( జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా …)
వ్యయం లేనిది యోగా
భయం లేనిది యోగా
యోగా అందరికీ ఆనందమేగా !
ఇది సత్యం …
మన ఆదియోగి పశుపతి
యోగా నిత్యం ఓ సుకృతి
యోగాతో తథ్యం ఆరోగ్య ప్రగతి
యోగా మన ప్రాచీన వైద్య వసతి
యోగాతో కలిగెను వ్యాధుల నిష్కృతి
యోగాతో అమరేను అందమైన శరీర ఆకృతి
యోగాతో మంచిగా మారేను శరీర ప్రకృతి
యోగాకు లేదు వయోపరిమితి
యోగా కలిగించును మంచి మానసిక స్థితి
అందుకే..
నేడు మన యోగ విద్యకు అంతర్జాతీయ ఖ్యాతి !
-బి.ఎం.పి. సింగ్