నెల్లో మీ సంపాదన ఎంత బ్రదర్. ఇంటికెంత పంపించారు! నెలకు పాతిక సంపాదించి… యాభై ఖర్చు చేస్తే….మరి ఉంగారాలుంటాయా! మన ఆదాయానికి తగ్గట్టే….. ఖర్చు ఉండాలి బ్రదర్. హోటల్ కు రిక్షాలో పోవడమెందుకు…..నడిచి పోయివస్తే….తిన్నది. బాగా అరుగుతుంది కూడా. పెళ్ళైన మగవాడు….తనగురించి…తన సరదాల గురించే కాదు బ్రదర్… పొదుపు చేసి ఇల్లు గడపాలి. ఒక్కసారి ఈ అప్పులు…. తాకట్టులూ అంటూ మొదలు పెట్టే…ఇక పురోగతి ఉండదు బ్రదర్…. ఎన్.టి.ఆర్…..చెప్పిన ఈ మాటలు…ఆ వ్యక్తికి గుణపాఠం నేర్పించిందంటే అతిశయోక్తి కాదు. ఆయన మరెవరో కాదు…. తెరమీద…. ఆ నందమూరికే…ఎన్నో చిత్రాలలో తండ్రి పాత్రలు వేసి…. బుధులు… సుద్దులు…నేర్పించే….గుమ్మడి వెంకటేశ్వర రావు గారే! రావికంపాడు లో పుట్టినా… స్కూలింగ్ కొల్లూరు లో బురిగింది. తెలుగు మాస్టారు జాస్తి శ్రీరాములు గారి పుణ్యం….. స్వచ్చమైన తెలుగు ఉచ్చారణ పట్టుబడింది. హిందూ కాలేజ్ గుంటూర్లో…. ఇంటర్ చదువుతుండగా… నాటకాలు…నటన తో బాటు….కమ్యూనిస్టు భావజాలం కూడు పట్టుబడింది. 17 ఏళ్ళకే…ముసలి తండ్రి వేషంలో….బెస్ట్ యాక్టర్ బహుమతి కొట్టేశాడాయన!

సీనియర్ శ్రీరంజని గారి కుమారుడు….మల్లికార్జునరావు(ఆ తరువాత దర్శకుడయ్యారు)….గుమ్మడి గారి రూపురేఖలు చూసి…. తప్పక హీరో అయిపోతావ్….అని ఎంకరేజ్ చేసి…మద్రాస్ బాట పట్టించారు!లి మద్రాస్ లో పలానా గుమ్మడి వెంకటేశ్వర రావు వస్తున్నాడు…. తెనాలి నుండి…రేడియోల షాపు…ఇంకా కుటుంబాన్ని వదలి…. అతనికి పాత్రలు ఇవ్వాలి….అని ఏ నిర్మాత ….మద్రాస్ లో కాచుక్కూచ్చోడు కదా!ఎక్కే గుమ్మం….దిగే గుమ్మం!

అప్పుడు ఆదుకున్నది… నందమూరే! తన రూం లో అప్పటికే రూం మేట్స్ గా…. టి.వి.రాజు, డి.యోగానంద్ ఉండేవారు. ప్రక్కరూం ఇప్పించారు. తక్కువ అద్దెలో గుమ్మడి గారికి ఎన్.టి.ఆర్.

1950 లో డి.ఎల్. నారాయణ…తీసిన అదృష్టదీపుడు తో మొదలైంది గుమ్మడి గారి సినీ ప్రస్థానం. అది 60 ఏళ్ళ పాటు కొనసాగుతుందని….బహుశా ఆయన కూడా ఊహించి ఉండరు. 2010 లో తీసిన…. జగద్గురు శ్రీ కాశినాయన చరిత్రం….గుమ్మడి గారి చివరి చిత్రం. వి.వి. రామానండం గారు….బైవీర బేతాళ… అనే మూవీ లమున హీరోయిన్ గా…గుమ్మడి హీరోగా మొదలు పెట్టినా….. కారణాంతరాల వల్ల ఆగిపోయింది!

అప్పుడూ…వెన్నుతట్టి ప్రోత్సహించింది…. అన్నగారే! 1953 లో సొంత బానర్ ఎన్.ఎ.టి. సంస్థ తీసిన పిచ్చిపుల్లయ్య లో… 1954 లో తీసిన తోడుదొంగలు లో…. అద్భుతమైన పాత్రలిచ్చి ప్రోత్సహించారు. దానితో గుమ్మడి గారి ప్రతిభ వెలికొచ్చింది.

1962లో ఆదుర్తి సుబ్బారావు గారు…ఏముహూర్తంలో…ఆ దగ్గుతూ దగ్గుతూ… గుండెపట్టుకుని… చనిపోయే రోల్ ఆయనకు ఇచ్చారో గానీ…. అలాంటి పాత్రలన్నీ ….ఆయన్నే వెతుక్కుంటూ వస్తున్నాయి మరి!

వారి ప్రతిభ అనన్య సామాన్యం. తడిగుడ్డతో గొంతు కోసే విలనీ పాత్రలు (తోడుదొంగలు, లక్షాధికారి, భలే రంగడు,రాజ మకుటం, వాగ్దానం, ఇద్దరు మిత్రులు….లాంటివి)…పౌరాణికాలలో…. బలరాముడు ధర్మరాజు, విశ్వామిత్రుడు, దశరథుడు, భృగు మహర్షి, దూర్వాసుడు, పరశురాముడు, విశ్వామిత్రుడు, దశరథుడు, బలరాముడు, ధర్మరాజు, ద్రోణుడు….పాత్రలు తలుచుకుంటే గుర్తొచ్చేది ఒక్క ఆయనే ! రాయా…

రాయా….విచారించకు నాయనా…నాకీ నీలాపనింద…నీకీ అపకీర్తి…. పూర్వకర్మ ఫలితాలే! పశ్చాత్తాపంతో…పరిశుద్ధాత్ముడవై…ఇతోధిక వాత్సల్యంతో… నువ్వు నాకు దక్కావు రాయా…. అంటూ పతాక సన్నివేశంలో మహామంత్రి తిమ్మరుసు పాత్రలో వారి పలుకులు….కళ్ళు మూసుకుని విన్నా….కన్నీళ్ళు రాక మానవు! అలాంటి డిక్షన్ ఆయన సొంతం!

ప్రతి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు…. తప్పక చూసి…. పాత్రలను స్టడీ చేయడం…. ఆయన హాబీ. అండర్ ప్లే చేయడంలో… సిద్ధహస్తుడు! ఎన్.టి.ఆర్. పుట్టింది 1923లో…ఎ.ఎన్.ఆర్ జననం 1924లో… గుమ్మడి వెంకటేశ్వర రావు పుట్టింది 1927 లోలి! మనుషుల్లో దేవుడు మూవీలో…ఎన్..టి.ఆర్….గుమ్మడిని ఉద్దేశించి….

మీచలవే లేకుంటే నేను బి.ఏ. యూనివర్సిటీకే ఫస్టున వచ్చేవాడినా బాబుగారూ… అని పాదాభివందనం చేస్తాడు.

నా దేముంది నాయనా… అంతా నీకృషే…నీ పట్టుదలే నీకీ ఫలితాన్నిచింది నాయనా… అంటూ హత్తుకుంటారు వృద్ధ పాత్రలో గుమ్మడి! నీకీనాడు కన్నవాళ్ళు గుర్తు రారురా…ఆ కులం గోత్రం లేని పిల్ల కోసం….కన్నవాళ్ళను, తోబుట్టువులను కాదని గడప దాటి వెళున్నావు కదా…వెళ్ళరా..వెళ్ళు… అని…..ఎ.ఎన్.ఆర్ ను కులగోత్రాలు మూవీలో తండ్రి పాత్రలో రుద్ధమైన గంభీరమైన కంఠం తో తీక్షణ ధృక్కులతో గుమ్మడి గర్జిస్తుంటే…. ప్రేక్షకులు దృశ్యంలో లీనమైపోయారు–

ఈ కుర్రాడు నా ప్రక్కన భర్త రోల్ ….అదీ జమిందార్ రోల్…. నాకంటే 9 ఏళ్ళు చిన్నవాడు…ఎలా చేస్తాడు!?.. అని శాంత కుమారి గారు విసుక్కుంటే…. అర్ధాంగి మూవీలో మేకప్ మాయతో….సీన్లు పండిస్తుంటే…. ఆవిడ ఆశ్చర్యపోయారట గుమ్మడి గారి ప్రతిభకు.

విలనీ, హాస్యం, రౌద్రం, కరుణ, బీభత్స భయానక రసాలను మహాగొప్పగా పోషించి ఒప్పించేవారు గుమ్మడి గారు –

సావిత్రి గారు ప్రాభవం బాగా తగ్గిపోయి… చిన్న పాత్రలు కూడా… చేస్తున్న రోజుల్లో….మధ్యాహ్నం 3 గంటలవుతున్నా…లంచ్ చేయక… చెట్టు క్రింద అరుగు మీద కూర్చుని ఉంటే….. గమనించి…. అమ్మా… సావిత్రి…. ఏమిటి… భోజనమయ్యిందా?లి అని ఆరాతీస్తే…. ఆకలిగాలేదని… మొహమాటపడుతుంటే… క్యారియర్ తెప్పించి అన్నం తినేలా చూచి….కాలమహిమ కాకపోతే…ఏమిటీ విడ్డూరం! అని ఆరతతో కరిగిపోయింది గుమ్మడి గారే!

ఎవరికైనా….వైభవం కొంతకాలమే! ఎంతటి వారైనా విధికి… తలవంచాల్సిందే కదా!

అన్ని భాషలలో కలిపి….500 పైగా….సినిమాలు! నేషనల్ ఫిల్మ్ అవార్డులకు జ్యూరీ మెంబర్ గా 3 సార్లు… గౌరవం. మహామంత్రి తిమ్మరుసు (1963), మరో మలుపు(1982)…ఈ రెండు చిత్రాలు…. ఇంటికి రెండు నందులను తెచ్చాయి. 1977లో పద్మశ్రీ పురస్కారం. జ్యోతి , 66సీతాకళ్యాణం…..పాత్రలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు. రఘుపతి వెంకయ్య నాయుడు పురస్కారం. తీపిగుర్తులు – చేదు జ్ఞాపకాలు…….ఆయన విరచితమైన అద్భుతమైన పుస్తకం.

ఇవన్నీ ఓ ఎత్తైతే….2010 జనవరి లో… డిజిటలైజ్ చేసిన మాయాబజార్ వర్ణ చిత్రం…..చూసి…. బహుశా ఇది చూసి తరించడానికే….నేను ఇంకా బ్రతికున్నానేమో…. అని ఆయన మురిసి పోవడం…. ఆ తరువాత….. 9 జూలై…..స్వర్గస్తులవడం జరిగింది.

చిన్న వయసులోనే…… పెద్ద పెద్ద పాత్రలకు అంకితమైనా…. గుమ్మడి గారి సహజ నటన తెలుగు ప్రేక్షకులు మరచిపోలేరు. తెలుగువారి గుండెల్లో గుమ్మడి గారి స్థానం సుస్థిరం.

ప్రముఖ దర్శక రచయిత జంధ్యాలగారు గుమ్మడి వెంకటేశ్వరావు గురించి చెబుతూ.. తెలుగువారింటి శుభకార్యాలలో గుమ్మడి లేకుండా ఏ వేడుక జరగదు.. అలాగే తెలుగు సినిమాలో గుమ్మడిగారు లేకుండా పరిపూర్ణం కాదు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap