శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త అధ్వర్యంలో ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు
సమాజంలో నాలుగో స్తంభం లాంటి జర్నలిస్టులు ఒక దిక్సూచిలా శ్రమిస్తుంటారని, త్యాగాలు మినహా ఆర్ధిక సంపాదన ఉండదని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. జర్నలిజం వృత్తి అంటే కత్తి మీద సాము చేయడమేనని ఆయన అభివర్ణించారు.
బుధవారం(20-04-22న) హైదరాబాద్, రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్, తిరుమల బ్యాంక్ సంయుక్త అధ్వర్యంలో ఉగాది వేడుకలు, ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలు, విశిష్ట సేవా సామ్రాట్ పురస్కారాల ప్రదానోత్సవం కనుల పండువగా జరిగింది.
ముఖ్య అతిధిగా విచ్చేసిన జస్టిస్ జి. చంద్రయ్య మాట్లాడుతూ జర్నలిజం వ్యాపారమయం అనడం భావ్యం కాదని, ఇంకా విలువలు విశ్వసనీయత ఉన్నాయని అభినందించారు. తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూధనరి మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
తిరుమల బ్యాంక్ చైర్మన్ ఎన్.చంద్రశేఖర్ అధ్యక్షత వహించిన ఈ సభ లో అవార్డ్స్ ఎంపిక కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ, సరస్వతీ ఉపాసకులు దైవజ్ఞ శర్మ, పారిశ్రామిక వేత్త నీరజ్ లఖోటియా తదితరులు పాల్గొన్నారు.
శృతిలయ – సీల్ వెల్ జీవన సాఫల్య పురస్కారం తో దూరదర్శన్ ఆలిండియా రేడియో పూర్వ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి ఎం.శైలజ సుమన్ ను ఘనంగా సన్మానించారు. ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారాలను టివి9 సీనియర్ కరెస్పాండంట్ శ్రీ యార్లగడ్డ రవిచంద్ర, తెలుగు వన్ డాట్ కామ్ ఎడిటర్ బుద్ధి యజ్ఞమూర్తి, సుమన్ టివి ఎంటర్టైన్మెంట్ హెడ్ అంజాద్ బాబు, సివిఆర్ ఛానల్ హెడ్ శ్రీమతి రూపవాణి కోనేరు, ఆంధ్రజ్యోతి సిటీ బ్యూరో చీఫ్ శ్రీ చామర్తి మురళీధర్, సాక్షి చీఫ్ రిపోర్టర్ శ్రీమతి నిర్మల రెడ్డి, ఆసియా నెట్ తెలుగు న్యూస్ సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీమతి సుమబాల, ఎన్ టివి సీనియర్ న్యూస్ ప్రెజెంటెర్ శ్రీమతి దేవి, టీవి 5 హెల్త్ కరెస్పాండెంట్ యాంకర్ శ్రీమతి సిద్ధం మాధవి, నవ తెలంగాణ సీనియర్ ఫోటో జర్నలిస్ట్ కె.ఎన్. హరి స్వీకరించారు.
విశిష్ట సేవా సామ్రాట్ పురస్కారాలను డాక్టర్ సర్దార్ హర్విందర్ సింగ్, తెలంగాణ శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షులు రామకృష్ణ, న్యాయవాది కె. ఆనంద్ రాజు అందుకున్నారు.
ఆమని పాడవే కోయిల శీర్షికతో శ్రీమతి ఆమని ఆధ్వర్యంలో సీల్ వెల్ సినీ సుస్వరాలు సంగీత విభావరి ఉర్రూతలూగించింది. సుభాష్, శ్రీమతి గాయత్రి, శ్రీమతి లక్ష్మీ భారతి, జి. శ్రీనివాస్ ఆయా పాటలు ఆలపించి కరతాళ ధ్వనులు అందుకున్నారు.