ఫిబ్రవరి 6 నుండి 10 వ తేదీ వరకు, గుంటూరు, శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో.
ఎక్కడో ఎప్పుడో కాదు… దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా..ఆంధ్ర ప్రదేశ్ లో.. గుంటూరులో… శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో… ఫిబ్రవరి 6,7,8,9,10 తేదీల్లో… అదొక కళా జాతర… కన్నుల పండుగగా చూసే అదృష్టం…ముందుగా మీ సీట్ లో కూర్చొని చూడండి.
2026 భారత్ రంగ్ మహోత్సవం దేశంలో 40 ప్రదేశాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, దక్షిణ భారత దేశంలో ప్రప్రథమంగా గుంటూరులో నిర్వాహణలో పూర్తి బాధ్యత తీసుకున్న డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబును అభినందించాలి. పూర్వ గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా ఎడ్లపాడు గ్రామానికి చెందిన యువ వ్యాపార వేత్త, కళా తపస్వి కళా కారుడు డాక్టర్ ముత్తవరపు సురేష్ బాబు నేతృత్వంలో రాష్ట్రంలోని కొన్ని నాటక పరిషత్తులు సమ్మేళనం చేసి "వేదిక" గా నామకరణం చేసి NSD (National School of Drama)ఢిల్లీ మరియు "వేదిక" సారధ్యం లో భారత్ రంగ్ మహోత్సవం నిర్వాహణ ప్రశంసనీయం.
జనవరి 27 నుంచి ఫిబ్రవరి 26 వరకూ మన దేశంలో..ఈ షెడ్యూల్ ప్రకారం దక్షిణ భారతదేశంలో బహుశ ప్రప్రథమంగా గుంటూరులో నిర్వహిస్తున్న ఈ భారత్ రంగ్ మహోత్సవం(Bharat Rang Mahotsav) కోసం "వేదిక" అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు నేతృత్వంలో, భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగు నాటకరంగ గౌరవాన్ని, భారతీయ నాటక సంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటిచెప్పే లక్ష్యంతో తెలుగు నాటక కళా పరిషత్‌ల సమ్మేళనం – “వేదిక” ఆధ్వర్యంలో, భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD), న్యూఢిల్లీ సహకారంతో “భారత్ రంగ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం”(International Theatre Festival)ను ఘనంగా నిర్వహిస్తున్నట్లు "వేదిక" అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 3:00 గంటల నుండి సాయంత్రం 9:00 గంటల వరకు నాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. తెలుగు నాటక రంగం దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్తరించాలి అనే ప్రధాన సంకల్పంతో ‘వేదిక’ ఈ అంతర్జాతీయ నాటక ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. నాటకం అనేది కేవలం వినోద సాధనం మాత్రమే కాకుండా, సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తివంతమైన మాధ్యమం. ఆ విలువలను నేటి తరం ముందుకు తీసుకెళ్లడమే ఈ ఉత్సవ లక్ష్యం” అని అన్నారు.
ఈ ఐదు రోజుల నాటక మహోత్సవంలో దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు, భిన్న భాషల నుంచి వచ్చిన ప్రతిభావంతమైన నాటక బృందాలు పాల్గొంటున్నాయని, ప్రతి రోజు సాయంత్రం 7:00 గంటలకు ప్రత్యేక నాటక ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. సమాజాన్ని ఆలోచింపజేసే, వినోదంతో పాటు సందేశాన్ని అందించే కథాంశాలతో కూడిన నాటకాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని చెప్పారు.
అదేవిధంగా, నాటక కళాకారులకు ఇది ఒక గొప్ప వేదికగా నిలవడమే కాకుండా, యువతలో నాటక కళపై ఆసక్తి పెంచేందుకు ఈ మహోత్సవం దోహదపడుతుందని పేర్కొన్నారు. నాటక రంగంలో అనుభవజ్ఞులు, సీనియర్ కళాకారులు, దర్శకులు, రచయితల భాగస్వామ్యంతో ఈ ఉత్సవం మరింత వైభవంగా సాగుతుందని తెలిపారు.
ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, కళాకారులకు వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని, ఉదయం నుండి సాయంత్రం వరకు కళా సంభాషణలు, చర్చలు కూడా నిర్వహించనున్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన గుంటూరు జిల్లాతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు, కళాభిమానులు, విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో ఈ “భారత్ రంగ మహోత్సవ్ – అంతర్జాతీయ నాటక ఉత్సవం”కు హాజరై, నాటక కళను ఆదరించాలని హృదయపూర్వకంగా ఆహ్వానించారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల లో వివరాలు ఇవి గోవాలోని సఖాలి, త్రిపుర రాష్ట్రం అగర్తలా (ఫిబ్రవరి 8,9,10,11), గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో 14,15,16, మిజోరం రాష్ట్రం ఐ.జి. వా ల్, అండమాన్ 13,14,15 తమిళనాడులో ఆరువెల్లి లో 6,7,8, బెంగళూరు, డామన్ & డయ్యు, 9,10,.
డెహరాడూన్ 12,13,14,15, నాగా ల్యాండ్ లో దిమాపూర్, సిక్కింలో గ్యాంగ్ టాక్, హైదరాబాద్ (ఫిబ్రవరి 7,8,9,10), మణిపూర్ రాష్ట్రంలో ఇంఫాల్, అరుణాచల్ ప్రదేశ్ లో అయితా నగర్, రాజస్థాన్ లోని జైపూర్ ఫిబ్రవరి 13,14,18,19, జమ్మూలో ఫిబ్రవరి 9,18 కలకత్తా, హిమాచల్ ప్రదేశ్ లో మండిలో 9,10,
ముంబైలో ఫిబ్రవరి 9,10,11,12 అస్సాం నాగోన్, ఒరిస్సాలోని పరదీప్, బీహార్ రాష్ట్రంలో పాట్నా,
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఫిబ్రవరి 11,12,13,14,15, పుదుచ్చేరిలో ఫిబ్రవరి 9,10,11 తేదీల్లో,
పూణే, ఛత్తీస్గఢ్ లోని రాయపూర్, జార్ఖండ్ లోని రాంచి, గుజరాత్ రాష్ట్రంలోని సూరత్,
కేరళలోని త్రిసూర్ లో ఫిబ్రవరి 15,16,17,18 మేఘాలయ లోని తూర ఫిబ్రవరి 17,18, ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, హర్యానాలోని రోటక్ లో ఫిబ్రవరి 9,10,11,12 చండీగర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు నిర్వహిస్తూన్నారు.
ఎందుకు ఈ ఉత్సవం?
నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) నిర్వహించే అంతర్జాతీయ నాటక ఉత్సవం, భారత్ రంగ్ మహోత్సవ్ (BRM) 2026యొక్క 25వ ఎడిషన్ ఇది. జనవరి 27 నుండి ఫిబ్రవరి 20, ఢిల్లీలోని వివిధ వేదికలలో మరియు దేశవ్యాప్తంగా 40 ప్రదేశాలలో జరుగుతుంది. ఈ ఉత్సవం లో కేవలం దేశం నుంచే కాకుండా…
అంతర్జాతీయ భాగస్వామ్యం: ఏడు ఖండాల నుండి 12 అంతర్జాతీయ నిర్మాణాలు ప్రదర్శనలు ఉంటాయి…
ఏమేమి ఉంటాయి?
విభిన్న ప్రదర్శనలు: జానపద, సాంప్రదాయ, శాస్త్రీయ సంస్కృతం మరియు సమకాలీన నాటకాలు ఉంటాయి.
ప్రత్యేక విభాగాలు: జష్న్-ఎ-బచ్‌పన్ (పిల్లల థియేటర్), బాల్ సంగం (జానపద నృత్యం) మరియు ఆదివియ (వీధి థియేటర్).
థియేటర్ బజార్: కొత్త నాటక రచయితలను ప్రోత్సహించడానికి.
----------------------------------------------------------------
Feature Photo details: శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, గుంటూరు లో జరగబోయే భారత్ రంగ్ మహోత్సవం బ్రోచర్ విడుదల చేసిన సాంసృతిక శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు
Bharath Rang, Guntur Invitation
