ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ‘హిప్పీ’ ఫేమ్ దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా సుజి విజువల్స్ బ్యానర్ పై , మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో నిర్మాత కే. వెంకటరమణ నిర్మిస్తున్న చిత్రం ప్రారంభోత్సవం గత వారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.
ప్రారంభ వేడుకకు ప్రముఖ దర్శకులు వీవీ వినాయక్, నిర్మాత లగడపాటి శ్రీధర్, ప్రముఖ నటుడు నాగబాబు, యాంకర్ ప్రదీప్ హాజరయ్యారు. తొలి షాటు దర్శకత్వం వహించిన వీవీ వినాయక్ క్లాప్ కొట్టారు. నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ:
జానీ మాస్టర్ డెఫినెట్ గా వండర్ ఫుల్ యాక్టర్ అవుతారు. ఎంటర్ టైనింగ్ హీరోగా అవుతారనే నమ్మకం బలంగా కలిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే చాలా ఇన్నోవేటివ్ గా ఉన్నాయి. వాటితో దర్శకుడు అభిరుచి ఏమిటో తెలిసింది. త్వరలోనే జానీ మాస్టర్తో స్టైల్ 2 సినిమా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నాం. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయనతో మున్ముందు అసోసియేట్ కావాలనుకొంటున్నాను. ఈ చిత్రంలో నటిస్తున్న దిగంగనకు, యూనిట్‌కు బెస్ట్ విషెస్” అని అన్నారు.
హీరో జానీ మాస్టర్ మాట్లాడుతూ:
“నేను హీరోగా పరిచయం అవుతున్న సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన దర్శకులు వీవీ వినాయక్ గారికి, నిర్మాత లగడపాటి శ్రీధర్, నాగబాబు గారికి, యాంకర్ ప్రదీప్ కు ధన్యవాదాలు. నాకు కొరియోగ్రఫి అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కూడా శివకార్తికేయన్ నటించే సినిమాలోని పాటకు కొరియోగ్రఫి చేస్తున్నాను. ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణాలు చెప్పలేను. నాకు కొరియోగ్రఫి, డైరెక్షన్ అంటే ఇష్టం. దర్శకుడికి అదే విషయాన్ని చెప్పాను. యాక్టింగ్ అంతగా ఇష్టం లేదని చెప్పాను. కానీ దర్శకుడు చెప్పిన కథ విన్న తర్వాత తప్పకుండా చేయాలని డిసైడ్ అయ్యాను. నాకు షూటింగ్ లేనప్పుడు టీవీ షూటింగ్ కు వెళ్తాను. ఇప్పుడు కొరియోగ్రఫి విషయంలో విరామం దొరికితే సినిమా షూటింగుకు వెళ్తాను. నీవు చేయకపోతే సినిమా చేయనని నిర్మాత వెంకటరమణ చెప్పడంతో మరింత కనెక్ట్ అయ్యాను. నా పక్కన నటించడానికి ముందుకొచ్చిన దిగంగనకు థ్యాంక్స్” అని అన్నారు.
నాగబాబు మాట్లాడుతూ:
జానీ మాస్టర్ మా అందరికీ, ముఖ్యంగా మా మెగా ఫామిలీ కి చాలా ఆత్మీయుడు. చాలా టాలెంటెడ్ కొరియోగ్రాఫర్, అద్భుతమైన దర్శకత్వ ప్రతిభ ఉన్న వ్యక్తి. తను వచ్చి హీరోగా సినిమా చేస్తున్నాను అని చెప్పగానే సరైన నిర్ణయమే తీసుకున్నాడు అనిపించింది. ఎందుకంటే మన కళ్ళ ముందే డాన్స్ మాస్టర్లు లారెన్స్, ప్రభుదేవాలు హీరోలుగా మారి మంచి సక్సెస్ ని కూడా అందుకున్నారు. అద్భుతమైన డాన్స్ ప్రతిభ అలాగే అందం ఉన్నవాడు జానీ, ఇలాంటి మంచి కథ తో హీరోగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటాడని నేను నమ్ముతున్నాను. కానీ ఎంత పెద్ద హీరో అయినా, ఎంత మంచి సక్సెస్ వచ్చినా కొరియోగ్రఫీ మాత్రం వదలద్దని మాత్రం జానీ కి నా వ్యక్తిగత కోరిక, సలహా. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
సాంకేతిక నిపుణులు:
నిర్మాత: వెంకటరమణ కే
దర్శకత్వం: మురళిరాజ్ తియ్యాన
సినిమాటోగ్రాఫర్: శ్యామ్ కే నాయుడు
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీత దర్శకుడు: రధాన్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రాంతేజ్ చిట్టిబొమ్మ
ఆర్ట్: డైరెకట్ర్: పీవీ రాజు
డైలాగ్స్: యశోద గౌరీ శంకర్
పీఆర్‌వో: పులగం చిన్నారయణ
డిజిటల్ పబ్లిసిటి: సుధీర్ తెలప్రోలు
బ్యానర్: సుజి విజువల్స్