అంతర్జాతీయ స్థాయి క్యారికేచర్ పోటీ

బహుభాషా కోవిదుడు, ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు, భాతరదేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన తెలుగువాడు అయిన పీవీ నరసింహారావు శత జయంతి ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర కార్టూనిస్టుల సంక్షేమ సంఘం ఆద్వర్యం లో “అంతర్జాతీయ స్థాయి క్యారికేచర్ (International Caricature Contest)” పోటీ –

నిబంధనలు:
1. జూన్-20 వ తేదీ లోపు t.toonists@gmail.com ఈ మెయిల్ కు చేరేట్లు పంపాలి,
2. మొదటి బహుమతి Rs.2516-00, రెండవ బహుమతి Rs.1516-00, మూడవ బహుమతి Rs.1016-00, తో పాటు పోటీలో పాల్గొన్న వారందరికీ ప్రశంశాపత్రాలు అందజేయడం జరుగుతుంది.
3. క్యారికేచర్ బ్లాక్ అండ్ వైట్ లేదా కలర్ లో కూడా పంపవచ్చు.
4. పేపర్ పై వేసి పంపేవారు A4 లో వేసి విధిగా ప్రొఫషనల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి పంపాలి.
5. డిజిటల్ ఫార్మటులో పంపేవారు వెడల్పు-2480, ఎత్తు-3508 పిక్సల్స్ సైజ్ లో 150 లేదా 300 డీపీఐ(DPI) లో డ్రా చేసి పంపాలి, ఒక వేల పెద్ద సైజ్ లో డ్రా చేసినా పైన సూచించిన సైజ్ లో ఫిట్ అయ్యేట్లు ఉండాలి. ఎందుకంటే అవసరమైతే భవిష్యత్తులో మీ క్యారికేచర్ ప్రదర్శనకు అనుకూలించాలి.
6. బహుమతుల నిర్ణయాధికారం నిర్వాహకులదే, వాదనలకు అభిప్రాయాలు వెలిబుచ్చేందుకు అవకాశం లేదు.
7. పోటీకి వచ్చిన బొమ్మలు ఏ రకంగానైనా వాడుకునేందుకు నిర్వాహకులకు అధికారం ఉంటుంది.
8. ఎవరైనా ఈ పోటీలో పాల్గొన వచ్చు.
9. పోటీలో పాల్గొనే వారు వారి పాస్ పోర్ట్ సైజు ఫోటో తో పాటు సంక్షిప్తంగా వారి వివరాలు పంపాల్సి ఉంటుంది.
10. మరిన్ని వివరాలకు తెలంగాణా కార్టూనిస్టు సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రాజమౌళి (91 7780137695), ఆర్గనైసింగ్ కార్యదర్శి కళ్యాణం శ్రీనివాస్ (91 9346273799)లను సంప్రదించవచ్చు.
-వేముల రాజమౌళి,
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ రాష్ట్ర కార్టూనిస్టుల సంక్షేమ సంఘం,

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap