తొమ్మిది దశాబ్దాల చరిత్ర గల తెలుగు కార్టూన్ రంగంలో పుస్తకరూపంలో వచ్చిన కార్టూన్ సంపుటాలు బహు తక్కువ. ఇప్పటి వరకు కార్టూన్లపై మూడు పుస్తకాలు ప్రచురించిన హరి నాలుగో పుస్తకం “ఇదీలోకం- హరి కార్టూన్లు”. సునిశిత పరిశీలనాశక్తితో సమకాలీన రాజకీయ, సామాజిక సమష్యలపై హరి గీసిన కార్టూన్లతో ప్రచురించిన పుస్తకం ఇది.
సాహిత్యం ద్వారా, ఉద్యమాల ద్వారా ప్రభావితమై కార్టూనింగ్ వైపు వచ్చిన హరి కమెండో,లీడర్, మీడియా ఇండియా, ఆంధ్రప్రభ (ఆదివారం)లో ఫ్రీలాన్స్ పొలిటికల్ కార్టూనిస్టుగా పనిచేసారు. 2014 నుంచి విశాలాంధ్రలో ప్రతిరోజూ పాకెట్ కార్టూన్లు వేస్తున్నారు.
ఆరేళ్లు హైదరాబాద్ లో డేటాక్వెస్ట్ యానిమేషన్ స్టూడియోలో, మరికొంత కాలం ప్రాణియానిమేషన్ స్టూడియోలో పనిచేసారు. కొంత కాలం ఫాకల్టీగా, మరికొంత కాలం ఎన్.జీ.వో రంగంలో పనిచేసిన హరి అనేక డాక్యుమెంటరీలు, పిల్లల
కోసం యానిమేషన్ లఘుచిత్రాలు రూపొందించారు. కార్టూనిస్టుగానే కాక సోషల్ యాక్టివిస్టుగా కూడా ఉన్నారు. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక యువజన అవార్డును అందుకున్నారు.
-కళాసాగర్
వెల: రూ. 100/-
ప్రతులకు : నవోదయ బుక్ హౌస్ హైదరాబాద్,
మరియు
హరి – 9866084124 / 8466820560