మనల్ని ఈ ప్రపంచం గుర్తించాలంటే…?

మనకు సాధించాలనే తపన… అద్భుతాలు సాధించాలనే ఆశయమే ఉంటే… చరిత్రలో మనకు ఎన్నో ఉదాహరణలు కళ్లముందు కదలాడుతాయి.
నీవు ఏ రంగాన్ని ఎంచుకున్నావన్నది కాదు, ఆరంగంలో నీవు ఎంత వరకు అంకితభావం ప్రదర్శించావన్నది ముఖ్యం. సృజనాత్మకతతో కూడిన కళారంగం సినిమానే తీసుకుంటే… ముఖ్యంగా తెలుగులో కమర్షియల్ సినిమాలకు తెరతీసింది పెద్దాయన యన్టీఆర్ నటించిన ‘అడవిరాముడు’ అప్పట్లో అదొక ట్రెండు. ఆ తరువాత సంగీత ప్రధానంగా యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన చిత్రాలు ‘శంకరాభరణం’, ప్రేమాభిషేకం ఇదో ట్రెండు, ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ’ చిత్రంతో కొత్త యాక్షనకు శ్రీకారం చుట్టాడు. అప్పట్లో అదొక సెన్సేషన్ ట్రెండు. తరువాతి కాలంలో నాగార్జున ‘శివ’ అంటూ విరుచుకుపడ్డాడు. ఈ ట్రెండే సెపరేటు… అదే సమయంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా ‘అంకుశం’ విడుదల. ఇది ఆంధ్రాను షేక్ చేసిన ట్రెండు.
మరోపక్క తమిళంలో కమలహాసన్ ‘నాయకన్’ నాయకుడిగా, రజనీకాంత్ ‘భాషా’ గా, విక్రమ్ ‘సేతు’ గా సృష్టించిన ట్రెండులు అంతా.. ఇంతా.. కావు, మనం మళ్లీ మన తెలుగు సినిమా వద్దకు వస్తే సూపర్ స్టార్ కృష్ణకు ‘అల్లూరి సీతారామరాజు’ కృష్ణంరాజుకు ‘భక్త కన్నప్ప’, నేటి యువహీరోలు మహేష్ బాబుకు ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ కు ‘అత్తారింటికి దారేది’, రామ్ చరణకు ‘మగధీర’, అల్లు అర్జును ‘ఆర్య’ చిత్రాలే ట్రెండ్ సెట్టర్ అయ్యాయి.

ట్రెండ్ సృష్టించిన ప్రతి చిత్రమూ అద్భుత విజయం సాదించినవే. అంటే ఒకే మూస జోలికి పోకుండా విభిన్నంగా ఆలోచించడమే ట్రెండు. ఎప్పుడైతే మన ఆలోచనలు కొత్త పుంతలు తొక్కాలని ప్రయత్నిస్తామో అప్పుడే ట్రెండు అనే ప్రభంజనం మొదలవుతుంది.
మన ఆలోచనా విధానం మారకపోతే మన జీవితం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందమే.
అప్పట్లో జయమాలిని, ‘పుట్టింటోల్లు తరిమేసారు’, ‘గుగ్గుగుగ్గు గుడిసుంది’, ‘గుడివాడ వెళ్లాను’, ‘నీ ఇల్లు బంగారంగాను’, పాటలు సూపర్ డూపర్ హిట్టు, మరో పక్క జ్యోతిలక్ష్మి ‘జ్యోతిలక్ష్మి చీరకట్టింది’ పాట ఇంకా పెద్ద హిట్టు, ఇవన్నీ పెద్దాయన యన్టీఆర్ సినిమాల్లోని ఐటం సాంగ్ లే.

సినిమాలో పట్టు సడలకుండా టెంపో పెంచడానికి దర్శక నిర్మాతలు ప్రయోగించిన సక్సెస్ ఫార్ములా ఈ ఐటం సాంగు. ఇదొక ట్రెండు.
మన తెలుగు సినీ చరిత్రలో హీరో హీరోయిన్లే కాదు డాన్సలే కాదు, దర్శకులూ ట్రెండును సృష్టించారు. ప్రఖ్యాత దర్శకులు కె.విశ్వనాధ్ ‘శంకరాభరణం’, దాసరినారాయణరావు ‘మేఘసందేశం’, రామ్ గోపాల్ వర్మ ‘శివ’, రాజమౌళి ‘బహుబలి’ ఇవి దర్శకుడి సత్తాను చాటిన చిత్రాలు.. మరీ ముఖ్యంగా ‘పుష్పక విమానంతో’ పెద్దాయన సింగీతం శ్రీనివాసరావు ఇదో గొప్ప ట్రెండులు. అప్పట్లో అద్భుతమైన నవలలు వెలువడేవి గొప్ప రచయితలు యద్దనపూడి సులోచనాదేవి, యండమూరి వీరేంద్రనాధ్, మళ్లాది వెంకటకృష్ణమూర్తి నవలలు సినిమాలుగా కూడా రూపాంతరం చెంది విజయం సాధించాయి.

ఈ ఉదాహరణలన్నీ మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ను సద్వినియోగం చేసుకోవడమే.
ప్రతి ఒక్కరూ వారిలోని నైపుణ్యాన్ని వెలికితీసి నిరంతరం కృషిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ప్రతి ఒక్కరూ నిత్యం కృషితో ఎంతో ఎత్తుకు ఎదగడానికి ప్రయత్నించాలి. మనలోని కృషి ద్వారా మనలోని లోపాలు సవరించబడతాయి. మనలో లోపాలుంటే మనల్ని ఈ ప్రపంచం గుర్తించదు. అందుకే నిత్యం కృషిని నమ్మాలి. నీవు ఏదో ఒకటి సాధించి, నీకంటూ ఒక ట్రెండు సృష్టించాలంటే నీ కృషిని నమ్ముకుని ఏదైనా అద్భుతానికి తెరతీయాలి.
-రాజశేఖర్

1 thought on “మనల్ని ఈ ప్రపంచం గుర్తించాలంటే…?

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link