కళాకారుడు మోగిలయ్యకు మంత్రి అభినందన

నెలకు 10 వేల రూపాయల పేన్షన్

తెలంగాణా, నాగర్ కర్నూల్ కు చెందిన 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శణం మోగిలయ్య ఈ రోజు రాష్ట్ర అబ్కారి, క్రీడా , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ని కలసి తను, తన కుటుంబం కిన్నెర వాయిద్య కళకు చేసిన సేవ గురించి వివరించారు. ప్రముఖ కిన్నెర వాయిద్య కళాకారుడు దర్శణం మోగిలయ్య పరిస్థితికి చెలించిన మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మోగిలయ్యకు ప్రత్యేక పేన్షన్ నెలకు 10 వేల రూపాయల ఇవ్వాలని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు అదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కళాకారుల సంక్షేమం కోసం గుర్తింపు కార్డులు, పెన్షన్లు, ఉద్యోగాలను కల్పించి సమాజంలో ఆత్మగౌరవంతో జీవించే విధంగా అభివృద్ది, సంక్షేమా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published.

Share via
Copy link