హరికథకు పద్మ పురస్కారం

ప్రముఖ హరికధా విద్వాంసులు కోట సచ్చిదానంద శాస్త్రికి ‘పద్మశ్రీ’ అవార్డు

ఆదిభట్ల నారాయణ దాసు యొక్క ప్రశిష్యుడు. ఈయన హరికథా శైలి ప్రత్యేకం అని చెబుతారు. 1960లు చివరి భాగం, 1980 లలో చాలా ప్రసిద్ధుడు. సచ్చిదానందశాస్త్రి గుంటూరు నివాసి. ఈయన హరికథలు, సినిమా చూస్తున్నట్లు ఉంటాయి అంటే అతిశయోక్తి లేదని చెప్పుకుంటారు. హరికథలో పాటలు, అప్పటి సినిమా హిట్ పాటలనుసరించి పాడేవారట. ఆంటే, ఆయన హరికథ చెప్తుంటే, అంత వినోదాత్మకంగా ఉంటుందన్నమాట. హరికథ చెప్తూ, ఆయన నృత్యం చేసేవారు, చక్కగా పాటలు పాడేవారు, హాస్యంగా జోక్స్ చెప్పేవారు. చెప్పే విషయం మీద అప్పటి తరం ప్రజలను ఆకట్టుకోవటానికి పూర్తి ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యేవారు. ఆంధ్రపదేశ్ లోను, ఇతర రాష్ట్రాలలోను 1500 పై చిలుకు ప్రదర్శనలు ఇచ్చి అనేకుల ప్రశంసలు, సన్మానాలు అందుకొన్నారు. పండితులకే కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లు చెప్పి వారిని మంచి మార్గంలోకి మరలేటట్టు ప్రభావితం చేయడానికి చాలా కృషి చేశారు. భారత ప్రభుత్వం 2023 సంవత్సరానికి పద్మశ్రీ పురస్కారాన్ని కోట వారికి ప్రకటించిన సందర్బాన, ప్రముఖ హరికధా విద్వాంసులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రిని గుంటూరులో వారి స్వగృహంలో కలసి మాజీ ఉపసభాపతి శ్రీమండలి బుద్ద ప్రసాద్అభినందించి సత్కరించారు. దివిసీమతో, శ్రీమండలి వెంకట కృష్ణారావు గారితో తనకుగల అనుబంధాన్ని శ్రీ శాస్త్రి గుర్తుచేసుకున్నారు. శ్రీనారదులవారు తొలి హరికధకులని, తెలుగునాట శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు హరికధా పితామహుడని, తనకు వచ్చిన పద్మశ్రీ యావత్తు హరికథాలోకానికి ఇచ్చినట్లు భావిస్తున్నానని, మానవుని మాధవునిగా, జీవుడిని దేవుడిగా చేయగల మహత్తర శక్తి హరికధకుందని శ్రీ సచ్చిదానంద శాస్త్రి చెప్పారు. హరికధ తెలుగుభాషలో ప్రాచుర్యం పొందినంత మరే భాషలో పొందలేదని, తొలిసారిగా హరికధకు పద్మా పురస్కారం రావడం అనందదాయకమని శ్రీబుద్ద ప్రసాద్ అన్నారు. ఆధునిక కాలానుగుణంగా హరికధకు జనరంజకత్వాన్ని సాదించినఘనత శ్రీ సచ్చిదానంద శాస్త్రిదని, తన చిన్నప్పడు ఎడ్లబళ్లమీద తండోప తండాలుగా శ్రీ శాస్త్రి గారి హరికధ వినడానికి ప్రజలు వచ్చేవారని శ్రీబుద్ద ప్రసాద్ అన్నారు.ఆలస్యంగానైన 89 ఏళ్ల వయస్సుగలప్రతిభామూర్తిని గుర్తించడమే కాకుండా, సర్వకళల సమాహారమైన హరికధ కళకు తగు గుర్తింపునిచ్చినందుకు భారత ప్రభుత్వానికి శ్రీ బుద్దప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకుని, హరికథ ప్రాచుర్యం ద్వారా ఇంకా ఏమి చేస్తే బాగుంటుందో అది చేయాలని శ్రీ శాస్త్రి గారు చెప్పారు.

భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించిన సందర్బాన, ప్రముఖ హరికధా విద్వాంసులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి ని గుంటూరులో వారి స్వగృహంలో కలసి మాజీ ఉపసభాపతి శ్రీమండలి బుద్ద ప్రసాద్ అభినందించి సత్కరించారు.
దివిసీమతో, శ్రీమండలి వెంకట కృష్ణారావుతో తనకుగల అనుబంధాన్ని శ్రీ శాస్త్రి గుర్తుచేసుకున్నారు. శ్రీనారదులవారు తొలి హరికధకులని, తెలుగునాట శ్రీమజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు హరికధా పితామహుడని, తనకు వచ్చిన పద్మశ్రీ యావత్తు హరికథాలోకానికి ఇచ్చినట్లు భావిస్తన్నని, మానవుని మాధవునిగా, జీవుడిని దేవుడిగా చేయగల మహత్తర శక్తి హరికధకుందని శ్రీ సచ్చిదానంద శాస్త్రి చెప్పారు.

SA: