గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయతగా, పత్రికా రంగంలో సీనియర్ న్యూస్ ఎడిటర్ గా, సినీ రంగంలోనూ తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. నూతన తరం తెలుగు కథకులలో మహమ్మద్ ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం. ఈ రోజు వారి 51వ పుట్టిన రోజు సందర్భంగా పరిచయ వ్యాసం…
మహమ్మద్ ఖదీర్ బాబు నెల్లూరు జిల్లా (ఆంధ్రప్రదేశ్) లోని కావలిపట్టణానికి చెందినవారు. జవహర్ భారతి కాలేజీలో బీ.ఎస్సీ. కంప్యూటర్ సైన్స్ చదివాడు. తల్లి దండ్రులు సర్తాజ్ బేగం, మహమ్మద్ కరీంసాహెబ్, చెందిన మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జన్మించారు. అయన హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో చాలా కాలం డెస్క్ లో పనిచేసి, సాక్షి ప్రారంభించినప్పటి నుండి సీనియర్ న్యూస్ ఎడిటర్ గా పనిచేసారు. నూతన తరం తెలుగు కథకులలో ఖదీర్ బాబు ది ప్రత్యేకమైన స్థానం.
గత పాతికేళ్ళుగా తెలుగు కథ రచయితగా మనల్ని అలరిస్తున్న ఖదీర్, పత్రికా రంగంలో, సినీ రంగంలోనూ తన సేవలందిస్తూ, రచనా ప్రక్రియను కొనసాగిస్తున్నారు. వారు రాసిన పుస్తకాలలో కొన్ని ‘దర్గామిట్ట కథలు ‘న్యూ బాంబే టైలర్స్’, ‘పోలేరమ్మ బండ కథలు’, కథలు ఇలా కూడా రాస్తారు.
వీరు రాసిన ‘న్యూ బాంబే టైలర్స్’ ప్రతిష్టాత్మకమైన ‘కథ’ అవార్డును గెలుచుకోవడమే కాక, నాటకంగా రూపాంతరం చెంది అనేక ప్రదర్శనలతో ప్రేక్షకుల ప్రశంసలందుకుంది.
చిన్న కథ రచయితగా ప్రస్థానం సాగించినప్పటికి ఈ రోజు ప్రసిద్ధ కథకుడిగా, వైవిద్యమైన కథలకు, కథారచనకు ప్రాచుర్యాన్ని, నూతన కథా రచయితలను ప్రోత్సహిస్తూ ఆదరణగా నిలిచారు ఖదీర్ బాబు గారు.
షార్ట్ స్టోరీ రచయితగా ….. చిన్న కథలు దర్గామిట్ట కథలు మరియు పోలేరమ్మబండ కథలు వాటి నేటివిటీ మరియు ప్రాంతీయ మాండలికానికి ప్రసిద్ధి చెందాయి. ముస్లిం కావడం, అతని కథలు ముస్లిం సమాజ సంప్రదాయాలు మరియు సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ రెండు సంపుటాలలోని కథలు రచయిత్రి చిన్ననాటి అనుభవాలే చిన్నపిల్లల దృష్టికోణంలో. జీవితానికి వాస్తవిక అందించే బాల్య అమాయకత్వంపై పట్టు వదలకుండా ప్రాంతీయ యాసను ఉపయోగించి సంఘటనలను రచయిత వివరించిన విధానంలోనే కథలకు అసలైన అందం ఉంది. ఈ అంశం ప్రేక్షకులను రచయిత మరియు అతని కుటుంబం జీవించిన జీవిత వివరాలను చూసేలా చేస్తుంది, ఇది పిల్లలకు స్వయంగా తెలియదు. కథలోని ఈ స్పిరిట్ హాస్యాన్ని మరియు పాథోస్‌ని కథలో చేయి కలిపి నడిపిస్తుంది. న్యూ బాంబే టైలర్స్, ఫుప్పుజాన్ కథలు, బియాండ్ కాఫీ, మెట్రో కథలు, జీరో బ్లడ్ అతని ఇతర ప్రధాన రచనలు.
సినిమా స్క్రిప్ట్ రైటర్‌గా: సినిమా స్క్రిప్ట్ రైటర్‌గా ఖదీర్ బాబు ఓనమాలు, బ్రహ్మోత్సవం, మనమంతా చిత్రాలకు డైలాగ్స్ రాశారు .
బ్రిటీష్ కౌన్సిల్ ఫెలోషిప్ : జూన్ 2013.. ప్రపంచంలోని వివిధ భాషల సాహిత్యాన్ని ఇంగ్లీషులో అనువదించడానికి ప్రతి ఏటా బ్రిటీష్ కౌన్సిల్ అందించే ప్రతిష్ఠాత్మక ‘చార్లెస్ వాల్లెస్ ఫెలోషిప్’ కు మహమ్మద్ కథలు ఎంపికయ్యాయి.ఈ ఫెలోషిప్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గెస్ట్ ప్యాకల్టీగా పనిచేస్తున్న నాగా మనోహర్ రెడ్డి ఈ కథలను అనువాదం చేయడానికి పొందారు. తెలుగు కథలకు ఈ ఫెలోషిప్ దొరకడం ఇదే తొలిసారి. ఖదీర్ బాబు తాజా పుస్తకం మెట్రో కథలు.
25 ఏళ్ల నా కథ….. 25 ఏళ్ల నా కథ అనే శీర్షికన ఖదీర్ బాబు గారు తన ఫేస్ బుక్ వాల్ పైన తన జీవిత ప్రయాణంలో తారస పడ్డ సంఘటనలు, వ్యక్తుల గురించి 20 ఎపిసోడ్స్ వరకు రాసారు. ఇవి ఎంతో ఆసక్తికరంగా, ఉద్వేగబరితంగా ముఖ్యంగా నూతన రచయితలకు ఉపయుక్తంగా ఉంటాయి.
“రైటర్స్ మీట్” : ఇది నూతన యువ రచయితలకు స్ఫూర్తిని కలిగించే కలయిక! ఖదీర్ బాబు ఆలోచనల నుండి పుట్టిన కార్యక్రమం. 2001లో తొలి రైటర్స్ మీట్ ‘కీసర గుట్ట’లో జరిగింది. అప్పటి నుండి ప్రతీ ఏడాది అనేక ప్రదేశాలలో రైటర్స్ మీట్ జరుగుతునే వుంది. ప్రతీ ఏటా “రైటర్స్ మీట్” లో పాల్గొనే కథా రచయితల లిస్ట్ పెరుగుతూనే వుంది.