ప్రకృతితో భాగమైన చిన్నారులు

ప్రకృతి పట్ల తమ ప్రేమని చక్కని ‘చిత్రాల’ రూపంలో వ్యక్తపరిచిన చిన్నారులు

చిన్నారుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసి వారికి ప్రకృతి పట్ల అవగాహన కల్పించాలనే ముఖ్య ఉద్దేశ్యంతో నగరానికి చెందిన “స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్ స్కూల్” ఆధ్వర్యంలో 3 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రకృతిలో నేను… I @ NATURE అనే అంశంపై ఆదివారం (5-10-2025) విజయవాడలో గల శిఖర స్కూల్ క్యాంపస్ లో ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కాంటెస్ట్ లో సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రకృతి పట్ల తమకు ఉన్న ప్రేమని చిత్రాల ద్వారా చాటారు.

ఈ కాంటెస్ట్ కి ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ పావులూరి చిందబరేశ్వరరావు, ఆస్ట్రాజన్ మల్టీమీడియా పబ్లికేషన్స్ ఆర్ట్ & క్రాఫ్ట్ ఇన్చార్జి మేడా రజని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి శిఖర స్కూల్ డైరెక్టర్ బండ్ల మాధవరావు, 64 కళలు.కామ్ ఎడిటర్ కళాసాగర్, ఎలిమెంట్ స్కూల్ ఆఫ్ డిజైన్ ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ పసుమర్తి అమర దీప్తి, సోమూరి కన్స్ట్రక్షన్ డైరెక్టర్ రేష్మా సోమూరి అతిథులుగా విచ్చేసి విజేతలకు ప్రశంసా పత్రాలు, జ్జాపకాలు, పతకాలు అందజేసారు.
శిఖర స్కూల్ డైరెక్టర్ బండ్ల మాధవరావు మాట్లాడుతూ… పిల్లలను లలిత కళల్లో ప్రొత్సహించాలని తద్వారా వారికి ఓర్పు, నేర్పు అలవడడంతో పాటు, తరగతి చదువులో వున్న ఒత్తిడి నుండి ఉపశమనం పొదుతారన్నారు. పోటీలో పాల్గొన్న వారందరినీ అభినందిచారు.

సీనియర్స్ విభాగంలో విజేతలు:
* Saksham Sutar, 7th Class, VPS Public School, Vijayawada.
* Arijit Sigh, 7th Class, Nalanda Vidya Nikethan, Vijayawada.
* Shiva Sharanya, 9th Class, K.K.R. Gowtham School, Gudiwada

జూనియర్స్ యర్స్ విభాగంలో విజేతలు:
*O. Rakshita, 5th Class, NSM School, Vijayawada.
*Y. Sree Nitya, 6th Class, Kendriya Vidyalaya, Eluru
*Sk. Saadiya Thabussum, 6th Class, DAV Public School, Kondapalli

ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తి శ్రీనివాస్ పర్యవేక్షించగా యువ చిత్రకారులు గోపీ మనోజ్, హేమంత్ కుమార్, శ్రీ శివ లాస్య, పద్మజ, సింధూ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

1 thought on “ప్రకృతితో భాగమైన చిన్నారులు

  1. Wonderful article sir… thank you so much for your great support and encouragement

Comments are closed.

Share via
Copy link
Powered by Social Snap