జయహో NTR పోట్రయిట్ పోటీలు

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, కళాప్రపూర్ణ బిరుదాంకితులు కీ.శే. డా. నందమూరి తారక రామారావుగారి శతజయంతోత్సవాల సందర్భంగా జయహో NTR పోట్రయిట్ పోటీలు క్రియేటివ్ హార్ట్స్ అకాడమి ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ నిర్వహిస్తుంది. ఏవిధమైన ఎంట్రీ ఫీజు లేదు.

పాల్గొనదలచిన చిత్రకారులు కీ.శే. డా. నందమూరి తారక రామారావుగారి ముఖచిత్రం (నీటి రంగులతో) ఆ3 లేదా ఆ4 పేపర్ సైజు చిత్రించాలి. పోట్రయిట్ సినిమా / రాజకీయ రంగాలలో ఏది అయినా వేయొచ్చు. అయితే నీటి రంగులతో మాత్రమే చిత్రించాలి.
అర్హత: 20 సం. వయసు పైబడిన వారు మాత్రమే.
ఒకొక్కరు ఒకటి లేదా రెండు చిత్రాలు పంపవచ్చును. పాల్గొనదలచిన చిత్రకారులు ది. 10.06.2023 లోపు 998925790 కి కాల్ చేసి తమ పేరు ముందుగా నమోదు చేసుకోవాలి.
మీ చిత్రాలు అందవలసిన చివరి తేది: 20.06.2023.

బహుమతులు:
1.’ఎన్.టి.ఆర్. శత జయంతి పురష్కారం‘ తో పాటు, రూ. 1500 నగదు. (మెమెంటో మరియు ప్రశంసాపత్రము).

2.’ఎన్.టి.ఆర్. శత జయంతి పురష్కారం’ తో పాటు, రూ. 1000 నగదు. (మెమెంటో మరియు ప్రశంసాపత్రము).
3.’ఎన్.టి.ఆర్. శత జయంతి పురష్కారం‘ తో పాటు, రూ. 500 నగదు. (మెమెంటో మరియు ప్రశంసాపత్రము).

-ఎన్.టి.ఆర్. గోల్డెన్ బ్రష్ అవార్డులు – 10 (మెమెంటో మరియు ప్రశంసాపత్రము).

-ఎన్.టి.ఆర్. గ్రేట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డులు – 10 మెమెంటో మరియు ప్రశంసాపత్రము).

-ఎన్.టి.ఆర్. బెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డులు – 10 (మెమెంటో మరియు ప్రశంసాపత్రము).
పార్టిస్పేట్ చేసిన మిగిలిన చిత్రకారులందరికీ ప్రశంసా పత్రాలు బహుకరించబడును.

ఎంట్రీలు పంపాల్సిన చిరునామా:

(కేవలం పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా మాత్రమే పంపాలి)
Akondi Anji, Founder President: Creative Hearts, Katrenikona, BRA Konaseema Dist., A.P., PIN: 533212, Mobile: 9989325790.
(వివాదాలకు తావు లేదు. న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. గడువు తేదీ తరువాత అందిన చిత్రాలు పోటీకి స్వీకరించబడవు.)
బహుమతులు పొందిన చిత్రాలతో ఈ-బుక్ (PDF) రూపొందించబడును.

Jayaho NTR Portraits Contest

1 thought on “జయహో NTR పోట్రయిట్ పోటీలు

  1. చాలా చాలా ధన్యవాదములు సాగర్ గారు… మీ సహకారం మరువలేనిది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap