ప్రముఖ హిప్నాటిస్ట్ హిప్నో కమలాకర్ మృతి

ప్రముఖ సైకలాజికల్ హిప్నాటిస్ట్ డాక్టర్ హిప్నో కమలాకర్ బుధవారం రాత్రి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈయనకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ రాగా క్వారంటైన్ అనంతరం నెగిటివ్ నిర్థారణ అయ్యింది. మంగళవారం రాత్రి హార్ట్ ఎటాక్ రావడంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 21-04-21, బుధవారం రాత్రి 10.30 గంటలకు మరణించారు. హిప్నో కమలాకర్ జర్నలిస్ట్, న్యాయవాదిగా పనిచేయడంతో పాటు రెండు దశాబ్దాలుగా స్టేజీ హిప్నాటిస్ట్ గా దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మూడనమ్మకాలకు వ్యతిరేకంగా చాలా కాలం పనిచేశారు. కమలాకర్ సతీమణి డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ దేశంలోనే తొలి మహిళా హిప్నాటిస్ట్. ఈయనకు కుమార్తె సరోజారాయ్, కుమారుడు హిమకర్ ఉన్నారు. ఈయనది స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి సమీపంలోని నాగుల్లంక గ్రామం కాగా, 15 ఏళ్లుగా హైదరాబాద్ అశోక్ నగర్ లో నివాసం ఉంటున్నారు. కమలాకర్ హిప్నాటిజం, సైకాలజీలపై పలు పుస్తకాలు రాసారు.

SA: