జమున ఈ పేరు వినగానే గోదారిగట్టుంది..గట్టు మీన చెట్టుంది..చెట్టు మీద పిట్టంది..అనేపాట గుర్తొస్తుంది చాలామందికి.. ఒకప్పుడు తెలుగుసినిమా ప్రేక్షకులను తన అందం… నటనాకౌశల్యంతో ఉర్రూతలూగించిన మహానటి జమునగారు..1936 ఆగష్టు 30 గురజాలలో శ్రీనివాసరావు , కౌసల్య దంపతులకు జన్మించిన జమునగారు చిన్నతనం నుండే చాలా హుషారుగా ఉండేవారు. వాళ్ళమ్మ గారికి కళలపట్ల మమకారం వుండటంతో ఆమెకు సంగీతం, నాట్యం నేర్పించారు. జమునగారు సినీరంగప్రవేశానికి కారణం మరో మహానటి సావిత్రిగారు.
నాటకప్రదర్శన నిమిత్తం సావిత్రిగారు జమునగారి ఇంట్లో వుండవలసివచ్చింది.అప్పుడు జమునగారి అందానికి, గాత్రానికి ముగ్ఢురాలైన సావిత్రి తన నాటకకంపెనీలో నటించమని అవకాశం ఇచ్చింది. 1952 లో పుట్టినిల్లు చిత్రంలో హీరోయిన్ గా అవకాశం ఇప్పించింది. ఇదే జమునగారి మొదటిసినిమా,అల్లురామలింగయ్యకూడా ఇదే సినిమాతో అరంగేట్రం చేశారు. అప్పటి నుండి నాలుగు దశాబ్ధాలు సినీరంగంలో విభన్నమైన పాత్రలతో అలరించింది. మిస్సమ్మ, మంచిమనుసులు,గుళేబకావళికధ,గుండమ్మకథ,పట్నాటియుద్దం,బొబ్బిలియుద్దం, మంగమ్మ శపథం,తేనెమనసులు,కలెక్టర్ జానికి లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది.ఇవన్నీ ఒక ఎత్తైతే శ్రీకృష్ణసత్యలో సత్యభామగా ఆమె నటన యన్ టి ఆర్ నే మురిపించింది.సత్యభామంటే జమునాయే అనుకొనేవారు. అయితే జమునగారికి ఆత్మాభిమానము, ఆత్మగౌరము, ఆత్మవిశ్వాసము ఎక్కువ. పట్టుదలకూడా ఎక్కువే. ఏవో కారణాలవలన యన్ టి ఆర్ ,ఎ యన్ ఆర్ లు ఆమెతో నటించమని బహిష్కరిస్తే ధైర్యంగా సినీ పరిశ్రమలో నిలదోక్కుకుంది.
పెద్ద హీరోల బహిష్కరణకారణంగా హరనాధ్ , కృష్ణ,శోభన్ బాబు లాంటి హీరోలు ఈమే మూలంగా వెలుగులోకి రావడానికి కారణమైంది. లేతమనసులు,కలెక్టర్ జానికి లాంటి సినిమాలు అప్పుడే వచ్చాయి. సినీకళాకారుల సంఘం స్థాపించి సేవచేసింది.
ఏదేమైనా జమనగారు ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. అది అహంకారమనే ప్రచారం కూడా జరిగింది.అహంకార,గడుసరి,అల్లరి పాత్రలకు జమున జీవంపోసింది. హిందీలో నటించిన సినిమాలుకూడా సూపర్ హిట్ అయినాయి. తెలుగుసినీ పరిశ్రమకు మంచిగుర్తింపుతెచ్చిన జమునకి 84 వ జన్మదిన శుభాకాంక్షలు..