జోరుమీదున్న – జాతి రత్నాలు

నవ్వించడం అంత వీజీ కాదు. నవ్వించడంకోసం చేసే ప్రయత్నాల్లో లాజిక్కులు వెదకనవసరం లేదు. కమెడియన్ చొక్కా చించుకున్నా, రకరకాల విన్యాసాలు చేసినా అవన్నీ నవ్వించడం కోసమే తప్ప. లాజిట్లు వెదుక్కునేవాళ్ళకోసం కాదు.
ఇదంతా ఎందుకు చెప్పడం అంటే ఈ వారం విడుదలైన జాతిరత్నాలు సినిమా అలాంటి వ్యవహారమే. లాజిట్లు అన్నవి కనిపించవు. కానీ కామెడీ మ్యాజిక్ మాత్రం చేసేస్తుంది. స్క్రిప్ట్ చూస్తే సాదా సీదాగా అనిపిస్తుంది. కానీ రెండుగంటలకు పైగా సీట్లో కూర్చోపెడుతుంది. ముగ్గురూ బేవారగాళ్ళ కథ అన్నందుకు ఆ రేంజ్లోనే వుంటుంది, ఆ స్థాయిలోనే నడుస్తుంది. ఇంతకీ నవ్వుల సినిమా కథేంటీ అంటే నవీన్- రాహుల్ రామకృష్ణ-ప్రియదర్శి నేస్తాలు. జోగిపేట అనే చిన్న టౌన్లో ఈ ముగ్గురూ పనీ పాటా లేకుండా తిరుగుతుంటారు. జనాలు వీళ్ళకు వన్ గ్రామ కూడా విలువ ఇవ్వరు.

ఇలాంటి టైమ్ లో ముగ్గురు కలిసి ఏదైనా ఉద్యోగాలు వెదుక్కుని ప్రయోజకులు కావాలని టౌను వచ్చేస్తారు. ఓ ఫ్రెండ్ను పట్టుకుని, వాడి వీకొనెస్ పాయింట్ పట్టుకుని, ఓ మాంచి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరియస్ ప్లాట్లో సెటిలైపోతారు. పక్క ఫ్లాలోని చిట్టి (ఫరియా)ను నవీన్ ప్రేమించేస్తాడు కూడా. కానీ వాళ్ళలక్ రివర్స్ కొడుతుంది. అదే ఫ్లాఫ్లో వుండే ఎమ్మెల్యే కప్ కాబోయే మినిస్టర్ (మురళీ శర్మ) మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది.
ఆ నేరం ఈ ముగ్గురి మీదా పడుతుంది. అప్పుడేం జరిగిం దన్నది మిగిలిన సినిమా.
నవీస్ పోలిశెట్టి ఇప్పటికే యూ ట్యూబ్లో తన స్టాండింగ్ కామె డీతో, అలాగే ఏజెంట్తోత్రేయతో ప్రేక్షకులకు బాగా దగ్గరయి పోయాడు. అతనికి తన కంటూ ఓ ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ ఉంది.

చటుక్కున మాట విసిరి నవ్వులు పుట్టించగల సత్తా వుంది. ‘జాతిరత్నాలు’ దాదాపుగా తొంభైశాతం ఈ వ్యవహారంమీదే బేస్ అయిపోయింది. ఈ కారణాలతోనే నడచిపోయింది. మరే హీరో అయినా ఈ సబ్జెక్ట్ టేకప్ చేస్తే డమాలనిపోయేది. నవీన్ వన్లై నర్లు. వన్ మాన్ షో థియేటర్లో జనాలతో నవ్విస్తూనే ముందుకు సాగాయి.
సినిమా తొలిసగం ఈ నవ్వులతోనే, పెద్దగా కథ లేకుండానే సాగిపోతుంది. ద్వితీయార్ధంలో అసలు పాయింట్, ట్విస్ట్ లోకి ప్రవేశించినా అదే తరహా నవ్వులు పండించడానికి సదా ప్రయత్నించారు. అందుకోసం కథను మరీ పెద్దగా రాసుకోకుండా, సీన్లు మాత్రమే రాసుకుని జాగ్రత్త పడ్డారు.

మరీ సీన్లు తక్కువ కావడం అన్నది ఒక్కోసారి కాస్త గుర్తు వస్తూనే వున్నా, ఈ ఫన్ లైనర్ల కామెడీ ఆ గుర్తును చెరిపేస్తూ వుంటుంది. దాంతో ప్రేక్షకుడు ఈ సినిమా స్టెల్ ఇంతే. ఇలా ఎంజాయ్ చేసేయడమే అని ఫిక్స్ అయిపోతాడు. సీరియస్ క్రైమ్ కు సంబంధించిన కోర్టు ట్రయిల్‌ను కూడా కామెడీ చేసేశారంటే, సినిమాలో మ్యాజిక్ మీద తప్ప లాజిక్ మీద దర్శకుడు ఆనంద్ అస్సలు దృష్టి పెట్టలేదని క్లారిటీ వచ్చేస్తుంది.
అయితే ఇక్కడే మరో సమస్య కూడా వుంది. నవీన్ మాడ్యులేషను, వన్ లైనర్లను ఎవరైతే ఫాలో కాలేకపోతారో వారికి ఈ సినిమా బోర్ కొట్టేస్తుంది ఏముంది? ఇందులో అంతలా నవ్వుతున్నారు అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఐతే సోషల్ మీడి యాలో స్టాండింగ్ కామెడీ లను బాగానే పరిచయం చేసుకున్నారు మన జనం. అందువల్ల ఫాలో కాలేని వారి సంఖ్య కాస్త తక్కువే వుంటుంది.. సినిమాలో కీలక నటులైన నవీన్, దర్శి, రాహుల్, హీరోయిన్ ఫరియా పెర్ ఫెక్ట్ ఫిట్ అనిపించుకున్నారు. వారిలో ఏ ఒక్కరిని రీప్లేస్ చేసినా కష్టమే అన్నట్లు సెట్ అయ్యారు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్, చిట్టి… నా బంగరు చిట్టి పాట బాగా ప్లస్ అయ్యాయి. ప్రొడక్షన్ వీలైనంత లోబడ్జెట్ లో తీసేయాలని డిసైడ్ అయినట్లు సినిమా చూస్తేనే తెలిసిపోతుంది.

మొత్తంమీద ప్రీ సమ్మర్ టైమ్ లో వచ్చిన మాంచి ఫన్ ఎంటర్టైనర్ గా నిలుస్తుంది. ‘జాతిరత్నాలు’. మహానటిలో మాంచి దర్శకుడు అనిపించుకున్న నాగ్ అశ్విన్ తాను నిర్మాతగా మారి కొత్త దర్శకుడు ఆనంలో ఎందుకు సినిమా చేశారన్నది చూసిన తరువాత అర్థమవుతుంది. కామెడీ టైమింగ్, దానికి తగిన కథ చూసే నాగ్ అశ్విన్ మూడు కోట్లలో సినిమా తీసేసి, జాక్పాట్ కొట్టేశారు.

ప్లస్ పాయింట్స్… నవీస్ పోలిశెట్టి, వన్ లైనర్లు, చిట్టి పాట
మైనస్ పాయింట్స్… పెద్దగా కథ, లాజిట్లు లేకపోవడం
పంఛ్ లైన్ …. మెరిసిన రత్నాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap