ప్రపంచంలోనే మొదటి ఆడియో మ్యాగజైన్ కౌముది ఎడిటర్
తెలుగు సాహితి, సినీ రంగాల ప్రముఖుల గురించి 500 యూటూబ్ వీడియోల సృష్టికర్త
అస్సలు పేరు ప్రభాకర్‌రావు పాతూరి. “కిరణ్ ప్రభ’ అంటే అందరికీ తెలుస్తుంది. కిరణ్ ప్రభ తన రచనా వ్యాసంగం కోసం పెట్టుకున్న పేరు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన ఈ పేరుతోనే రచనలు చేశారు. పలు పత్రికలకు తన కవితలను పంపించేవారు. రచనలతోపాటు మిత్రులతో తరచుగా తెలుగు సాహిత్యంపై చర్చించేవారు.
అమెరికాలోని తెలుగు భాష సాహిత్యా భిమానులకు చిరపరిచితమైన పేరు కిరణ్ ప్రభ. కిరణ్ ప్రభ ఆయన అసలు పేరు కాదు… తన రచనా వ్యాసంగంకోసం పెట్టుకున్న పేరు చివరకు అదే ఆయనకు మారుపేరుగా నిలిచిపోయింది. కీర్తిని కూడా తెచ్చి పెట్టింది. నాటి తరానికి చేతి రాతలతో ఓ పత్రికను కిరణ్ ప్రభ అందించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ‘ కౌముది ‘ అనే అంతర్జాల మాసపత్రికను నడిపించి నాటి తరాన్ని, నేటి తరాన్ని కూడా మెప్పించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారి ‘తానా పత్రిక’కు ఆయన సంపాదకునిగా వ్యవహరించారు. రేడియో వ్యాఖ్యాతగా కూడా ఆయన మంచి గుర్తింపును పొందారు. కృష్ణా జిల్లా దివిసీమకు చెందిన వీరు ఉద్యోగరీత్యా 1996లో ఆయన అమెరికాకు వచ్చారు. శాన్ హెసెలో సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ మేనెజ్ మెంట్లో సీనియర్ ఆఫీసర్ గా చేరి ఓవైపు విధులను నిర్వహిస్తూనే తీరిక సమయంలో తన రచనా వ్యాసంగాన్ని కొనసాగించారు. డిగ్రీ చదివే రోజుల్లోనే ఆయన కిరణ్ ప్రభ పేరుతో రచనలు చేశారు. పలు పత్రికలకు ఆయన తన కవితలను పంపించేవారు. రచనలతోపాటు మిత్రులతో తరచుగా తెలుగు సాహిత్యంపై ఆయన చర్చించేవారు. ఆయన వాగ్దాటిని చూసి రేడియోలో కూడా ఆయనకు అవకాశాలు లభించాయి. రేడియో వ్యాఖ్యాతగా కూడా ఆయన ఎంతోమందిని ఆకట్టుకున్నారు. రేడియో వ్యాఖ్యాతగా ఆయన ప్రయాణంలో ఎన్నో అనుభవాలు చోటు చేసుకున్నాయి. వివిధ రేడియో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. టోరి రేడియోకోసం రెండు సంవత్సరాలు 100 సినిమాలు, 100 సినిమా వ్యక్తుల గురించి రీసెర్చ్ చేసి టాక్ షోలు చేశారు. ఇవన్నీ ఆయనకు మంచి పేరును తీసుకువచ్చాయి. విరిజల్లు రేడియోలో ఆయన కార్యక్రమం ప్రసారమైంది. ఆ వ్యాఖ్యానం, ఉత్సాహంలో కౌముదినిని ఆడియో మ్యాగజైన్‌గా కూడా నడపాలని భావించి అందుకు తగ్గట్టుగా మార్చి విడుదల చేశారు. ప్రపంచంలోనే మొదటి ఆడియో మ్యాగజైన్ గా కౌముది పేరు సంపాదించుకుంది.
బే ఏరియాలో జరిగే పలు సాహిత్య సమావేశాలకు, తానా లాంటి సంఘాలు నిర్వహించే సాహితీ సదస్సులకు ఆయన హాజరై ప్రసంగించేవారు. సాహిత్య సదస్సులను కూడా ఆయన నిర్వహించారు. యూటూబ్లో ప్రస్తుతం వీరు తెలుగు సాహితి, సినీ రంగాల ప్రముఖుల గురించి చేసిన 500 వీడియోలు చూడవచ్చు. ఇందులో మనకు తెలియని ఎన్నో విషయాలను రచయితల, దర్శకుల, నటుల గురించి వినగలుగుతాము. తెలుగు సాహిత్య పరిమళాలను తన మ్యాగజైన్ ద్వారా, సమావేశాల ద్వారా, రేడియో ద్వారా ఆయన అందరికీ అందించారు.