ద్వారావతి ఫౌండేషన్ ద్వారా కళాకారులకు సరుకుల పంపిణీ

డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి విజయవాడ వారి అభ్యర్థన మేరకు, ద్వారావతి ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీ చలవాది మల్లికార్జునరావు గారి సౌజన్యంతో విజయవాడలో శ్రీ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణంలో, కోవిడ్ 19 కారణంగా ఇబ్బందులలో ఉన్న వివిధ కళారంగాలకు చెందిన 250 మంది కళాకారులకు ఒక్కొక్కరికి పది కేజీల బియ్యం ఒక కేజీకంది పప్పు, ఒక లీటర్ నూనె మరియు 200 రూపాయలు చొప్పున 12/ 9 /2020 శనివారం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు వితరణ చేయడం జరిగినది. సదరు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గౌ. దేవాదాయ శాఖమంత్రి శ్రీ వెలంపల్లి శ్రీనివాసరావు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ కళాకారులు అందరి పక్షాన కళాకారులకు ప్రభుత్వం నుంచి రావలసిన బిల్లులు రిలీజ్ చేయించవలసిందిగా మరియు ఏ విధమైన కళాప్రదర్శనలు లేని కారణంగా కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ మంత్రి గారికి  వినతి పత్రం సమర్పించారు. కళాకారులందరూ ఈ కష్ట కాలంలో వారిని ఆదుకున్న శ్రీ చలవాది మల్లికార్జునరావు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కళాకారులకు ముందుగానే టోకెన్ నెంబర్ కేటాయించి క్రమశిక్షణతో కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూ కార్యక్రమం మొత్తం విజయవంతంగా నిర్వహించడం జరిగింది.

1 thought on “ద్వారావతి ఫౌండేషన్ ద్వారా కళాకారులకు సరుకుల పంపిణీ

  1. శ్రీచలవాది మల్లికార్జున రావు గారికి కళాకారుల కష్టాల గురించి నేను చెప్పినప్పుడు ఏ మాత్రం సంకోచించకుండా ఈ కరోనా కష్టకాలంలో 250 మంది కళాకారులకు సహాయాన్ని అందించడం కోసం వారంతట వారు గా ముందుకు వచ్చి ఇంత పెద్ద సహాయం చేశారు. కళాకారుల అందరి పక్షాన వారికి
    ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అటువంటి మహానుభావులు కలకాలం ఆయురారోగ్య భాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి ద్వారావతి ఫౌండేషన్ టీమ్ మెంబర్స్ అందరూ పొట్టి శ్రీరాములు చలవాది మల్లికార్జున రావు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ స్టాప్ కూడా ఎంతో అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. వారికి కూడా కళాకారుల అందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవ దేవాదాయ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు.
    పి వీ ఎన్ కృష్ణ

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link