సేవారంగంలో ‘కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్’

విజయవాడ కేంద్రంగా ‘కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్’ తొలిడుగులు

‘కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్’ ఒక ప్రజాకేంద్రీకృత, మానవతావాద సేవా సంస్థ. సమాజంలో వెనుకబడిన, బలహీన వర్గాల అభ్యున్నతికి అంకితమై పనిచేస్తోంది. దూరదృష్టి గల నాయకత్వంతో డాక్టర్ విజయ్ రాజ్ మూడేళ్ళ క్రితం విజయవాడ కేంద్రంగా స్థాపించిన ఈ సంస్థ, సమాజ ఆధారిత కార్యక్రమాలు, స్థిరమైన అభివృద్ధి చర్యలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తుంది.

మానవతా భావనతో ముందుకు సాగే డాక్టర్ విజయ్ రాజ్, సామాజిక–ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి గౌరవం, సమానత్వం, అవకాశాలు అందే సమాజాన్ని కలగా చూశారు. ఆయన యొక్క అచంచల నిబద్ధతతో ఈ ఫౌండేషన్ విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం, సాధికారత మరియు పర్యావరణ పరిరక్షణ రంగాల్లో శాశ్వతమైన ప్రభావాన్ని చూపాలని ప్రయత్నిస్తుంది.

పేద మరియు అనాథ పిల్లలకు విద్యా సహాయం:
విద్యే అవకాశాల పునాది అని కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ నమ్ముతుంది. ఈ క్రమంలో సంస్థ:పుస్తకాలు, యూనిఫార్ములు, విద్యాసామగ్రి పంపిణీ, ట్యూషన్ సహాయం, అకడమిక్ మార్గనిర్దేశనం, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు వంటి సేవల ద్వారా పిల్లలు మంచి భవిష్యత్తు వైపు అడుగులు వేయడానికి ప్రోత్సహిస్తోంది.

ఆహార పంపిణీ కార్యక్రమాలు:
ఆకలిని నివారించి, అవసరంలో ఉన్నవారికి మద్దతుగా: పేదలు, నిరాశ్రయులు, వృద్ధులకు నిత్య ఆహార పంపిణీ పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో పోషకాహార భోజనాలు ఈ కార్యక్రమాలు ఆహార భద్రతను కల్పిస్తున్నాయి.

విపత్తు సహాయం & అత్యవసర సేవలు వరదలు, తుఫాన్లు, మహమ్మారులు వంటి విపత్తుల సమయంలో: తక్షణ సహాయ సామగ్రి పంపిణీ, అత్యవసర సేవలు, పునరావాసం & పునర్నిర్మాణ సహాయం అందిస్తూ బాధితులకు ఆశను అందిస్తోంది.
2024 లో విజయవాడ బుడమేరు వరద బాధితులకు సహయక చర్యలలో భాగంగా ‘కారుణ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్’ తరపున బియ్యం, దుప్పట్లు, కూరగాయలు, పాలు, పండ్లు, వాటర్ బాటిల్స్ అందజేసి నిర్వాసితులను ఆదుకున్నారు.

ఉచిత వైద్య & ఆరోగ్య శిబిరాలు:
ఆరోగ్య సేవలు అందుబాటులో ఉండటం జీవన నాణ్యతకు కీలకం. అందుకే సంస్థ: ఉచిత వైద్య పరీక్షలు & నిర్ధారణ శిబిరాలు,ఉచిత మందులు & ఫాలోఅప్ చికిత్స, నివారణాత్మక ఆరోగ్యం, పోషణ, తల్లి–శిశు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు వైద్య నిపుణులు, వాలంటీర్ల సహకారంతో సేవలందిస్తోంది.

యువత & మహిళా సాధికారత కార్యక్రమాలు:
స్థిరమైన అభివృద్ధికి సాధికారత కీలకం. అందుకే…. నైపుణ్యాభివృద్ధి శిక్షణలు, స్వయం ఉపాధి కార్యక్రమాలు, వ్యాపార మార్గనిర్దేశనం ద్వారా ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వావలంబనను పెంపొందిస్తోంది.

-కళాసాగర్

Share via
Copy link
Powered by Social Snap