పాత్రికేయుల బాధ్యత పెద్దదే!

మీడియా వ్యాపార ధోరణి లోకి మారిపోయిందని, అన్ని రంగాల్లో మంచి చెడు వున్నట్లే మీడియాలోను మంచి జర్నలిస్టులు ఉన్నారని తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు. సమాజంలో జర్నలిస్టుల బాధ్యత చాలా పెద్దదని, వ్యవస్థను కాపాడటంలో మీడియాదే కీలకపాత్ర అని ఆయన స్పష్టం చేశారు. తాను వార్డ్ మెంబర్ నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీడియా సహకారం మరచిపోలేనని కొనియాడారు.

బుధవారం రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, సీల్ వెల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్కినేని నాగేశ్వరరావుగారి 99వ జయంతి వేడుకలు… అక్కినేని – శృతిలయ – సీల్ వెల్ మీడియా అవార్డ్స్ ప్రధానోత్సవం కనుల పండువగా జరిగింది.
అక్కినేని జీవన సాఫల్య పురస్కారంతో సీనియర్ సినీ పాత్రికేయులు కొండపనేని ఉమామహేశ్వరరావును ఘనంగా సత్కరించారు.
ఉత్తమ న్యూస్ ప్రెజెంటర్స్ 2022 పురస్కారాలను దీప్తి వాజపేయి (Tv9), క్రాంతి (NTv), సంధ్యా భవాని (10Tv), కల్పన శివరాధ (hm tv) స్వీకరించారు.

ఉత్తమ పాత్రికేయ పురస్కారాలతో సాక్షి చీఫ్ సబ్ ఎడిటర్ డి.వి.ఆర్. భాస్కర్, Tv5 స్పెషల్ కరెస్పాండెంట్ దారా సత్యనారాయణ, ABN ఆంధ్రజ్యోతి సీనియర్ క్రైమ్ రిపోర్టర్ ఎన్. హేమలత, నవ తెలంగాణ సీనియర్ క్రైం రిపోర్టర్ ఇ. రత్నాకరరావు, V6 సీనియర్ రిపోర్టర్ హరిత పులి, TV 45 ప్రోగ్రామింగ్ హెడ్ వి. దేవినాగమణి, వాసవి కిరణాలు ఎడిటర్ ఎస్. త్రినాథరావులను సన్మానించారు.

ఈ వేడుకలో సీల్ వెల్ కార్పొరేషన్ సిఎండి బండారు సుబ్బారావు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, తెలంగాణ SC కార్పొరేషన్ చైర్మన్ బి. శ్రీనివాస్, అవార్డ్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహ్మద్ రఫీ, హైకోర్టు సీనియర్ అడ్వకేట్ డాక్టర్ ఎం.ఎ.రహీమ్, కుసుమ భోగరాజు, మద్దెల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీమతి ఆమని నేత్రుత్వంలో అక్కినేని సినీ సంగీత విభావరి వీనుల విందు చేసింది.

మహ్మద్ రఫీ

ఫోటోలు : శ్రీ గిరి

Awards
Journalists Awards
SA: