‘HCL’ శివ్ నాడార్ విజయగాథ

తమిళనాడు రాష్ట్రంలోని ఓ కుగ్రామంలో పుట్టి, ఉన్నత చదువులు చదివి, భారత రాష్ట్రపతి గారి చేతులమీదుగా పద్మభూషణ్ అవార్డు పొందిన ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త, దాత, పరోపకారి, HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, SSN ఫౌండేషన్ చైర్మన్, డాక్టర్ శివ్ నాడార్. ఆయన జీవిత ప్రయాణం ఈరోజు మీకోసం...

శివ్ నాడార్ తమిళనాడు రాష్ట్రం, తూత్తుకుడి జిల్లా, మూలైపోజి గ్రామంలో ఒక తమిళ హిందూ కుటుంబీకులైన శివ సుబ్రమణియన్ నాడార్ – వామసుందరీ దేవి దంపతుల సంతానంగా 1945, జూలై 14న జన్మించాడు. తల్లి వామసుందరీ దేవి దిన తంతి వార్తాపత్రిక వ్యవస్థాపకురాలు.

శివ్ నాడార్ కుంభకోణం లోని టౌన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మరియు మధురై లోని ఎలాంగో కార్పొరేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ప్రాథమిక విద్యను చదివాడు. తరువాత తిరుచ్చి లోని సెయింట్ జోసెఫ్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూలులో ఉన్నత పాఠశాల విద్యను పూర్తి చేశాడు. మధురై లోని అమెరికన్ కాలేజీలో ప్రీ-యూనివర్శిటీ డిగ్రీ చదివాడు. తరువాత కోయంబత్తూరు లోని PSG కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌ లో డిగ్రీని పొందాడు.

శివ్ నాడార్ కెరీర్ జీవితం:
1967లో శివ్ నాడార్ పూణేలోని వాల్‌చంద్ గ్రూప్ యొక్క కూపర్ ఇంజనీరింగ్ లిమిటెడ్‌లో చేరి తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత దానిని వదిలిపెట్టి, స్నేహితులు మరియు సహోద్యోగుల భాగస్వామ్యంతో సొంత వెంచర్‌ మైక్రోకాంప్ అనే సంస్థను స్థాపించాడు. ఇది భారత మార్కెట్లో టెలిడిజిటల్ కాలిక్యులేటర్లను అమ్మడంపై దృష్టి సారించిన సంస్థ.

తర్వాత, 1976లో 187,000 పెట్టుబడితో HCL సంస్థను స్థాపించాడు. 1980 లో HCL సింగపూర్‌లో ఫార్ ఈస్ట్ కంప్యూటర్స్‌ను ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టాడు. సింగపూర్ లో ఈ వెంచర్ మొదటి ఏడాదిలోనే 1 మిలియన్ ఆదాయాన్ని నమోదు చేసింది.

జూలై 2020లో, శివ్ నాడార్ తన కుమార్తె రోష్ని నాడార్‌కు HCL బాధ్యతలను అప్పగించారు, ఆమె లిస్టెడ్ ఇండియన్ ఐటీ కంపెనీకి మొదటి మహిళా చైర్‌పర్సన్‌గా నిలిచింది. జూలై 2021లో, నాడార్ HCL టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి వైదొలిగి HCL టెక్ CEO అయిన సి.విజయకుమార్ ఐదేళ్ల కాలానికి బాధ్యతలు అప్పగించారు.

శివ్ నాడార్ భార్య పేరు కిరణ్ నాడార్, ఆమె ఆర్ట్ కలెక్టర్ మరియు పరోపకారి. వీరికి ఒక కుమార్తె వుంది, పేరు రోష్ని నాడార్. 1990 లలో నాడార్ HCLను ప్రారంభించినప్పుడు ఆమె మేనేజర్‌గా ఉన్నారు. ఇప్పుడు HCL కు ఆమె చైర్‌ వుమన్.

అందుకున్న పురస్కారాలు:
🔹2007లో మద్రాస్ యూనివర్శిటి గౌరవ డాక్టరేట్ పట్టాతో సత్కరించింది.
🔹2007లో శివ్ నాడార్ కు 2007 (సర్వీసెస్) లో E&Y ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు.
🔹2008లో భారత ప్రభుత్వం ఐటీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గాను మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ తో సత్కరించింది.
🔹2011లో ఆసియా పసిఫిక్‌ లోని ఫోర్బ్స్ యొక్క 48 మంది దాతృత్వ హీరోలలో ఒకడిగా గుర్తించబడ్డాడు.
🔹2017లో ఇండియా టుడే మ్యాగజైన్ భారతదేశంలోని 50 మంది అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితాలో 16వ స్థానంలో నిలిచాడు.
🔹శివ్ నాడార్ దాతృత్వం కోసం ఇప్పటివరకు $1 బిలియన్ కంటే ఎక్కువ నిధులు కేటాయించాడు.
🔹సంవత్సరంలో ప్రతిరోజూ దాదాపు రూ. 6 కోట్లను విరాళంగా ఇవ్వడంతో 2024 లో అత్యంత ఉదారంగా దాతల జాబితాలో నాడార్ అగ్రస్థానంలో నిలిచాడు.

శివ్ నాడార్ ఘనతలు:
🔹1996లో శివ్ నాడార్ తన తండ్రి శివసుబ్రమణ్య నాడార్ పేరు మీద చెన్నైలో SSN కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను స్థాపించారు, కళాశాల 1 మిలియన్ విలువైన HCL షేర్లను బహుమతిగా ఇచ్చాడు.
🔹2005లో శివ్ నాడార్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో చేరారు.
🔹2008లో శివ్ నాడార్ యొక్క SSN ట్రస్ట్ గ్రామీణ విద్యార్థుల కోసం ఉత్తరప్రదేశ్‌లో రెండు విద్యాజ్ఞాన్ పాఠశాలలను ఏర్పాటు చేసి, ఆ రాష్ట్రంలోని 50 జిల్లాల నుండి 200 మంది విద్యార్థులకు ఉచిత స్కాలర్‌షిప్ ఇచ్చారు.
🔹2011లో శివ్ నాడార్ టౌన్ హయ్యర్ సెకండరీ స్కూళ్లను సందర్శించి రూ.80 లక్షల విలువైన కంప్యూటర్లు మరియు ఇతర పరికరాలను విరాళంగా ఇచ్చాడు.
🔹2014 వరకు ఒక సాంకేతిక సంస్థ అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్ (IIT ఖరగ్‌పూర్ or IIT-KGP) యొక్క గవర్నర్ల బోర్డుకు ఛైర్మన్‌గా ఉన్నాడు.

ఇది 2021లో ఫోర్బ్స్ మ్యాగజైన్ ఆయనను భారతదేశంలోనే US$35 బిలియన్ల నికర విలువ వున్న మూడవ అత్యంత ధనవంతుడుగా గుర్తించిన డాక్టర్ శివ్ నాడార్ విజయగాథ.

మధుసూదన్ మామిడి
సెల్ నం. 8309709642

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap