బతుకు పొలం లో గాయపడిన గేయం – విల్సన్ రావు

కవి విల్సన్ రావు గారు LIC సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ సందర్భంగా అచార్య కొలకలూరి ఇనాక్ శుభాకాంక్షలు ….

విల్సన్ రావు గారు గత పదేళ్లుగా నాకు తెలుసు. చాలాసార్లు కలిసాము. వీరు యలమంచిలి లో ఉద్యోగం చేస్తున్నప్పుడు..నా మిత్రుడు ఐ. యెస్.రావు (Rtd IAS) గారు, వారి మిత్ర బృందం కలిసి యలమంచిలి పౌర సంఘం తరఫున నాకు, శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారికి 2012 మే నెలలో పౌర సన్మానం చేశారు. ఆ కార్యక్రమంలో తానే అన్నీ చూసుకుంటూ సన్మాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. నేను చాలా సంతోషపడ్డాను. కె.విల్సన్ రావు గారు,కె.ఆంజనేయకుమార్ గారు కలిసి 2014 జూన్ మాసంలో ‘తెల్లారితే ‘ అనే మకుటంతో ఒక కవితా సంపుటి తీసుకు వచ్చారు. ఆ కవితా సంపుటిని నాకు అంకితమిచ్చారు. భారత ప్రభుత్వం వారు నాకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించిన తరువాత నేను అంకితం తీసుకున్న మొదటి గ్రంధం ఇదే. చాలా ఆనందపడ్డాను.

విల్సన్ రావు గారు జీవిత భెమా సంస్థలో అధికార బాధ్యతలు నిర్వర్తిస్తూనే అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ ఎందరో ఉద్యోగుల మన్ననలు పొందుతున్నారు. వారి సంఘ వార్షికోత్సవానికి కూడా ఒక సారి నన్ను ఆహ్వానించినట్లుగా గుర్తు. తన పై అధికారులచే అనేక ప్రశంసలు పొందటమే గాక అందరికి తలలో నాలుకలా ఉంటూ ఎవరికి ఏమి కావాలన్నా వీరే దగ్గరుండి సహాయం చేస్తుంటారని వారి సహచరులు అనడం నేను విన్నాను.
వీరు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా సాహితీ వ్యవసాయం చేస్తున్నా పదేళ్లుగా మంచి కవిత్వం రాస్తూ అనేక అవార్డులు పొందటం చూశాను. విన్నాను. విల్సన్ రావు గారికి మట్టి వాసన, మట్టి పరిమళం, మట్టి బువ్వ, మట్టి మాధుర్యం, మట్టి మమకారం బాగా తెలుసు. మట్టి.. మమతను చూపితే ఆకు పచ్చదనం, గరిక, ఆకువచ్చ అందం,వంట పొలాల సౌందర్యం, అన్నం పెట్టే అమ్మ నేల, అద్భుత డప్తులు బాగా తెలుసు.
దేవుడు తప్పిపోయాడులి అనే శీర్షికతో 2017 లో వీరు వెలువరించిన కావ్యం నిండా కనిపించే సత్యాలు..నేల, రైతు. ఈ కవి లిబతుకు పొలంలో గాయపడిన గేయాన్నిలి చూశాడు. భారమైన బతుకు పాటలు ప్రాణ తరంగాలుగా మొలకెత్తటం చూపుతాడు. రైతు ఒంటి నిండా విరగవండిన అప్పుల గాయాల్లోంచి కారుతున్న పుల్నిటితో ఏలికలకు తలంటు స్నానాలు చేయించడానికి సిద్ధమవుతాడు. సకల జనుల కళ్ళల్లో చెలిమి నువ్వు వికసించటానికి తనొక జీవ నదిని కనాలని కలగంటున్నాను …. అంటాడు. ఎంత మంచి ఆశ!

ఠాగూర్ గురించి అందరూ అనే మాట ఎందరో విన్నదే కదా! ఠాగూర్ నిరంతర బాలుడు. విల్సన్ రావు గారు కూడా నిత్య బాలుడు. ఇంత పెద్ద వాడై, ఇంత జీవితం చూశాక, ఈ నెలలో పదవి విరమణ చేస్తున్నా కూడా ఊరంటే మమకారం ఉట్టి పడుతూ ఈ ంది ఈయనకు. తన ఊరి మనుషులు నిత్య కలల కుబేరులు అంటాడు. ఊరి మట్టి మీద తీరని ఆరాటం. మట్టి బువ్వ తిన్నాడు. అంటే మట్టి పాయ్యి మీద వండి వార్చిన అన్నం అన్న మాట. తోవ తప్పుతున్న మిత్రుడ్డి సున్నితంగా సరిదిద్దే కృషి చేసిన సత్పురుషుడు విల్సన్ రావు..
స్నేహ బంధానికి హృదయమిచ్చి మిత్రుడికి ప్రాణమిచ్చే కవిది అనుబంధత్వ మాధుర్యం. స్నేహమంటే చాలా చెప్పి, తనివి తీరక లినువ్వూ నేనేలి అనేస్తాడు. లిమాటల మూటల్నిలి విప్పుకొని విని, తిని, తాగి, స్నేహ దాహం తీర్చుకునే మిత్ర ఒంటరితనం భరించలేక బాల్యంలోంచి అనుభూతులను కావ్య గానం చేయటం నేర్చుకున్న కవి అదృష్టవంతుడు. ‘ఒక మనిషి కావాలి. మనసున్న స్వచ్ఛమైన మనిషి కావాలి ‘ అని ఆశ పదుతున్నాడు.
కవులు, కవితా ప్రియులు, సహృదయులు, రసికులు, విమర్శకులు, విశ్లేషకులు వీరి కవితా సౌందర్యం తనివి తీరా అనుభవించేటప్పుడు పొందే ఆనందం అంతా ఇంతా కాదు.ఎంతో అనుభూతి సాంద్రతను అక్షరాలలోకి తెస్తేగాని ఇటువంటి ఆలంకారిక కవిత్వ పంక్తులు సృష్టి పొందవు.
ఈయన కవిత్వంలో అభివ్యక్తి ఎలా ఉ ంటుందంటే.. అమ్మ ఆధిక్యం అనటానికి ‘అమ్మ జెండాలి అంటాడు..మౌనంగా కూడా విజయం సాధించవచ్చు. అందామనుకున్న కవి – ‘గెలవాలంటే యుద్ధమే చేయాల్సిన పనిలేదులి అంటాదు. చైతన్యవంతుడైన వాడు దాసోహం అవదు అనడానికి లిప్రాధేయపడటమెరుగ ప్రభాత కిరణంలి అని తెలుపుతాడు.
ఇతడు అలంకారాలు కవిత్వం కూడా రాస్తాడు. లిపోలికలి జూలుపట్టి లాక్కొచ్చి అస్పష్టార్థాన్ని స్పష్టార్థంగా, అవిశదాన్ని, మరుగునున్న దానిని వెలుగులోకి తెచ్చే కవిత్వం రాళాదు. లిహృదయారణ్యంలో మాలను పూయించి/పరిమళమై జీవితంగా మార్చే/ అక్షరమంటే నాకిష్టంలి అంటాడు.
ఈయన కవిత్వంలో కరుణరస ప్రాధాన్యాన్ని గుర్తించవచ్చు. ఆవేదనకు అక్షర రూపం ఇవ్వటం చూడొచ్చు. అనురాగం పంచటం పరికించవచ్చు. అమ్మా నాన్నల దగ్గర ,ఆత్మీయుల దగ్గర కవి పసివాడు కావటం గ్రహించవచ్చు. కవిలో వీడితుల్ని, తాడితుల్ని, బాధితుల్ని, వేదింపబడే వాళ్ళని, జాలి,దయ, కరుణ రసార్థ దృష్టితో చూసే ఆత్మీయతా వ్యవస్థ ఉంది.
ఒక్కోసారి కోపం వస్తుంది కవికి. బహుళ జాతి కంపెనీలు భారతీయుల బ్రతుకుల్ని ఛిద్రం చేస్తుంటే సహింపలేని వేదన ఉంది. ప్రేమ కోసం తన సాహిత్యాన్ని పోరాడేట్టు చేసే కృషి ఉంది.
భాష తప్పుల్లేకుండా రాస్తాడు. అలంకారాల్ని అందంగా అల్లుకుంటాడు.గుండెను కడుక్కొని ప్రక్షాళిత పదాలతో కవిత్వం రూపొందిస్తాడు. సంక్షిప్తత, ఋజుత్వం స్పష్టత ఇతడికి అలవడిన అద్భుత భాషా కవితాంశాలు. కవి ఎంత మంచి కవితా వస్తువుల్ని ఎన్నుకుంటాడో అంతమంచి అభివ్యక్తిని రంగరించి అందమైన అనుభూతి రమ్యదృక్కులతో కవితాపధంలో వెలుగులు వెలార్చుతాడు.

ఇతని వ్యక్తిత్వం గురించి ఒక మాట చెబుతాను. ఇన్నేళ్లు వచ్చినా, ఎన్నేళ్ళు వచ్చినా, తండ్రి అయినా, తాత అయినా విల్సన్ రావు నిరంతరం పసివాడు, నిత్య నూతన బాలుడు. చల్ల గాలికి పొంగిపోతాడు. ప్రకృతి వరము రమణీయకానికి పరవశించిపోతాడు. మిత్రులంటే ప్రాణం. వాళ్లకోసం తన కాలం,ధనం ఖర్చు చేయటంలో వెనుకాడని భాగ్యోన్నతుడు. పల్లె అంటే ప్రాణం. పొలాలంటే ఎక్కళ్ళని ఉ రుకూ,పరుగూ,వంట పొలాల పట్ల తీరని ఆరాటం. మట్టి ఇష్టం.మట్టి పరిమళం ప్రాణం. లిమా ఊరు మట్టిలికి మనసిచ్చిన మధుర హృదయుడు విల్సన్ రావు.
రైతును ప్రేమించడం, ఆరాధించడం కవికే చెల్లు. పంటలు లేక, క్షామం వలన పీడింపబడే రైతు పక్షపాతి ఈయన. రైతు జెండా తాను భుజాన పెట్టుకొని కవిత్వం వ్రాశాడు. సుకుమారం, సున్నితం అయిన ప్రేమకు దాసోహమనే చిరంజీవి కవి. దుఃఖితులను చూచి సంచలించిపోయే సహృదయుడు దళితుల జీవితం ఇంతకంటే బాగుండాలని ఆరాటపడే మహోన్నత భావనంపాదకుడు. అక్షరమక్షరాన, నరనరాన మూర్తిభవించిన కవిత్వం విల్సన్ రావు.
కవులన్నా, కవి సమ్మేళనాలన్నా కవితా గోషులన్నా, సాహిత్య సభలన్నా సంతోషాంతరంగుడయ్యే పసిబాబు విల్సన్ రావు, కవులు చాలామంది ఉన్నారు. విల్సన్ రావు అరుదైన కవి. దాదాపు పాతికేళ్ళగా కవిత్వం రాస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు కవితా సంపుటులు వెలువరించాడు.
మనిషంతా కవిత్వమైన శ్రీ విల్సన్ రావు భారతీయ జీవిత బీమా సంస్థలో ఉన్నతాధికారిగా పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా వారికి ఆశీస్సులు, శుభాకాంక్షలు.

-అచార్య కొలకలూరి ఇనాక్

SA: