జానపద చిత్రకళాబ్రహ్మ జెమినిరాయ్

జెమినిరాయ్ ఏప్రియల్ 11న 1887 లో బలియతోర్, కలకత్తాలో జన్మించారు. సాంప్రదాయ పమరియు పశ్చిమ దేశ సాంప్రదాయ చిత్రకళ రెండింటిలోను ఈయన అందెవేసిన చిత్రకారులుగా ప్రసిద్ధిచెందారు.
తన 16వ ఏట అవనీంధ్రనాద్ టాగూర్ గారు ప్రిన్సిపల్ గా ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజి ఆఫ్ ఆర్ట్స్ లో చేరి ఆరు సంవత్సరాల తర్వాత 1908వ సం.లో డిగ్రీ తీసుకొని పశ్చిమ దేశ సాంప్రదాయమైన ల్యాండ్ స్కేప్ మరియు పోటెట్ పెయింటింగ్ వేస్తూ వచ్చారు.
తన 30వ ఏటా ఏదైనా కొత్త ఒరవడి సృష్టించాలని కలకత్తా నుండి తన స్వగ్రామమైన బలియతోర్ వెళ్ళి తన చిన్నప్పుడు ఎంతో ఆసక్తి చూపించిన మట్టి విగ్రహాల తయారీని పరిశీలిస్తూ (ఆనాటికి) అప్పటికీ ప్రచారంలో ఉన్న ఖాళీఘాట్ చిత్రకళను బాగా పరిశీలించి దాని నుంచి ఒక ప్రత్యేక శైలితో చిత్రాలు చిత్రించారు. జెమినిరాయ్ చిత్రరచనకు సాధారణంగా ఉపయోగించే యూరోపిన్ రంగులు, కాన్వాసులు కాకుండ గుడ్డమీద, చాపలమీద, సున్నంతో పూతపూసిన చెక్కల మీద సహజ రంగులు మరియు మట్టితో, చాక్ పౌడర్, పువ్వులతో తయారుచేయబడిన పెగ్ మెంట్స్ తో కొత్త వరవడిని సృష్టించారు. సాధారణంగా ప్రతిచిత్రంలో ఇండియన్ రెడ్, ఎల్లో ఆకర్, కాడియమ్ గ్రీన్, వెరిమిలిన్, గ్రీ, బ్లూ మరియు తెలుపు అనే సప్తరంగులనే వాడుతూవచ్చారు.

Jamini Roy art

జెమినిరాయ్ వేసిన చిత్రాలు సాధారణంగా ప్రతిరోజు మనం చూసే దృశ్యాలను మాత్రమే తన చిత్రితాంశాలను తీసుకొని చిత్రిస్తూ వచ్చారు. వీటితో పాటు మతసంబంధమైన రామాయణ, రాధాకృష్ణ, జీసస్ క్రీస్తు థీమ్స్ మీద మరియు గిరిజన తెగ సంతతి జీవన విషయాల మీద కూడా సీరీస్ ఆఫ్ చిత్రాలు చిత్రిస్తూ వచ్చారు.
జెమినీరాయ్ గార్ని “ఆర్ట్ మెషిన్” గా అభివర్ణిస్తూంటారు. ఎందుకంటే ఆయన జీవితకాలంలో 20,000లకు పైగ చిత్రాలు వేశారు. అంటే ప్రతిరోజు 10 చిత్రాలు వేసిన ఏ మార్పులేక అన్ని ఒకే ఒరవడి అంటే పోక్ స్టైల్ తో బోల్ లైన్స్ తో తక్కువగీతలతో, సహజత్వం ఊడిపడు వుంటాయి.
జెమినీరాయ్ వేసిన చిత్రాలను సాధారణ మధ్యతరగతి వారే ఎక్కువగా అభిమానిస్తారని, వారే తన చిత్రాల గురించి సరియైన అభిప్రాయాలు ఇచ్చేవారని నమ్మేవారు. అందుకే ఆయన చిత్రాలను 350 రుపాయలకు మించి ఎప్పుడు అమ్మలేదు అయినప్పటికి ధనిక వర్గం ఈయన చిత్రాలకు ఆకర్షింపబడడం వల్ల జెమినిరాయ్ గారు సొమ్ములు గడించారు.
1930 సం.లో సైలేజ్ ముఖర్జీ గారితో పాటు, జెమినీ రాయ్ గార్ని మరియు అమృత షేర్ గిల్ గార్ని మోడరన్ ఆర్ట్ కు పితామహులుగా గుర్తించారు.

అవార్డులు మరియు రివార్డులు:

  1. వైస్రాయ్ గోల్డ్ మెడల్-1934 సం. అందుకున్న తర్వాత జెమినిరాయ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు.
  2. పద్మభూషణ అవార్డ్ 1954వ సం.లో అందుకొన్నారు.
  3. లలిత కళా అకాడమి పెల్లోషిప్-1955

ఆర్ట్ కలక్షన్స్:

  • విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం-లండన్
  • ది హార్న్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్-యూనివర్శిటీ ఆఫ్ ఫోరిడా
  • నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్-న్యూఢిల్లీ

ఫ్యామిలీ : జెమినీరాయ్ గార్కి నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి సంతానంగా ఉన్నారు. ఆయన నిర్మించిన బల్లిగుంగే ప్యాలెస్ ప్రస్తుతం కోడళ్ళ ఆధ్వర్యంలో ఉంది.
1972వ సంవత్సరంలో 85వ జన్మదినం జరుపుకొన్న కొన్నిరోజుల తర్వాత ఏప్రిల్ 24న కలకత్తా నగరంలో పరమపదించారు.

Jamini Roy folkart

ప్రభుత్వాలమీద కన్నా జెమినిరాయ్ గార్కి సాధారణ ప్రజలమీద నమ్మకం ఎక్కువ. ఒకసారి మన తొలి ప్రధానమంత్రి శ్రీ జవహర్ లాల్ నెహ్రూగారి నుండి అవార్డు తీసుకోవడానికి ఢిల్లీకి ఆహ్వానించగా దానిని తిరస్కరించారు. కాని ఆయన కుమార్తె ఇందిరాగాంధీగారు 1972వ సంవత్సరం ఆయన చనిపోయిన తర్వాత జెమినిరాయ్ గార్ని “జాతీయ చిత్రకారుడిగా” (National Artist) గుర్తించి కలకత్తాలోని ఆయన గృహంలో కొంత భాగాన్ని ఆయన చిత్రాలతో ఆర్ట్ గ్యాలరీగా తీర్చిదిద్దారు.
ఒక ముఖ్య సంఘటన:
బాగ్ బజార్ లో ఉన్న 1943వ సంవత్సరంలో, ఆయన స్వంత ఇంటిలో జరిగిన చిత్ర ప్రదర్శనకు వచ్చిన ఏడుగురు విదేశీయులందరికి ఒకే ఒక పెయింటింగ్ నచ్చి దాన్ని అందరూ కొనాలనుకొన్నారు. ఈ సమస్య ఎలా పరిష్కరించాలనుకొంటుండగా వాళ్ళను కొన్ని దినాలు ఆగమని చెప్పి ఏడు చిత్రాలు అదే సబ్జెక్టుతో కొన్ని చిన్న చిన్న మార్పులతో చిత్రించి ఇచ్చి సమస్యను పరిష్కరించారని వాళ్ళ పెద్ద అబ్బాయి మోనిరాయ్ తన తండ్రితో ఉన్న పాత జ్ఞాపకాల్ని పంచుకొన్నారు.
ఖాళీ ఘాట్ చిత్రకళ
19వ శతాబ్దికి చెందిన ఈ చిత్రకళ కలకత్తాలోని ఖాళీ ఘాట్ కాళీ మందిర సమీపాన అభివృద్ధి చెందింది. ఈ చిత్రకళలో ఎక్కువగ భారతీయ దేవతామూర్తులు, ఇతిహాసక ఘట్టాలతో మరియు దైనందిన జీవితంలో ఎదురయ్యే మనుష్యుల చిత్రాలతో చిత్రించబడేవి. వీటిని ఎక్కువగా విదేశీయులు తమ స్నేహితులకు బహుమతులుగ కొనుగోలు చేసి తీసుకొని వెళ్ళేవారు.

ఉదయ్ శంకర్ చల్లా

Jamini Roy art
SA: