‘కారా’ స్మారక కథల పోటీ

యువ కథకులకు ఆహ్వానం ‘కారా’ స్మారక కథల పోటీ

గురజాడ ఫౌండేషన్ (అమెరికా) వారిచే ప్రచురింపబడుతున్న చారిత్రాత్మక అంతర్జాల తెలుగు పత్రిక ‘ప్రకాశిక’ నిర్వహిస్తున్న ‘కారా’ స్మారక కథల పోటీ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 18-40 సంవత్సరాల మధ్య వయసు గల తెలుగు వారినుంచి కథలు ఆహ్వానిస్తున్నాం.
మంచి కథ మంచి స్నేహితుడిలాంటిది. మంచి కథకుడు స్నేహవల్లరి లాంటి వాడు. కొంతమంది రచయితలు ఎన్ని కథలు రాసినా వాళ్ళ పేరు, గుర్తింపు ఒక రచనతో ముడిపడి ఉంటాయి. ‘యజ్ఞం’తో పేరుగాంచిన కాళీపట్నం రామారావు గారు “కారా మాస్టారు” గా, “కథా నిలయ” స్రష్ట గా, ద్రష్ట గా స్థిరపడ్డారు. ఒక రచన కోట్లాది పాఠకులని ఎలా పరవశం చేసి, ప్రభావితం చేయగలదో అన్న విషయానికి నిదర్శనం కారా గారు, ఆయన రచనలు. ఆయన స్ఫూర్తితో నవతరం “కథాకారుల” తయారీకి దోహదపడాలనే ఉద్దేశంతో ‘కారా’ స్మారక కథల పోటీని నిర్వహిస్తున్నాం .
ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన రచనలను ప్రకాశిక తొలి వార్షిక సంచిక (అక్టోబర్-డిసెంబర్) లో ప్రచురిస్తాము. మిగతా రచనలలో కొన్నిటిని రాబోయే సంచికలలో గానీ, అంతర్జాల సంచికలో గానీ ప్రచురిస్తాము.

బహుమతుల వివరాలు:
ప్రథమ బహుమతి : రూ. 2,500
ద్వితీయ బహుమతి : రూ. 1,500
తృతీయ బహుమతి : రూ.500

• మీ రచన మీద సర్వహక్కులూ మీవే. కానీ దయచేసి ఇంకెక్కడైనా పరిశీలనలో ఉన్న కథలు ఇది వరలో ప్రచురించబడిన రచనలు మరో రూపంలోనూ పంపించ వద్దు.
• మీ రచనతో పాటు అది స్వీయ రచన అనీ, దేనికీ అనుకరణ, అనుసరణ కాదని, మరే ఇతర సామాజిక మాధ్యమాలలోనూ, అంతర్జాల పత్రికలలోనూ ప్రచురితం కాలేదని, అలాగే పరిశీలనలో కూడా లేదని, 1840 సంవత్సరాల మధ్య వయసు గల వారని హామీ పత్రం విధిగా జతపరచాలి.
• మీ రచనలలో ఎవరినీ కించపరిచే వ్యాఖ్యలుగానీ, విమర్శలుగానీ ఉండకూడదు.
కేవలం యూనికోడ్ (గూగుల్, లేఖిని మొదలైన వెబ్ సైట్ లలో, గౌతమి మొదలైన ఫాంట్స్) లో టైపు చేసిన రచనలు మాత్రమే పరిశీలించబడతాయి. PDF, స్కాన్ చేసిన వ్రాత ప్రతులు, తదితర పద్ధతులలో వచ్చిన రచనలు పరిశీలించబడవు.
• మీ రచన పంపించే ముందు అచ్చుతప్పులు సరి చేసి పంపించండి. ఒకటికి పది సార్లు చదివి తప్పులు సవరించండి.
• కధల నిడివి సుమారు 600 పదాలకి మించరాదు.
• ఐదు వాక్యాలకు మించకుండా మీ వ్యక్తిగత, సాహిత్య పరమైన విశేషాలు, మీ ఫోటో తప్పక జతపరచాలి.
• బహుమతి పొందిన మరియు సాధారణ ప్రచురణకు ఎంపికైన కథలు ‘ప్రకాశిక’ అంతర్జాల పత్రికలో ప్రచురితమవుతాయి.
• కథల పోటీకి నిర్దేశించిన గడువును పొడిగించేందుకు కానీ, పరిశీలనకు వచ్చిన కథల అర్హతను బట్టి బహుమతుల్లో మార్పులు చేసేందుకు కానీ నిర్వాహకులకు అన్ని హక్కులు ఉన్నాయి.
• కథల ఎంపికలో తుది నిర్ణయం నిర్వాహకులదే. ప్రచురణకు ఎంపిక కాని కథలను తిప్పిపంపించడం సాధ్యం కాదు.
• ప్రచురణకి సంబంధించిన అన్ని విషయలలో సర్వ నిర్ణయాధికారాలు పత్రిక సంపాదకులవే.

మీ రచన పంపించవలసిన ఈ-చిరునామా: editor@prakasika.org. సబ్జెక్ట్ లైన్ లో ప్రకాశిక కారా స్మారక కథల పోటీ కోసం’ అని రాయండి.
కథలు పంపించడానికి చివరి రోజు : 15 ఆగస్టు 2021. అన్ని విషయాలలోనూ మమ్మల్ని సంప్రదించ వలసిన ఈ-చిరునామా editor@prakasika.org

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap