జర్నలిస్టుల అభ్యున్నతే ధ్యేయంగా పెన్ జర్నలిస్ట్స్ సంఘం కృషి చేస్తుందని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ అన్నారు. మంగళవారం అవనిగడ్డ ప్రెస్ క్లబ్ లో “పెన్ ” అవనిగడ్డ నియోజకవర్గ అధ్యక్షులు అప్పికట్ల శ్రీనివాస్ అధ్యక్షతన నియోజకవర్గ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పెన్ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు “పెన్” కట్టుబడివుందన్నారు. జర్నలిస్టులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా సంఘం దృష్టికి తెస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పెన్ రాష్ట్ర సంఘ ఉపాధ్యక్షులు సింహాద్రి కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టులకు పింఛను పథకం అమలుచేయాలని సంఘపరంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల అక్క్రిడిటేషన్ల విషయంలో ఇకముందు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నట్లు సమాచార శాఖ కమీషనర్ విజయకుమార్ రెడ్డి హామిఇచ్చారన్నారు. ఐకమత్యంతో ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలం అన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి సామర్ల మల్లికార్జున రావు మాట్లాతూ అక్టోబర్ 4 న అవనిగడ్డ లో “పెన్” జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కరోనా వారియర్స్ ను సత్కరించనున్నట్లు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బండ్రెడ్డి కిషోర్ కుమార్, లేబాక నాగేశ్వర రావు, రేపల్లె యువరాజ్, వక్కలంక రామకృష్ణ, ఉప్పాల సుబ్బారావు, జీ. సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.