78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని పెంపొందించుటకు మరియు వారిని కళలలో ప్రోత్సహించడానికి ధన్యవాదాలు శంభయాచార్య లలిత కళా పురస్కారం వారి సంయుక్త ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయం ఏదైనా ఒక దేశభక్తి గీతం అన్న మూడు విభాగాలుగా విభజించి, పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పోటీలను నిర్వహించారు.
ఈ కార్యక్రమం గుంటూరు దేశీయ విశ్వబ్రాహ్మణ సమాజం, అరండల్ పేట నాలుగో లైన్ లో ఆదివారం (11-8-2024) ఉదయం స్వాతంత్ర సమరయోధులకు ఘనమైన నివాళులు అర్పించి, ముందుగా అల్లూరి సీతారామరాజు ఏకపాత్రాభినయాన్ని మొదలుపెట్టారు. తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయి తదుపరి దేశభక్తి గీతాలను పిల్లలు వారి వారి అభినయాన్ని జోడిస్తూ, ఎంతో చక్కగా ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కన్నా స్కూలు, లోటస్ ఆద్య వెంకటేశ్వర బాల కుటీర్ స్కూల్ రైలుపేట, సరస్వతి శిశు మందిర్ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం రేఖా చిత్ర సౌగంధికా నేషన్ బిల్డ్ అవార్డు గ్రహీత ఎన్నో లఘు చిత్రాలను సొంతంగా రచించి దర్శకత్వం వహించిన గన్నే నాగవాసదేవరావు గారు మాట్లాడుతూ…. స్కూలులో బోధించే సబ్జెక్టులతో పాటు కళలను కూడా గుర్తించాలని ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నామని, పిల్లలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వలన వాళ్లకు తగిన గుర్తింపు వస్తుందని. ఇంతవరకు ఎన్నో సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు అలాగే తోటి వారితో గౌరవంగా నడుచుకునేలాగా వాటన్నిటిని తెలియజేయుటకు ఈ లఘు చిత్రాలను చిత్రిస్తున్నాను. ఇందులో ఎక్కువగా పిల్లల పాత్రలే కనిపిస్తుంటాయి. ఎందుకంటే భావితరాన్ని తీర్చిదిద్దుకోవలసిన బాధ్యత వాళ్ల మీద ఉంటుంది, కాబట్టి నేటి పిల్లలే రేపటి పౌరులు రేపటి పౌరులు ఆదర్శవంతంగా ఉండాలని మా ప్రయత్నం ఈ ప్రయత్నానికి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో సంగీత, సాహిత్య కథ గాన విశ్వసంకీర్తనచార్య కొర్లపాటి సంభయాచారి గారు మాట్లాడుతూ… చిన్న పిల్లలతో ఈ కార్యక్రమం చేయటం ఎంతో ఆనందాన్ని మనస్సుకు హాయినిచ్చిందని అన్నారు. చిన్నపిల్లలు ఈ వేదిక మీద అల్లూరి సీతారామరాజు, ఝాన్సీ లక్ష్మీబాయి ఏకపాత్రాభినయంలో చిరంజీవిల అభినయాన్ని చూపిస్తూ కళ్ళకు కట్టినట్టుగా మనసులో భావోద్వేగాన్ని గురయ్యేలాగా ఉన్నాయని, ఎటువంటి స్వార్థం లేకుండా ఈ కార్యక్రమాలు మంచి మనసుతో చేస్తున్నందుకు ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఈ కార్యక్రమాలు ఎప్పుడు చేసినా నా వంతు సహాయ సహకారాలు నిస్వార్థంతో అందించగలనని అన్నారు. విశ్వకర్మ పీఠం నాగమల్లేశ్వరరావు గారు మాట్లాడుతూ… పిల్లలు చదువుతోపాటు గేయాలను గీతాలను పద్యాలను తత్వాలను నేర్చుకోవడం వల్ల అందులోని సారాంశాన్ని అర్థం చేసుకొని మంచి భవిష్యత్తు పొందగలరని అన్నారు. ఈ కార్యక్రమాన్ని డమరుకం వెల్దకళా సమితి వ్యవస్థాపకులు మల్లికార్జున ఆచారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ…. ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్ నుంచి టీచర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నందుకు, పిల్లల పట్ల ఇంత శ్రద్ధ వహించిన స్కూలు యాజమాన్యాలకి ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన పిల్లల్లో ఉన్నటువంటి స్టేజ్ ఫియర్ అన్నది తొలగిపోతుందని వేదిక పైన ఎలా మాట్లాడాలి, ఎలా అభినయించాలి అన్నది ఇలాంటి వాటిల్లో పాల్గొన్నప్పుడు చూసి నేర్చుకోగలరని ఇందులో బహుమతులు పొందాలి అనటం కంటే ఇలాంటి వాటి దగ్గర చూసి నేర్చుకోవడం వలన వారు మానసికంగా ఎంతో అభివృద్ధి చెందటం మానసికంగా దృఢపడటం నలుగురిలో మాట్లాడటం వారిలో భయాన్ని తొలగిపోవడం ధైర్యంగా మాట్లాడగలిగే శక్తి వస్తుందని అన్నారు.
ఈ ప్రోగ్రాం లో డా. వి హనుమంతరావు గారు మాట్లాడుతూ… నా వృత్తి ఆర్ఎంపీ డాక్టర్ గా కొనసాగుతున్న వాసుదేవరావు గారి దర్శకత్వంలో చిత్రిస్తున్న లఘు చిత్రాలలో నేను నటించటం నా మనసుకు ఎంతో ఆయన ఇచ్చిందని సంతోషాన్నిచ్చిందని అన్నారు. చిన్నపిల్లలు కూడా చిత్రాలలో నటించడం వారిని చూసి ఆనంద పడటం మరియు ఈ కార్యక్రమంలో ఇంతమంది పాల్గొనటం, చాలా సంతోషాన్నిచ్చిందని ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమానికి వెన్నెముకగా నిలిచిన సీనియర్ జర్నలిస్ట్ రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని చేయాలని సంభాషించిన వాసుదేవరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రోగ్రాం ఇలా చేయాలని చెప్పగానే నా వంతుగా చేయవలసిన కార్యక్రమాలు సహాయ సహకారాలన్నీ చేశానని కల్మషం లేని చిన్నారులతో ఈ ప్రోగ్రామ్ని ఎలాంటి స్వార్థం లేకుండా కేవలం చిన్నపిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికితీయుటకు వారిని గుర్తించుటకు చేసిన ప్రోగ్రాం కోసం నా వంతుగా నేను సహకరించినందుకు చాలా ఆనందంగా ఉంది అని, ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని వాటన్నింటికీ నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమం పోటీల నిర్వహణ జరిగిన తదుపరి న్యాయ నిర్ణీతల నిర్ణయం ప్రకారం ప్రధమ, ద్వితీయ, తృతీయ మూడు విభాగాలలో ఎంపిక చేశారు.
బహుమతులు: అల్లూరి సీతారామరాజు విభాగంలో ప్రథమ బహుమతి ఎస్. నీరజ్, వెంకటేశ్వర బాల కుటీర్, ద్వితీయ బహుమతి ఎస్. సాయి కృష్ణ విజయం పబ్లిక్ స్కూల్ రైలుపేట, తృతీయ బహుమతి, ప్రణీత్ సరస్వతి శిశు విద్యా మందిర్.
ఝాన్సీ లక్ష్మీబాయి రెండవ విభాగంలో ప్రథమ బహుమతి ధృతి కన్నా స్కూల్, ద్వితీయ బహుమతి హరిణి సరస్వతి శిశు విద్యా మందిర్, తృతీయ బహుమతి మోక్ష శ్రీ లోటస్ ఆద్య స్కూల్. దేశభక్తి గీత ఆలాపనలో ప్రధమ బహుమతి కె. కమల్య కాటూరి పబ్లిక్ స్కూల్, ద్వితీయ బహుమతి నవనీత లోటస్ ఆద్య స్కూల్, తృతీయ బహుమతి బి.వి. చందన సాయి కన్నా స్కూల్. వీరికి ప్రధమ, ద్వితీయ, తృతీయ మొమెంటోలను మరియు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హరినాథ్ గారు, సుకన్య మమత, ఆంజనేయులు, సాంబయ్య న్యాయ నిర్ణయితలుగా వ్యవహరించారు. అలాగే కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థిని విద్యార్థులకు రసం శాపత్రాలను అందజేశారు. చివరగా జాతీయగీత ఆలాపనతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి సహాయ సహకారాల మించిన ప్రతి ఒక్కరికి తల్లితండ్రులకు విద్యాసంస్థల యాజమాన్యాలకు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
-కళాసాగర్ యల్లపు