ఆదివాసీ పోరాట యోదుడు రావణసురుడు

నిజమైన చరిత్రని త్రోక్కి పట్టి మూడు వేల సంవత్సరాలుగా పుక్కిటి పురాణాలు వేదాలు ఉపనిషత్తులు మహాభారతo రామాయణం కల్పిత కధలు తయారు చేసి ఆదివాసీ అణగారిన వర్గాలనూ మోసం చేశారు. ఇప్పటికీ 90శాతం మంది ఈ గ్రంధాలు చదివినవాళ్ళు లేరూ. అందులో ఏముందో కూడ తెలియదు. మతం చెప్పిందే నిజం ప్రశ్నించకూడదు. అన్న రీతి లో కొన సాగుతుంది. ఆనాటి నుండి నేటి వరకు హిందూ సామ్రాజ్యవాదం మేము చెప్పిందే నిజం అనీ ఇతరులు ప్రశ్నించకూడదు అనీ మతం మత్తు లో ఆంక్షలు విధించారు. అప్పటి కాలం లో వేదాల నూ ఉపనిషత్తులు,మహా భారత రామాయణం గ్రంధాల నూ చదివితే నాలుక కోసే వాళ్ళు. చెవుల లో సీసం పోసే వాళ్ళు. రామాయణం ప్రకారం ఆర్య జాతి ప్రతినిధి రాముడు.ప్రాచీన దక్షిణ భారత దేశ ఆదివాసీల రాజ్యానికి చక్రవర్తి ఆయిన రావణుడు. రారాజు గా వర్ధిల్లుతున్నా రోజులు అవి. సీత వివాహ స్వయం వరానికి జనుకుడు ప్రకటించినపుడు వివిధ రాజ్యల రాజుల తో పాటు రాముడు-రావణుడు కూడ వచ్చినట్లు రామాయణం చెబుతుంది. రాముడు -రావణుడు కూడ ఇద్దరు రాజులు అయితే ………….! రాముని దేవుని గా రావణుడు నీ రాక్షససునీ గా అగ్రవర్ణ బ్రాహ్మణ వర్గం ఎందుకు చిత్రీకరించిoదో నేడు ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు ఆదివాసీలు ఆలోచించాలి .రామాయణం ప్రకారమే సీత పుట్టక ముందే రావణుడు కైలాస పర్వతమూనకూ పోయిశివుని శివ ధనుస్సు నూ కైలాస పర్వతము నూ ఎత్తి తల మీద పెట్టుకున్న బలశాలి గా రావణుడు నీ గురుంచి చెప్పబడినది. అలాంటిది సీత ఎత్తి పట్టిన ధనస్సు నూ కూడ ఎత్తలేక పోయాడనీ రామాయణం లో వక్రీకరించడం కూడ బ్రాహ్మణ వర్గం ఎత్తుగడ లో బాగమే.ఇది అందరూ ఆలోచించాల్సిన విషయం. అలా ఎందుకూ వక్రీకరించవలిసిoదో బ్రాహ్మణ వర్గం ఆదివాసీల కూ చెప్పాల్సిన సమయం వచ్చింది. ఇతిహాసం పురాణ వేదాల లో జరిగిన యుద్దసన్నివేశాలలో నీ పాత్రల నూ కేవలం ఉద్యేశ్యపూర్వకంగా ఒక ఎత్తుగడ గా రాక్షసులు గా చిత్రీకరించారు. మహాభారతo లో రామాయణం లో కొంత మందిని దేవుళ్ళు గా చిత్రీకరించారు. ఎందుకూ అంత వ్యత్యాసం……? ఎందుకూ అంత తేడా …….? వచ్చింది నేటి మేధావులు ఆలోచన చేయాలి.

దానితో మహిశాసురుడు, రావణాసురుడు, నరకాసురుడు, బలిచక్రవర్తి, తాటకీ తదితరులు ద్రావిడ జాతి అంటే ఈ దేశా మూలవాసులు అంటే నేటి ఆదివాసీల. ఆదివాసీల కూ చెందిన ఈ నాయకత్వానీ ఆదివాసీరాజ్యాల రాజుల నూ, ఆదివాసీల నూ రాక్షసులు గా చిత్రీకరించారు ఆనాటి బ్రాహ్మణ వర్గం. అసలు ఆదిమ మానవుని కాలం నుండి నేటి ఆధునిక మానవుని కాలం వరకు ప్రపంచ చరిత్ర లో రాక్షససులు అనబడే వాళ్ళు ఎక్కడ లేరూ. కేవలం భారతదేశం లో మాత్రమే కల్పితం గా సృష్టించబడ్డారు. ఇది కేవలం బ్రాహ్మణ వర్గానికి మాత్రమే తెలుసు. పూర్వ కాలం లో చదువు బ్రాహ్మణుల కూ తప్ప ఇతరులకూ చదువుకునే హక్కు లేదు. వేదాలను బ్రాహ్మణలు తప్ప ఇతరులు ఎవరూ చదవకూడదు. శూద్రులు పట్లా రాముడి వైఖరి ఏలా ఉన్నదో రామాయణం లో శoబుకూనీ కధ చదువుతే అసలు నిజం తెలుస్తుంది. బ్రాహ్మనిజo ప్రోత్సాహం తో రాముడి తపస్సు చేసుకుంటున్న శూద్రుడైన శo బుకూనీ తల నరికి చంపివేశాడు. అలాగే ఆదివాసీ వీరుడు వాలినీ ప్రత్యక్షంగా ఎదుర్కొనే దైర్యం లేక దొంగ లాగ చెట్ల చాటున నక్కి బానo తో కొట్టి చంపాడు. స్త్రీల పట్ల రాముడి వైఖరి అత్యంత అమానుషం గా అనుమానంగా ఉండేది. పితృస్వామిక అహంకారం తో సీత పట్లా అమానుషంగా వ్యవహరించిన తీరు సభ్య సమాజానికి సిగ్గు చేటు. రామలక్ష్మణులు కలిసి రావణుడి చెల్లెలు శూర్పణఖ తో క్రూరంగా వ్యవహరించిన విధానం అమానుషమైనది అప్రజాస్వామికమైనది నీచమైనది. బ్రాహ్మణుల ప్రోత్సాహం తో ఆదివాసీ స్త్రీ తాటకీ నీ చంపిన విదానం చూస్తే శ్రీరాముడు దేవుడు కాదు నరహంతకుడు అనీ తేట తెల్లo అవుతున్నది. ప్రాచీన దక్షిణ భారతదేశానికి ఆదివాసీ రాజ్యాల కూ రారాజుగా చక్రవర్తి గా విరాజిల్లుతున్న రావణుడు …………బ్రాహ్మణ రుషూల బండారాని బయటపెట్టిన దిశాలి రావణుడు .సాహసవంతుడు రావణుడు. బ్రాహ్మణ పూజారుల అజ్ఞానా నీ వారి అగ్రవర్ణ అదిపత్య భావజాలాని, స్త్రీల పట్లా రామలక్ష్మణుల అసహనాని వ్యతిరేకించిన మహా జ్ఞాని రావణుడు. ఆదివాసీ రాజ్యాల నూ కూల్చివేసీ, ఆదివాసీల నూ ఊచ కోత కోసి ఆదివాసీల పై అమానుష హత్యాకాండ నూ కొనసాగించిన శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వామనుడు, సత్యబామ, కాళీకలు ఈనాడు దేవుళ్ళు గా చెలామణీ లో ఉన్నారు. దసరా దీపావళి పండుగలకూ మూల కేంద్రం మూలవాసుల పై హత్యాకాండ. చెడు పై మంచి సాధించిన విజయంగా విజయదశినీ చెప్పుకుంటారు ఈ అగ్రవర్ణ బ్రాహ్మణులు.

చెడు ఎవరిది …………?
మంచి ఎవరది ………..?
చెడు ఎవరు చేశారు ……?
మంచి ఎవరు చేశారు …..?
నేడు పునః సమీక్ష చేయాల్సిన సమయం ఆసన్నమైంది .

అందుకే డా. బి. ఆర్. అంబేద్కర్ భారత దేశాచరిత్ర అంత బౌద్దనికి బ్రాహ్మనిజానికి మద్య జరిగిన బీకర యుద్దమే అంటాడు. అంటే ఆనాడు ఆదివాసీల పై జరిగిన అమానుష హత్యాకాండ నే మహాభారత రామాయణమే అనీ చాలా స్పష్టంగా అర్దం అవుతుంది. రావణసురుడు తన చెల్లెలునూ శూర్పణఖ నూ క్రూరంగా హింసించినందుకే ప్రతీకారంగా రావణుడు సీత నూ బందీగా తీసుకవెళ్ళి ఎంత ఉన్నత సంస్కారం తో జాగ్రత్త గా చూసుకున్నాడో అతడి నీతి నిజాయితీ మనకు స్పష్టం గానే అర్దం అవుతుంది. శ్రీరాముడు మూలవాసుపైనా అనగా (నేటి ఆదివాసీలు )అమానుష హత్యాకాండ జరిపి ఆదివాసీల రాజ్యాల అదినేత ఆయిన రావణుడు నీ దొంగ దెబ్బ తీసి హతమార్చి ఆదివాసీల కూ తీరని అన్యాయం చేశారు. దీనికి చిహ్నం గా విజయదశమి పండుగ చేసుకుంటున్నారు. ఆనాటి ఆదివాసీ పోరాట యోదుని రాక్షసునీగా చిత్రీకరించి ఆదివాసీ సమాజానికి తీరని ద్రోహం చేశారు. అందుకే రావణాసురు నీ చరిత్ర ప్రతి ఆదివాసీ తెలుసుకోవాలి.ప్రతి దసరా పండుగ నాడు ఆదివాసీ గూడెం లో రావణాసురుడు వర్ధంతి నీ ఘనంగా చేయాలి.రాముని పేరూ తో రాజ్యమేలుతున్నా అగ్రవర్ణ బ్రాహ్మణ ఫ్యూడల్ రాబందుల రాజ్యాని కూల్చివేద్ద్దా మ్. ఆదివాసీల స్వయం పాలన కోసం పోరాడుదామ్.

రామకృష్ణ దొర
(ఆదివాసీ రచయితల సంఘం)

1 thought on “ఆదివాసీ పోరాట యోదుడు రావణసురుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap