ఊహలకు, వాస్తవికతను జోడించి కాన్వాస్‌కు జీవం పోస్తున్న కళాకారుడు-డాక్టర్ బొండా జగన్మోహనరావు.
కొండకోనల్లో నివశించే గిరిజనులు శ్రేయస్సే ఆయన ధ్యేయం.. లక్ష్యం..! ఆధునిక సమాజంలో నివశిస్తున్న వారందరికీ పూర్వికులు గిరిజనులేనన్న ధృక్పధంతో గిరిజనుల జీవనశైలిపై నిరంతర పరిశీలన చేసిన గిరిజన గీతశిల్పి డా. బొండా జగన్మోహనరావు. భారతదేశవ్యాప్తంగా ఎన్నో గిరిజన ప్రాంతాలను సందర్శించి, కొండకోనల్లోని గిరిజనుల జీవన విధానాన్ని నిశితంగా పరిశీలించి… వారి సంస్కృతీ సాంప్రదాయాలను తన చిత్రాల్లో ప్రతిబింబిస్తూ… గిరిజనుల అభ్యున్నతి కోసం అహరహం పాటుపడుతున్న కళాకారుడు ఈయన. గిరిజనుల జీవన శైలిపై సమగ్ర అవగాహనతో చిత్రాలను గీస్తూ గిరిజన గీతశిల్పిగా పేరొందిన విజయవాడకు చెందిన జగన్మోహనరావు గిరిజనుల ఆచార వ్యవహారాలను, వారి జీవనశైలిని తాను ఎన్నో సంవత్సరాలుగా దగ్గర నుండి గమనిస్తూ వారికి తన చేతనైన సాయం చేస్తున్నారు. బ్యాంకింగ్ రంగంలో ఉన్నత పదవిలో పదవీ విరమణ పొంది, తదుపరి సమాజ సేవ, కళాసేవ మార్గాల్లో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ప్రజాహితాన్ని కోరి భారతీయ సంస్కృతి, కళ, సమాజసేవలో తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తూ… స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
ఇటీవవల డా. జగన్మోహనరావు గారు “Inspiring Global Artist Award 2024” కు ఎన్నిక కాబడిన సందర్భమున, MTTV Global Magazine వారి పత్రికలో నిర్వహించిన “మాటా మంచీ విశేషాలు” 64కళలు.కాం పాఠకుల కోసం…
కీలక విజయాలు:
● ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు
● కళా నైపుణ్యం కోసం 100 పైగా అవార్డులు మరియు పతకాలు
● కళాకారుడిగా గౌరవ డాక్టరేట్
● బ్యాంకింగ్ పరిశ్రమలో న్యాయమైన మరియు విశ్వసనీయమైన సేవకు సిల్వర్ జూబ్లీ మైల్‌స్టోన్ అవార్డు
● కటక్ లో గల అంతర్జాతీయ జ్యోతిష్య శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి జ్యోతీష్య శ్రీ అవార్డు
● గిరిజన కళా గౌరవ్ సమ్మాన్-2022, నెల్సన్ మండేలా గ్లోబల్ బ్రిలియన్సీ అవార్డ్-2022
● కళా గౌరవ్ సమ్మాన్-2022, స్వదేష్ నవరత్న అచీవర్స్ అవార్డ్-2023
● మహాత్మగాంధీ గ్లోబల్ ఫీస్ అవార్డ్-2023, లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గ్లోబల్ అవార్డు 2024
● స్వదేశ్ సంస్థాన్ ఇండియా వారి ఇంటర్నేషనల్ నోబుల్ ఆర్టిస్ట్ అవార్డ్ -2024
ఇంకా అనేక జాతీయ, అంతర్జాతీయ Icon, Legendary అవార్డులు వీరిని వరించాయి… వరిస్తున్నాయి…. ఇదంతా వారి నిస్వార్ధ సేవకు, కళా నైపుణ్యతకు లభించిన గౌరవము.
సామాజిక మార్పు కోసం పాటుపడే శక్తి ఒక్క కళకు మాత్రమే ఉన్నదని చెప్పడానికి జగన్మోహనరావు జీవితమే నిదర్శనం. ప్రతి బ్రష్ స్ట్రోక్‌తో, ఆయన గిరిజన జీవిత సౌందర్యాన్ని సంగ్రహించడమే కాకుండా, మానవ వారసత్వాన్ని కాపాడుకోవడంలో మన భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యత గురించి ఆధునిక ప్రపంచానికి శక్తివంతమైన సందేశాన్ని కూడా ఇస్తున్నారు. ఆయన 70 సంవత్సరాల వయస్సులో తన ప్రయాణంలో తదుపరి అధ్యాయాన్ని ప్రారంభించినప్పుడు, ఆయన తన లక్ష్యం కోసం అంకితభావంతో కళాసృజన, సేవ చేయడంతో పాటు ఎందరికో ప్రేరణకలిగిస్తున్నారు.
ప్రశ్న: “గిరిజన తెగలు” ఎదుర్కొంటున్న పలు సవాళ్ళు… మీ పనిని ప్రేరేపించడానికి ఎలా ఉపకరిస్తాయి?
జవాబు: “నా బ్యాంకింగ్ సర్వీస్ లో, న్యాయమైన మరియు విధేయతతో కూడిన సేవలు అందించినందులకు గానూ నేను సిల్వర్ జూబ్లీ మైల్‌స్టోన్ అవార్డును అందుకున్నాను. నా విద్యార్థి జీవితంలో నేను చెస్ ప్లేయర్‌ని. స్టాంప్ మరియు నాణేల సేకరణ, పుస్తక పఠనం, నా ఇతర అభిరుచుల్లో కొన్ని. కటక్ లో గల అంతర్జాతీయ జ్యోతిష్య శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి జ్యోతిష్య శ్రీ అవార్డు అందించింది. విజయవాడలో హోమియోపతి ఫిలాసఫీ నేర్చుకున్నాను. సమాజానికి సేవ చేయడమే సమాజానికి నా కృతజ్ఞతలు. నా ప్రయాణంలో, నేను ఒక తెగ కష్టాలను చూశాను, ఆ రోజే, నేను నా జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాను. నా శక్తి మేరకు వారికి సేవ చేశాను. బ్యాంకులో కస్టమర్ సేవ నా విధి మాత్రమే కాదు భాద్యత కూడా.
ప్రశ్న: మీ పెయింటింగ్‌లు గిరిజన మరియు పేదలకు ప్రత్యక్షంగా ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి? ఈ కారణంపై మీ నిబద్ధతను ఎలా నడిపిస్తుంది అనేదానికి మీరు ఉదాహరణలను పంచుకోగలరా?
జవాబు: ముందుగా, మనలో ప్రతి ఒక్కరికీ ట్రైబల్ హారిజన్ ఉంటుందని మనం అంగీకరించాలి… వారే మన పూర్వీకులు! పచ్చని అడవుల అందం ముఖ్యంగా “గిరిజన” జీవితంతో నిండి ఉంటుంది. సాధ్యమయ్యే ఏదైనా సాధనం ద్వారా మనం ఆధునిక ప్రపంచానికి సందేశం పంపాలి. అది నేను పెయింటింగ్ కళ ద్వారా చేసి, విజయం సాధించాను! “మానవత్వం లేని జీవితం జీవితమే కాదు” ఎదుటివారిలోని ఆనందాన్ని చూస్తే జీవితం ఆనందమయమవుతుంది, ఇప్పుడు నేను 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాను, నా ప్రయాణం కొనసాగుతోంది… నా చివరి శ్వాస వరకు నాకు లక్ష్యాలు లేవు కానీ మైలురాళ్ళు మాత్రమే వున్నాయి!
నా ఈ ప్రయాణంలో సాధిస్తున్న విజయాలు నా బాధ్యతను ద్విగుణీకృతం చేస్తున్న మైలురాళ్లు మాత్రమే…
సేవాభాగ్యం ఒక్కటే నా జీవన లక్ష్యం! అదీ నా కొన ఊపిరి కొనసాగినంతవరకు…!
డా. జగన్మోహనరావు గారు “Inspiring Global Artist Award 2024” ను ఈనెల 19 న ఢిల్లీ, రాడిసన్ హోటల్ లో జరగబోయే కార్య్రక్రమంలో అందుకోనున్నారు.
-కళసాగర్ యల్లపు
Once in a while a person emerges in society to lead and inspire others with his talent and commitment.
Dr. Jagan Mohan Rao Bonda is one such person, drawing attention to his drawings depicting various shades of Tribal beauties and conditions of life. Richly deserves Padma Bhushan from Government of India 🇮🇳
గిరిజనుల జీవితాలను తన *కళ* ద్వారా వెలుగులోకి తెస్తున్న బండా జగన్ మోహన్ రావు అభినందనీయులు.
Very nice 👍