విజయవాడలో వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు

5 రోజులపాటు విజయవాడలో డా. వై.ఎస్.ఆర్. నాటకోత్సవాలు-2020 (డిసెంబర్ 9 నుండి 13 వరకు)

గత ఆరు నెలలుగా ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు లేక నిరుత్సాహంతో, నిత్తేజంగా వున్న కళాకారులకు, కళాభిమానులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ప్రముఖ సంస్థ కిన్నెర ఆర్ట్ థియేటర్స్ గత 42 సంవత్సరాలుగా కొన్ని వందల, వేల సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. కిన్నెర పబ్లికేషన్స్ స్థాపించి ఎన్నో పుస్తకాలు సాహితీ లోకానికి అందించింది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, విజయనగరాలలో సాహిత్య, సంగీత, కూచిపూడి నృత్యోత్సవాలు ఘనంగా నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డా॥ వైఎస్. రాజశేఖర్ రెడ్డిగారి 11వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో 2020 డిసెంబర్ 9 నుండి 13 వరకు వైఎస్.ఆర్. నాటకోత్సవాలు నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నారు. నాటక సంస్థలు, కళాకారులు ఈ నాటకోత్సవాలు విజయవంతం అవటానికి సహకరించవలసిందిగా కోరుతున్నారు. ఈ నాటకోత్సవాలు పోటీలు కాదు… కేవలం ఉత్సవాలు మాత్రమేనని పాల్గొన దలచిన నాటక సంస్థలవారు వివరాల కొరకు కన్వీనర్ చింతకాయల చిట్టిబాబు గారిని 92464 72117 సంప్రదించాలని కిన్నెర ఆర్ట్ థియేటర్స్ కార్యదర్శి మద్దాళి రఘురామ్ తెలియజేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap