జయప్రకాష్ రెడ్డి హీరోగా అలెగ్జాండర్ సినిమా
ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి హీరోగా రూపొందుతున్న చిత్రం అలెగ్జాండర్. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో విలక్షణమైన పాత్రలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఈయన హీరోగా అలెగ్జాండర్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు ధవళ సత్యం. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో ఆయన ఒక్కరే నటిస్తుండటం విశేషం. అలెగ్జాండర్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు నిర్మాతలు. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
రాయలసీమ యాసలో జయప్రకాశ్ రెడ్డి చెప్పే సంభాషణలు ప్రసిద్ధి. ఈయన ఎక్కువగా ప్రతినాయక మరియు హాస్య పాత్రలను పోషిస్తుంటాడు. ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి ప్రముఖ నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అలా ఈయన 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు.కానీ 1997 లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ‘ అలెగ్జాండర్ ‘ పేరుతో తను ఒక్కడే పాత్రదారిగా నాటకాన్ని గత కొన్నేళ్ళుగా అనేక ప్రదర్శనలు ఇచ్చి ప్రేక్షకుల మెప్పు పొందారు.