“మానవతా మూర్తికి అక్షర నీరాజనం”

(నేడు నవయుగ కవి చక్రవర్తి గుఱ్ఱం జాషువా 126 వ జయంతి)

ఆధునిక తెలుగు కవులలో ఆయనదొక ప్రముఖ స్థానం.
అయన పద్యాలలోని శబ్ద సౌందర్యం గుండెలను తాకుతుంది.
కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై
తిరగబడ్డ మహాకవి గుఱ్ఱం జాషువా.

ఖండ కావ్యాల రారాజు.
అయన సృష్టించిన సాహిత్యంలో
స్పృశించని అంశం లేదు.
జాషువా కవితా కంఠం విలక్షణం.

సంఘ సంస్కరణలే అయన కావ్య లక్షణం
మానవ జీవితన్ని సుమధురంగా
సందేశాత్మకంగా తీర్చి దిద్దిన మధుర కవి.
సమతా, మమతా, మానవతల్ని
తన కవితా పదాలుగా చేసుకుని
ఈ నవయుగ కవి చక్రవర్తి ఆధునిక భావాలకు
అట్టడుగు వర్గాల గాధలకు పట్టం కట్టి
తెలుగు సాహితీ కళామతల్లికి
అక్షర నీరాజనం అర్పించిన కారుణ్యమూర్తి.

అంటరాని తనం, ఆర్ధిక అసమానతలు, వర్ణ వ్యవస్థలను చూసి
జ్వలించి, చలించి, బాధాతప్త హృదయుడై
తన కలమనే ఖడ్గాన్ని ఝుళిoచి
నిలదీసిన సాంఘిక విప్లవ కారుడు.
జాషువా జీవితం, సాహిత్యం నేటి కవులకు
ఆదర్శం కావాలని ఆశిస్తూ
మానవతామూర్తి గుఱ్ఱం జాషువాగారికి ఘన నివాళి.

పింగళి భాగ్యలక్ష్మి, గుంటూరు
కాలామిస్టు, రచయిత్రి
ఫోన్ నెంబర్. 9704725609

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap