మేలి ఛాయా ‘చిత్ర ‘ కారిణి – రమా కల్యాణి

‘ఆర్కే చిత్రోగ్రఫీ’ స్టూడియో నడుపుతున్న  రమా కల్యాణి

బాల్యం ఒక స్వీట్ మెమరీ. ఆ కొంటె పనులు..
మొండి వైఖరి.. ఇప్పుడు భలే అనిపిస్తాయి. వాటన్నింటికీ ఫొటోలే ఆధారాలు. కానీ.. బాల్యాన్ని నెమరేసుకోవడానికి ఒక్క ఫొటో కూడా లేని వారూ ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు రమా కల్యాణి. తనలా ఏ ఒక్కరూ ఫొటోలు దిగకుండా ఉండొద్దనే.. లైఫ్ స్టయిల్ ఫొటోగ్రాఫర్ ప్రొఫెషన్ ను ఎంచుకున్నది. మగవాళ్లే ఎక్కువగా ఉండే ఫొటోగ్రఫీలో అత్యుత్తమంగా రాణిస్తూ.. ప్రపంచాన్ని చుట్టేస్తున్న రమా కల్యాణి లైఫ్ జర్నీ మీ కోసం ..

మాది హైదరాబాద్ లోని బోయినపల్లి. అర్బన్  లైఫ్ చూస్తూ పెరిగాను. మా మామయ్య ఒక రోజు ఇంటికి బంకమట్టిని తీసుకొచ్చారు. నేను ఇంతకుముందెప్పుడూ ఆ మట్టి చూడ లేదు. దాంతో ఒక బొమ్మ తయారు చేశాను. చాలా బాగొచ్చింది. అది చూసిన మామయ్య ఆశ్చర్యపోయారు. ‘ఇంత బాగా ఎలా చేశావ్? ఎక్కడైనా నేర్చుకున్నావా?’ అని అడిగారు. ‘అదేంలేదు మామయ్యా.. ఊహించుకుని తయారుచేశానంతే’ అన్నాను. ‘ఫైన్ ఆర్ట్స్ కోర్సు చేస్తే మంచి భవిష్యత్ ఉంటుంది’ అని నాతో ఎంట్రెన్స్ రాయించారు. మంచి ర్యాంకే వచ్చింది కానీ సీట్ రాలేదు. కొంత నిరు త్సాహ పడినా మళ్లీ ప్రయత్నిద్దాం అనుకు న్నాను. ఎలాగైనా బ్యా చ్ లర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేయాలన్నది నా సంకల్పం. అందుకే తర్వాత రెండేండ్లకు ఎంట్రెన్స్ రాశాను. ఈసారి కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ కూడా వచ్చింది. ఉస్మానియాలో ఉండేవే 35 సీట్లు. నాది 24వ ర్యాంకు.

చాలా ఆనందించాను. మామయ్య కూడా హ్యాపీ ఫీలయ్యాడు. – కానీ.. మళ్లీ నిరుత్సాహం. ర్యాంక్ కార్డు తప్ప నిసరిగా కౌన్సెలింగ్ కు తీసుకెళ్లాల్సి ఉండేది. ఏ ఒక్క సర్టిఫికెట్ లేకున్నా సీట్ రాదన్నమాట. అందుకే చాలా జాగ్రత్తగా అన్ని సర్టిఫికెట్స్ దాచిపెట్టాను. మాది జాయింట్ ఫ్యామిలీ. ముప్పయి మందికి పైగా అంతా కలిసే ఉంటాం.

కానీ ఎట్లా తీసుకున్నారో ఏమోగానీ మా ఇంట్లో పిల్లలు ఆ ర్యాంక్ కార్డును చింపే శారు. అతికించడానికి కూడా అవకాశం లేదు. ర్యాంక్ కార్డు లేకుండా వెరిఫికేషన్‌కు అటెండ్ అవ్వొచ్చా? అని చాలా రకాలుగా ప్రయ త్నించాను. తెలిసినవాళ్లను సంప్రదించాను. కానీ అప్పటికే కౌన్సెలింగ్ కూడా అయిపో యింది. ఇక ఈ చదువులు మనతో కాదు అనుకున్నాను. ఎడ్యుకేషన్ కంటే స్వయంగా నేర్చుకోవడం బెటర్ అనుకున్నాను. అలా ఫొటోగ్రఫీపై ఆసక్తి ఏర్పరచుకున్నాను.

ఫొటోగ్రఫీయే ఎందుకు? దాని వెనకాల ఓ కథ ఉంది. మా చిన్నప్పుడు నాన్న వ్యాపారం చేసేవారు. పరిస్థితుల కార ణంగా వ్యాపారంలో నష్టాలు వచ్చాయి.

ఇంకో వ్యాపారం మొదలుపెట్టినా అది కూడా సక్సెస్ కాలేదు. హైదరాబాదే అయినా.. చదువు కున్న కుటుంబమే అయినా ఆర్థిక పరిస్థితుల కార ణంగా అన్నీ సర్దుబాటు చేసుకునేవాళ్లం. ఒక రకంగా సర్దుకుపోవడం అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకున్నాం. అలా మాకంటూ చెప్పుకోవడా కి.. చూసుకోవడానికి.. గతంలోకి తొంగిచూడ టానికి ఒక్క ఫొటో కూడా లేదు. లేదు అనేకంటే ఫొటో దిగలేదు అని చెప్పాలి. చాలా బాధగా ఉండేది. చాలామంది తమ చిన్నప్పటి ఫొటోలు చూసి మురిసిపోతుంటారు. మాకు ఆ భాగ్యం లేదు కదా అనిపించి ఏడుపొచ్చేది. ఇది చూడటా నికి చిన్నదే కావచ్చు. కొంపలు మునిగిపోయే విష యమేమీ కాకపోవచ్చు. కానీ ఉంటే ఎంత బాగుండు? అనిపిస్తుంది కదా? ఇలాంటి పరిస్థితి ఇంకొకరు ఎదుర్కోవద్దు అని ఫొటోగ్రఫీని ఎంచు కున్నా. ఫొటోగ్రఫీ అంటే నాకు ఎలాగూ ఇష్టమే.

ఫొటోగ్రఫీ అంటే ఒక స్టూడియో ఉండాలి… ఇద్దరు, ముగ్గురు మనుషులు ఉండాలి కదా? అనిపించింది. హైదరాబాద్ లోని పెద్ద పెద్ద స్టూడి యోలు తిరిగి పరిశీలించాను. అవన్నీ చూశాకా.. నాకు ఒక్కటే అనిపించింది. ఇది చేయలేను. లైఫ్ స్టయిల్.. ట్రావెల్ ఫొటోగ్రఫీ చేయాలనుకున్నా. అదైతే ఫ్రీలాన్సగా చేయొచ్చు. ఒక బాస్ ఉండడు.. సార్ సార్ అని బతిమిలాడుకోవా ల్సిన పని ఉండదు. ఇష్టపడి పని చేసుకుంటూ పోవడమే అనిపించి లైఫ్ స్టయిల్ ఫొటోగ్రఫీని ఎంచుకున్నా. సిటీలైఫ్ ఫొటోలు తీయడం మొద లుపెట్టాను.

టర్నింగ్.. ఎర్నింగ్ : ఒకసారి అబిడ్స్ వెళ్లాను. కెమెరా ఒకచోట పెట్టి షాపింగ్ చేశాను. మళ్లీ వచ్చి చూస్తే కనిపించ లేదు. చాలా బాధపడ్డాను. చదువులో ఆటంకాలు వస్తే ఈ రంగాన్ని ఎంచుకున్నా. దీంట్లోనూ సమస్యలు తప్పటం లేదు కదా అనుకున్నా. ఆ బాధతో కొద్ది రోజులు ఇంట్లోనే ఉండిపోయాను. కెనడాలో మా సిస్టర్ ఉంటుంది. తనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. నా కోసం మా సిస్టర్ మంచి కెమెరా తీసుకున్నది. నేనే కెనడా వెళ్లాను. కెమెరా చాలా బాగుంది అని మురిసిపోతుండగానే అక్కడే రెండు మూడు ఈవెంట్స్ వచ్చాయి. మంచి అవకాశం అనిపించింది. అందులోనూ అమెరికాలో. ఇంకేం కావాలి అనిపించి ఆ రెండు ఈవెంట్స్ చేసిన. వాటి ద్వారా వచ్చిన డబ్బు చూసి పరేషాన్ అయ్యాను. సంతోషించాను కూడా. సంపాదనకు ఇదేదో బాగుంది కదా అనుకున్నా. టెక్నికల్ వర్క్ గురించి తెలుసుకున్నా. ఇండియా తిరిగొచ్చాను. బెంగళూరులో గూగుల్ వాళ్లు ఉద్యోగం ఇచ్చారు. మంచి జీతమే. అది కూడా గూగుల్ లో. బాగానే ఉంది.

కానీ నాకెందుకో ఒకరి దగ్గర కాకుండా సొంతంగా చేయాలని ఉండేది. అందుకే ఐదు నెలలు మాత్రమే చేసి వదిలేశాను. తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చి ‘ఆర్కే చిత్రోగ్రఫీ’ పేరుతో ఫ్రీలాన్స్ గా లైఫ్స్టయిల్.. ట్రావెల్ ఫొటో గ్రఫీ ప్రారంభించా. ఆర్ కే అంటే రమా కల్యాణి అన్నమాట. ఆసక్తి.. అభిరుచి ఉన్నాయి కాబట్టే ఫొటోగ్రఫీలో చాలా తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకున్నా. ప్రయాణించడం అంటే నాకు ఇష్టం. విభిన్నంగా ఆలోచిస్తుంటా కాబట్టే ఒక్కచోటే ఉండలేకపోయాను. ఇటీవల ట్రావెల్ ఫొటోగ్రఫీలో భాగంగా వయ నాడ్ వెళ్లాను. అక్కడి ఎత్తయిన కొండమీద నుంచి చూస్తే సుందర ప్రకృతి రమణీయంగా కనిపిస్తుం టుంది. దానిని కెమెరాలో బంధించి తర్వాత చూస్తే ఎంతో ముచ్చటేసింది. నేను తీసే ఫొటోలు లైవ్ లో చూసినట్లే ఉంటాయి. తర్వాత రాయగఢ్ కూడా వెళ్లాను. కోట నుంచి ట్రెక్కింగ్ చేస్తూ 1400 ఫీటకు వెళ్లాను. నడుస్తూనే అందమైన ఫొటోలను తీస్తుంటే కలిగిన ఆ కిక్కే వేరప్పా. ఫొటోగ్రఫీలో అమ్మాయిలు చాలా తక్కువ. నేను చేసిన ఏ ఈవెంట్ లోనూ ఇంకో ఉమన్ ఫొటోగ్రా ఫర్ ని చూడలేదు. ఇలాంటి ప్రొఫెషన్లో నేను ఉన్నందుకు చాలా హ్యాపీ.

ఎందుకొచ్చానా అనిపించింది: హైదరాబాద్ లో ఒక పెద్ద ఈవెంట్. కేటీఆర్ గారు ముఖ్య అతిథి. ఆయన వస్తున్నారు అనగానే కెమె రామెన్ ఎక్కడి వాళ్లు అక్కడ రెడీ యాక్షన్ అన్న ట్లుగా నిలబడ్డారు. నేను అందరికంటే ముందే కెమెరా పట్టుకొని స్టడీగా ఉన్నాను. కేటీఆర్ గారు కదలగానే వాళ్లంతా ఒక్కసారిగా ముందుకు కది లారు. నేనొక అమ్మాయిని నిలబడ్డాను అని కూడా చూడకుండా నన్ను తోసేశారు. తర్వాత అక్కడికి వచ్చిన కేటీఆర్ గారు.. ఆయనతో వచ్చిన మినిస్టర్స్ చూసి.. ‘ఏ బాబూ.. అమ్మాయి ఉందయా చూసు కోండి. ఆమె కూడా తీసుకోవాలి కదా? అలా తోసేస్తే ఎట్లా?’ అని వారించారు. ఈవెంట్ అయి పోయిన తర్వాత బాధ అనిపించింది. ‘ఏంటీ మనుషులు? అలా ఎగబడి ఎగబడీ తీయడం ఏంటీ?’ అనిపించింది. ‘ఎందుకొచ్చాగా బాబూ ఈ ఫీల్డ్ కి’ అని అనిపించిన సందర్భం ఇది ఒక్కటి మాత్రమే. మిగతావన్నీ హ్యాపీ మూమెంట్సే. సినీ.. పొలిటికల్ సెలబ్రిటీస్ నా ఫొటోగ్రఫీని ఇష్టపడ తారు. మంచి కాంప్లిమెంట్స్ కూడా ఇస్తుంటారు. మా ఇంట్లో వాళ్లు.. రిలేటివ్స్ కూడా నన్ను మెచ్చు కుంటారు. నా గురించి గొప్పగా చెప్తుంటారు.

ఫైనల్ గా చెప్పేదేంటంటే.. తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అది అమ్మాయి అయినా.. అబ్బాయి అయినా. నన్నే చూసుకోండి. ఒకప్పుడు కనీసం ఫొటో కూడా దిగలేని పరిస్థితి. ఇప్పుడు అంతకు రెట్టింపు ఉత్సాహాన్నిచ్చే

ఫొటోలు వేలల్లో తీస్తున్నాను. ఇప్పటికి అనేక దేశాలు తిరిగాను. వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటిం చాను. అక్కడి ప్రజల జీవన స్థితిగతులను.. ప్రకృతి సౌందర్యాన్ని నా కెమెరాల్లో బంధించాను. ప్రపంచమంతా చుట్టేసి ఆయా దేశాల్లోని ప్రజల లైఫ్ స్టయిల్ ను చిత్రీకరించాలి అనేది నా డ్రీమ్ ప్రాజెక్ట్. అంతకుముందు నేను తీసిన మంచి ఫొటోలతో పెద్ద ఎగ్జిబిషన్ పెట్టాలని ఉంది. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను కూడా. త్వరలో పెడతాను .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap