నెత్తుటి మరకకు వందేళ్లు

జలియన్ వాలా బాగ్ దురంతంలో (సరిగ్గా నేటికి 101 సం. పూర్తి )
అసువులు బాసిన అమర వీరులకు అశ్రునయనాల జోహార్లుచరిత్రలో అత్యంత విషాద దినం ఈరోజు.. ఆ నెత్తుటి మరకకు వందేళ్లు పూర్తయ్యాయి. 1919 ఏప్రిల్ 13వ తేదీ అది..
సిక్కుల పవిత్ర దినం వైశాఖి సందర్భంగా పంజాబ్ లోని అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో వేలాది మంత్రి సమావేశమయ్యారు.. బ్రిటిష్ పాలన దమననీతిని ఎండగడుతూ వక్తలు ప్రసంగిస్తున్నారు.. ఇంతలో జనరల్ డయ్యర్ 90 మంది సైనికులతో మైదానంలోని వచ్చాడు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు ప్రారంభించారు.. అక్కడి జనం తప్పించుకోడానికి కూడా వీలు లేకుండా పోయింది..
ఆ ఘోర ఘటనలో దాదాపు వేయి మంది మరణించారు.. బ్రిటిష్ వారు మాత్రం అధికారికంగా 379 మంది మాత్రమే చనిపోయారని చెప్పారు.. జలియన్ వాలాబాగ్ ఘటపై దేశమంతా ఆగ్రహావేశాలతో రగిలిపోయింది. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత విషాదకరమైన రోజు ఇది.. ఈ దారుణానికి కారణమైన జనరల్ డయ్యర్ లో ఏమాత్రం పశ్చాతాపం లేదు. అతనిపై విచారణ జరిపిన బ్రిటిష్ ప్రభుత్వం కేవలం ర్యాంకు తగ్గించడంతో సరిపుచ్చింది.. ఆ తర్వాతి కాలంలో ఉద్దాం సింగ్ అనే యోధుడు బ్రిటన్ లో డయ్యర్ ను కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు..
జలియన్ వాలా బాగ్ లో వందేళ్ల క్రితం అసువులు బాసిన మన దేశ ప్రజలను గుర్తు చేసుకుందాం.. వారి ప్రాణ త్యాగాలకు ఘనంగా నివాళిఅర్పిద్దాం..జలియన్ వాలా బాగ్ మారణహోమానికి నూరేళ్ళు…..
**************
13 ఏప్రిల్ 1919 దేశ చరిత్రలో మరిచిపోలేని రోజు పంజాబ్ అమృత్ సర్ లోని జలియన్ వాలా బాగ్ లో శాంతియుతంగా సమావేశమైన భారత దేశ భక్తుల మీద బ్రిటీష్ పోలీసులు కాల్పులు జరిపి వేయ్యి మంది భారతీయులను చంపి మారణహోమం సృష్టించి శనివారం నాటికి నూరేళ్ళు అవుతుంది.ఈ మారణహోమంతో భారత స్వతంత్ర్య సంగ్రామం కొత్త మలుపు తిరిగింది.బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వతంత్ర్య పోరాటం ఇంకా తీవ్ర రూపాన్ని దాల్చింది.జలియన్ వాలా బాగ్ మారణహోమానికి నూరేళ్ళు పూర్తైన సందర్భంగా ఆ రోజు బ్రిటీష్ పోలీసుల కాల్పుల్లో బలిదానమైన దేశ భక్తులను స్మరిస్తూ….
భారత్ మాతా కి జై.

SA: