అలరించిన “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శన

  • 20 మంది చిత్రాలతో “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శన
  • ఆర్టిస్ట్ మధు ‘వాటర్ కలర్’ పెయింటింగ్ లైవ్ డెమో

అంతర్జాలం ఆవిష్కరణతో ప్రపంచమే ఒక కుగ్రామం అయిపోయింది. “ఫేస్ బుక్” వేదికగా చిత్రకళ కోసం, చిత్రకారుల కోసం ప్రముఖ చిత్రకారుడు శేషబ్రహ్మం ప్రారంభించిన “కళాయజ్ఞ” చిత్రాలతో హైదరాబాద్ వేదికగా ఎన్నో విశేషాలతో… అశేష జన ప్రమోదం పొంది… ఇప్పుడు విజయవాడలో ‘ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్’ ఆధ్వర్యంలో బాలోత్సవ్ భవన్ లో విజయవంతంగా ఈ ‘కళాయజ్ఞ-జీవన రేఖలు’ ప్రదర్శన విజయవంతంగా జరిగింది.

ఈ “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శనను ఆదివారం(16-7-23) ఉదయం AP MEME ఇండస్ట్రీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు గారు లాంఛనంగా ప్రారంబించారు. ఈ సందర్భంగా చిత్రకారులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కళాకారులకు ప్రభుత్వ పరంగా తగిన ప్రోత్సాహం లబిస్తే సామాజిక అంశాలపై మరిన్ని కార్యక్రమాలను నిర్వహించి‌ ప్రజలను చైతన్య పరచొచ్చన్నారు. అనంతరం ప్రముఖ చిత్రకారులు శేషబ్రహ్మం మాట్లాడుతూ చిత్రకారులకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు ఆర్థికంగా ఎదగటానికి ఎంతో దోహదం పడుతుందని తద్వారా సమాజాన్ని ఉత్తేజపరిచే చిత్రాలతో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించొచన్నారు. అనంతరం మాకినేని బసవపున్నయ్య విజ్జాన కేంద్రం సభ్యులు పిన్నమనేని మురళీ కృష్ణ, పోలవరపు సాంస్కృతిక సమితి నాయకులు గోళ్ళ నారాయణ రావు ప్రముఖ కార్టూనిస్ట్ టి.వెంకట్రావులు ప్రదర్శనుద్దేశించి మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో భాగంగా నేటి తరం చిన్నారులు మరియు యువ చిత్రకారులకు నీటివర్ణ చిత్రాలు గీయటంపై అవగాహన కల్పించేందుకు ఏలూరు కి చెందిన ప్రముఖ చిత్రకారుడు మధుసూదనరావు తో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైవ్ డిమాన్ట్రేషన్ కార్యక్రమం LED ప్రొజెక్షన్ తో కనుల పండుగగా జరిగి ఆహూతులను అలరించింది.

సాయంత్రం జరిగిన బహుమతీ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ “కళాయజ్ఞ-జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శన లో పాల్గొన్న కళాకారులకి అతిథుల చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందించారు. ఈ “జీవన రేఖలు” చిత్రకళా ప్రదర్శనలో సునీల్ కుమార్, గిరిధర్, శేఖర్, అమీర్ జాన్, అంజి ఆకొండి, బి. శ్రీనివాసరావు, ఎం. రాంబాబు, కె.వి. శివ కుమార్, రాజు కందిపల్లి , రేష్మా ప్రసాద్, తిమ్మిరి రవీంద్ర, శేషయ్య, వెంకట్ తిరుమలశెట్టి, యామిని బిరుదు, శ్రీలక్ష్మి చెరువు, మల్లాది బాలక్రిష్ణ. అంజి దర్మాడి, లక్ష్మి సువర్చల, ఉదయ్ శంకర్ చల్లా తదితరులు పాల్గొన్నారు.

“ఫోరం ఫర్ ఆర్టిస్ట్స్” సంస్థ తరుపున సునీల్ కుమార్ అనుమకొండ, గిరిధర్ అరసవల్లి, కళాసాగర్, స్ఫూర్తి శ్రీనివాస్, రమేష్, స్వాతి పూర్ణిమ, సుధారాణి కార్యక్రమాన్ని పర్యవేక్షించగా భారీ సంఖ్యలో కళాకారులు, కళాభిమానులు, యువ చిత్రకారులు పాల్గొన్నారు. త్వరలో “కళాయజ్ఞ- జీవన రేఖలు” ప్రదర్శన విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

స్ఫూర్తి శ్రీనివాస్

SA:

View Comments (2)